2024లో 5 స్టార్‌ రేటింగ్‌ కార్లు.. వీటిలో ప్రయాణం చాలా సేఫ్‌, కారు కొనేముందు వీటిని కూడా పరిగణలోకి తీసుకోండి!

2024లో భారత్ NCAP, గ్లోబల్ NCAP క్రాస్ టెస్టుల్లో కొన్ని కార్లు దుమ్మురేపాయి. ఈ క్రాష్‌ టెస్ట్‌లో మంచి సేఫ్టీ రేటింగ్‌ని పొందిన కార్లకు మార్కెట్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం జనాలు కూడా సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో కార్ల సేఫ్టీ ఫీచర్లు, రేటింగ్‌ని చూసి కస్టమర్లు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రోడ్లపై ప్రమాదాల స్థాయి పెరగడం, ్రజలు కూడా ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌కి ఎక్కువగా అలవాటు పడటంతో పాటు చాలా వరకు సొంతంగా కార్లు కొనేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో 5 స్టార్ రేటింగ్‌ పొందిన కార్లు కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి..

ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మారుతీ డిజైర్, టాటా నెక్సాన్ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌టెస్ట్‌లో మంచి రేటింగ్‌ని సాధించాయి. పెద్దల అలాగే చిన్న పిల్లల సేఫ్టీలో ఈ కార్లు మంచి స్కోర్‌ని సాధించాయి. పెద్దల, చిన్న పిల్లల సేఫ్టీలో ఈ కార్లు 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి. ఈ రెండు కాకుండా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌కు గురైన ఇతర నాలుగు కార్ మోడల్‌లు తక్కువ భద్రతా రేటింగ్‌లను పొందాయి.

Tata Nexon Safety Rating

అత్యతం తక్కువ రేటింగ్‌ని పొందిన వాటిలో సిట్రోయిన్‌ eC3 అత్యంత చెత్త స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది స్టార్‌కి జీరో రేటింగ్‌ సాధించింది. అలాగే హోండా అమేజ్, ఓల్డ్ వెర్షన్‌కి 2 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. మహీంద్రా బొలెరో నియోకి 2 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇక కియా కేరెన్స్ పెద్దల అలాగే పిల్లల సేఫ్టీలో 3 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.

వీటితో పాటు భారత్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా XUV 3XO, మహీంద్రా XUV400 EV, హ్యుందాయ్ టక్సన్, సిట్రోయెన్ బసాల్ట్‌లతో పాటు Tata Curvv, Tata Curvv EV, Tata Nexon, Tata Nexon EV, టాటా పంచ్ EVలను భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పరీక్షించారు. ఈ టెస్టులో పై కార్లన్నీ మంచి స్కోర్‌ని సాధించాయి.

Citroen eC3 Safety Rating

పై వాటిలో సిట్రోయిన్ బసాల్ట్ మినహా అన్ని ఈ కార్లు 5 స్టార్ రేటింగ్‌ని సాధించాయి. ఈ టెస్టులో కూపే స్టైల్‌ ఎస్‌యూవీ బసాల్ట్ కేవలం 4 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. ఈ కార్లు భారత్‌లో సేల్స్‌లో సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ఈ కార్లన్నీ మంచి సేల్స్‌ని రాబడుతున్నాయి. సేఫ్టీ రేటింగ్‌లో మంచి స్కోర్‌తో అమ్మకాల్లో అదరగొడుతున్నాయి.

వీటితో పాటు దేశంలో అమ్మకానికి ఉన్న కార్లలో టాటా హారియర్‌, టాటా సఫారీ, ఫోక్స్‌ వ్యాగన్‌ వర్టస్‌, స్కోడా స్లేవియా, స్కోడా కుషాక్‌, మహీంద్రా స్కార్పియో ఎన్‌ (పిల్లల సేఫ్టీలో 3 స్టార్‌), హ్యుందాయ్‌ వెర్నా, మహీంద్రా XUV 700 (పిల్లల సేఫ్టీలో 4 స్టార్‌), టాటా ఆల్ట్రోజ్‌ కార్లు సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి. కావున జనాలు కార్లు కొనేముందు వీటిని పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.

Tata Curvv Safety Rating

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 18, 2024, 17:19 [IST]
English summary
2024 safetst cars by gncap and bncap crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+