స్కోడా నుంచి కొత్త కారు Superb సెడాన్‌ లాంచ్‌.. సింగిల్‌ పవర్‌ట్రెయిన్.. ధర ఎంతంటే.??

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా మరో కొత్త కారును లాంచ్‌ చేసింది. ఎట్టకేలకు స్కోడా నుంచి ప్రముఖ కారు భారత మార్కెట్‌కు తిరిగొచ్చేసింది. అదే స్కోడా సూపర్బ్‌. గత కొంతకాలంగా Skoda Superb 2024 కమ్‌బ్యాక్‌ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు విడుదలైంది. ప్రస్తుతం 100 యూనిట్లను అందుబాటులో ఉంచింది.

స్కోడా సూపర్బ్‌ సెడాన్‌ను సంస్థ సింగిల్‌ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌తో పూర్తిగా లోడ్‌ చేసిన వేరియంట్‌లో స్కోడా ఆటో ఇండియా ప్రవేశపెట్టింది. రూ. 54 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో అందుబాటులో ఉంది. స్కోడా Superb 2024 ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు తమ సమీప స్కోడా- అధీకృత షోరూమ్‌ని సందర్శించవచ్చు. లేదా స్కోడా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెలాఖరులో ఈ కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Skoda-Superb-2024-Launhed-In-India

డిజైన్‌: డిజైన్‌ పరంగా స్కోడా సూపర్బ్‌ సెడాన్‌ ముందు భాగంలో క్రోమ్ సరౌండ్‌లతో కూడిన సిగ్నేచర్ స్కోడా రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌పై లోయర్ ఎయిర్ డ్యామ్‌లు, LED హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంకా క్రిస్టల్ ఎలిమెంట్లతో LED టైల్‌ల్యాంప్‌లతో పాటు వెనుకవైపు ఫాగ్ లైట్లు ఉన్నాయి.

స్కోడా సూపర్బ్‌ సెడాన్‌ 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అయితే, మోడల్ యొక్క సిల్హౌట్‌లో మాత్రం సంస్థ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో డిజైన్‌ అండ్‌ లుక్‌ పరంగా స్కోడా ఆటో ఇండియా.. Superb సెడాన్‌ను ఆకట్టుకునేలా రూపొందించింది. ఇక ఇందులో అధునాతన ఫీచర్లను కూడా అందిస్తోంది.

Skoda-Superb-2024-Launhed-In-India

ఫీచర్లు: స్కోడా సూపర్బ్‌ సెడాన్‌లో ఫీచర్ల పరంగా 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను సంస్థ అందించింది. పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీటు కోసం మసాజ్ ఫంక్షన్, లెదర్‌తో చుట్టబడిన గేర్ నాబ్ మరియు 3-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్లను కలిగి ఉంది. వర్చువల్ కాక్‌పిట్, 12-స్పీకర్ కాంటన్ ఆడియో సిస్టమ్, రియర్‌ విండోస్, విండ్‌స్క్రీన్ కోసం రోల్-అప్ సన్ వైజర్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి.

Skoda-Superb-2024-Launhed-In-India

సేఫ్టీ ఫీచర్లు: సేఫ్టీ ఫీచర్ల పరంగా స్కోడా Superb ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ABS, హిల్ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, యాక్టివ్ TPMS, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, పార్క్ అసిస్ట్ మరియు గరిష్ఠంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లను సంస్థ అందిస్తోంది. ఈ ఫీచర్లతో స్కోడా సూపర్బ్‌ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటుంది.

ఇంజిన్‌: ఇక ఇంజిన్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. స్కోడా సూపర్బ్ 2.0-లీటర్, నాలుగు-సిలిండర్లు, TSI గ్యాసోలిన్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది 187 bhp మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటుంది.

Skoda-Superb-2024-Launhed-In-India

అంతేకాకుండా స్కోడా ఆటో ఇండియా(Skoda Auto India) కస్టమర్లతో మరింతగా కనెక్ట్‌ అయ్యేందుకు పూర్తి డిజిటలైజేషన్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కస్టమర్ల డిమాండ్లు, అవసరాలు మరింతగా నెరవేరడమే కాకుండా.. డిజిటల్‌ పరంగా మెరుగ్గా ఉండనుంది. స్కోడా తన కార్లను కొనుగోలు చేసే కస్టమర్లతో మరింతగా కనెక్ట్‌ అయ్యే ప్రయత్నంలో భాగంగా 360-డిగ్రీల డిజిటల్ కార్యకలాపాల(Skoda 360 Digital Activities)ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Skoda-Superb-2024-Launhed-In-India

దీని ప్రకారం, పాత మరియు కొత్త స్కోడా కస్టమర్లు డిజిటల్-క్వాలిటీ అనుభవాన్ని యజమాని పొందగలరు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌(Skoda Digital Platform)లను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించడానికి స్కోడా మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మార్చి 24న స్కోడా తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకునేలా వినియోగదారులను ప్రోత్సహించే ప్రయత్నంలో కార్ల కొనుగోలుదారులకు కొన్ని ఆఫర్లను ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 3, 2024, 16:41 [IST]
English summary
2024 skoda superb launched in india only 100 units available price at rs 54 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+