2024లో టాప్‌ 5 కార్లు.. వీటిని తప్పా జనాలు వేరే వాటిని కొంటే ఒట్టు!

ప్రపంచంలోనే భారతదేశం వేగంగా విస్తరిస్తున్న కార్ల మార్కెట్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం దేశంలో లక్షల సంఖ్యలో కార్లు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమైన కార్ మార్కెట్లలో మన భారతదేశం ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల భారతీయ మార్కెట్ లో కొత్త కొత్త కార్ కంపెనీలు కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దీనికి ఉన్న డిమాండ్‌ వల్ల అనేక విదేశీ కార్ల కంపెనీలు మన దేశంలోకి ఎలాగైనా ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో కొన్ని కంపెనీలు ఇప్పటికే విజయవంతంగా మార్కెటింగ్‌ చేస్తున్నాయి. అందువల్ల కార్లు కొనేవారి సంఖ్య పెరుగుతోంది. 2024 సంవత్సరంలో కొన్ని కార్లు మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ సంవత్సరంలో టాప్‌ 5 కార్లకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

మారుతి సుజుకి డిజైర్: ఇది భారత్‌లో అంబాసిడర్ కారుగా ప్రజాదరణ పొందింది. దీని డిజైన్‌ అచ్చం అంబాసిండర్‌ని పోలి ఉంటుంది. మారుతి సుజుకి డిజైర్ అంబాసిడర్ లాగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో 10 వేల డిజైర్ కార్లు నెల చొప్పున అమ్ముడవుతున్నాయి. ఈ డిజైర్‌ 4th జనరేషన్‌ మారుతి సుజుకి డిజైర్‌ 6.49 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరతో అందుబాటులో ఉంది.

Maruti Suzuki Dzire 2024

మహీంద్రా థార్ రాక్స్‌: 2020లో విడుదలైనప్పటీ నుంచి మహీంద్రా థార్ మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌ ఆఫ్‌రోడర్‌ SUVగా ఉంది. మార్కెట్‌లో ఈ ఆఫ్‌రోడర్‌కి మంచి డిమాండ్‌ ఉంది. దీని వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రస్తుతం ఏడాదిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) గా ఉంది. ఇది మార్కెట్‌లో టాప్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీగా ఉంది.

సిట్రోయిన్ బసాల్ట్: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ కొత్త కారు బసాల్ట్‌ కూపే ఎస్‌యూనీ విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా సిట్రోయిన్‌ భారత్‌లో స్థిరపడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా బసాల్ట్‌ ఎస్‌యూవీ కూపే ఉంది. ఈ కారు నేరుగా టాటా మోటార్స్ కర్వ్‌ ప్రత్యర్థిగా ఉంది. గత ఆగస్టులో ప్రారంభించబడిన బసాల్ట్ ధరలు రూ.7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

Tata Curvv 2024

టాటా కర్వ్‌: టాటా నెక్సాన్, పంచ్ విజయవంతమైన తర్వాత టాటా మోటార్స్ సరికొత్త కర్వ్‌ని విడుదల చేసింది. ఈ కర్వ్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.9 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉన్నాయి. ఈ టాటా కర్వ్ ఈవీ వెర్షన్‌తో పాటు ICE వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇది హిట్‌ వెర్షన్‌గా ఉంది.

మహీంద్రా XUV 3XO: మహీంద్రా ఎక్స్‌యూవీని టాటా నెక్సాన్‌ని డిజైన్‌ చేసిన ప్రఖ్యాత డిజైనర్ ప్రతాప్ బోస్ రూపొందించారు. అందువల్ల ఈ కారు XUV 3XO వేరియంట్‌ని బట్టి మూడు నెలల నుంచి ఏడాదిన్నర వరక ఉంది. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ధరలు 7.79 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్‌లోనే అత్యంత డిమాండ్‌ని కలిగి ఉంది.

Mahindra Thar Roxx

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ 2024లో చాలా వరకు బెస్ట్ కార్లు లాంచ్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా టాటా కర్వ్, మహీంద్రా థార్‌ రాక్స్ వంటివి ఈ సంవత్సరంలో ప్రముఖంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ నెలాఖరులోపు మరికొన్ని కార్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. అయితే 2025లో సరికొత్త కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్లు మార్కెట్‌లో మంచి మార్కెట్‌ని రాబట్టే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2024, 16:56 [IST]
English summary
Top cars in 2024 maruti suzuki dzire to mahindra xuv 3xo
Read more on: #year ender 2024 #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+