2024లో దుమ్మురేపిన ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ కంపెనీ కార్లకు జై కొట్టిన జనాలు!

ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద కార్ల మార్కెట్‌గా అవరిస్తోంది. ఇప్పటికే భారత్‌ ఆటో రంగంలో 3వ స్థానంలో ఉంది. రానున్న కొన్ని సంవత్సరాలలో ఆటో వరల్డ్‌కి ఇండియా దిక్సూచిగా మారనుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజీల్‌, సీఎన్‌జీ కార్లతో సమానంగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం రోడ్లపై టాటా మోటార్స్‌, ఎంజీ మోటార్స్‌, మహీంద్రా ఈవీ కార్లు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కి మార్కెట్‌కి భారత్‌ కీలకంగా మారనుంది. సాంప్రదాయ వెహికిల్స్‌తో సమానంగా కొత్త ఈవీ కార్లు సరసమైన ధరలు, క్లాసీ డిజైన్, టాప్‌ క్లాస్‌ ఫీచర్లతో మార్కెట్‌లో విడుదల అవుతున్నాయి. అందువల్ల జనాలు వీటిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఫోకస్‌ చేస్తున్నాయి. ఈ సంవత్సరంలో చాలా వరకు కార్లు మంచి ప్రజాదరణను పొందాయి. ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా ఎంజీ మోటార్స్ పుంజుకుంది. ఈ కార్లు టాటా మోటార్స్‌కి గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక మహీంద్రా ఈవీ కార్ల అమ్మకాల్లో స్థిరంగా రాణిస్తున్నాయి. ఈ ఏడాదిలో టాప్‌ ఈవీ కార్లు (2024 Top EV Cars) మీకోసం..

Tata Punch EV Cars

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV): ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ని ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది టాటా పంచ్ భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ఈవీ కారుగా నిలిచింది. ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు 25 కిలోవాట్స్‌, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. ఇందులో 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 421 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉంది. దీని ప్రారంభ ధరలు రూ.9.99 (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది.

MG Windsor EV

ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV): ఈ కంపెనీ నుంచి భారతీయ మార్కెట్‌లో గ్లోస్టర్, హెక్టర్ ప్లస్, కామెట్ ఈవీతో సహా వివిధ రకాల కార్లను విక్రయిస్తుంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ కార్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన ఎంజీ విండ్సర్ ఈవీ టాప్‌ సెల్లింగ్‌ ఈవీగా ఉంది. దీని ధరలు రూ. 13.49 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి.

టాటా కర్వ్‌ ఈవీ (Tata Curvv EV): దేశంలోనే మొట్టమొదటి కూపే స్టైల్‌ ఎస్‌యూవీగా ఇది విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్‌ కారులో అధునాతన ఫీచర్లు కలవు. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ 502 కి.మీ, 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 17.49 లక్షలుగా ఉంది.

Tata Curvv EV Cars

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 18, 2024, 10:48 [IST]
English summary
2024 top electric cars tata punch to mg windsor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+