టాటా కర్వ్ టెస్టింగ్ వైరల్ ఫొటోలు చూశారా.??.. ప్రత్యేకతలు ఇవే.!!
టాటా మోటార్స్ నుంచి త్వరలో రాబోతున్న కంప్రెషన్ ఇంజిన్ వెర్షన్, కర్వ్(Curvv)ను టెస్ట్ చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ దేశీ కారు.. ప్రస్తుతం పూణేలో పరీక్షించబడుతోంది. మరి ఈ స్పైడ్ టెస్ట్ ఫొటోల ద్వారా వెల్లడైన ఆసక్తికర సమాచారం ఏంటో తెలుసుకుందాం..
C-SUV సెగ్మెంట్‌లో టాటా తన తదుపరి పెద్ద ఉత్పత్తిగా కర్వ్‌ను త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ కారును రెండు వెర్షన్లలో అంటే ఎలక్ట్రిక్ మరియు కంబషన్ ఇంజిన్ ఆప్షన్‌లలో విడుదల చేసేందుకు టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. కాగా టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ మరికొన్ని నెలల్లో విడుదల కాబోతుందని అంచనా..

2024 చివరి నాటికి, టాటా కర్వ్(Tata Curvv Spied Test Photos) ICE ఇంజిన్ వెర్షన్ మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో, టాటా కంపెనీ ప్రస్తుతం ఈ కారును భారతీయ రోడ్లపై టెస్టులు నిర్వహిస్తోంది. పూర్తిగా కవర్ చేస్తూ ఈ కారును పరీక్షిస్తున్నారు. పూణేలో టాటా కర్వ్ SUV ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన ఫొటోలు బయటకు వచ్చాయి.
టెస్ట్ ఫొటోల ద్వారా మాకు లభించిన సమాచారం ప్రకారం, టాటా కర్వ్ యొక్క సి పిల్లర్ స్లోప్ ఆకారంలో రూపొందించబడినట్లు తెలుస్తోంది. మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, ఇది కూపే ఆకారంలో ఉన్న కారు, కాబట్టి డిజైన్ ఇలా ఉంటుందని చెెప్పవచ్చు. మరోప్రత్యేకత ఏమిటంటే దాని అల్లాయ్ వీల్స్. ఇది నక్షత్రాల ఆకార పరిమాణంలో ఆకర్షణీయంగా పొందుపరిచారు.

అయితే టాటా కర్వ్ గురించి ఇంతవరకు సంస్థ ఎటువంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ఇక ICE ఇంజిన్ వెర్షన్ విషయానికి వస్తే, ఇది డీజిల్ మరియు పెట్రోల్ అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వెర్షన్లలో లాంచ్ అవుతుందని సమాచారం.
టాటా కర్వ్ కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. అదనంగా, కొత్త ఎంపికగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డీజిల్ ఇంజన్ విషయానికొస్తే, 1.5 లీటర్ ఇంజిన్ అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది. పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలు రెండూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడతాయని సమాచారం.

తరువాత, టాటా కర్వ్ ఇంటీరియర్‌ను పరిశీలించినట్లయితే ఇది దాదాపు టాటా నెక్సాన్‌ను పోలి ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫ్లోటింగ్ స్క్రీన్‌గా అందించబడుతుందని సమాచారం. ఇక టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ మొదట విడుదలయ్యే అవకాశం ఉండటంతో.. దాని అమ్మకాలను బట్టి, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను ప్రారంభించే సూచనలు ఉన్నాయి.
కాగా టాటా కర్వ్ ధర వివరాలు కూడా కొంతమేరకు తెలిశాయి. దీని ప్రకారం, ఎలక్ట్రిక్ వెర్షన్ కారు ధర రూ. 18 లక్షలు మరియు ICE ఇంజిన్ కారు ధర రూ. 15 లక్షల ధరతో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టాటా కర్వ్ ఖచ్చితంగా మార్కెట్‌ను విప్లవాత్మకంగా మారుస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

ఆటోమొబైల్ మార్కెట్లో సేఫ్టీ పరంగా సురక్షితమైన కార్ల జాబితాలో టాటా నెక్సాన్ కారు ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా, కర్వ్ కారు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా డిజైన్‌లో కొత్త ట్రెండ్‌లను సెట్ చేయడానికి టాటా మోటార్స్ చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో, ఈ కారు సురక్షితమైన కారుగా కూడా సంస్థ లాంచ్ చేయనుంది.


Click it and Unblock the Notifications








