2024లో విడుదలైన తోపు కార్లు.. అవేంటో ఒకసారి మీరు చూసేయండి
ఇండియాలో కార్ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ధనవంతులే కాకుండా, మధ్యతరగతి ప్రజలు సైతం కార్లను కలిగి ఉండటం ఒక హోదాగా భావిస్తున్నారు. దీంతో దేశంలో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు కూడా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. ట్రెండ్‌ను బట్టి ఈ కార్లలో లేటెస్ట్ ఫీచర్లను అందిస్తున్నారు. పైగా ధరలు కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా కార్లను ఎంచుకుంటున్నారు. 2024లో దిగ్గజ కంపెనీలు అధునాతన మోడళ్లను లాంచ్ చేయగా, వాటి అమ్మకాలు ప్రతి నెలా పుంజుకుంటున్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, కియా ఇండియా, మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ కంపెనీల నుంచి ఈ ఏడాదిలో నాల్గవ తరం స్విఫ్ట్, క్రెటా ఫేస్‌లిఫ్ట్, కర్వ్వ్, థార్ రోక్స్, సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ మోడళ్లు ప్రజల్లో మంచి ఆదరణను సంపాదించాయి. ఈ టాప్ 5 కార్లకు సంబంధించిన ఇతర వివరాలు ఒకసారి చూద్దాం..

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్: క్రెటా ఫేస్‌లిఫ్ట్(Creta facelift)ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఇది జనవరిలో మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇప్పుడు ప్రతి నెలా 16,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్మకాలను నమోదు చేస్తుంది. స్టాండర్డ్ వెర్షన్, నైట్ ఎడిషన్ వంటి వేరియంట్లలో లభిస్తున్న కారు ధర రూ. 11 లక్షల నుండి రూ. 20.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
దీనిలో మూడు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్, ఇది 115PS వద్ద 144Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది, రెండోది 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్, మూడోది 1.5-లీటర్ యూ2 సీఆర్‌డీఐ డీజిల్ ఇంజిన్. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(MT), IVT, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ ఆటోమెటెడ్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి.

నాల్గవ తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్: పాత మోడల్ మారుతీ సుజుకీ స్విఫ్ట్(Maruti Suzuki Swift) ఇండియాలో మంచి ఆదరణను సంపాదించింది. బడ్జెట్ ధరలో లభించడంతో మధ్య తరగతి ప్రజల నుంచి దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో కంపెనీ తనకు బాగా పేరు సంపాదించి పెట్టిన స్విఫ్ట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, లేటెస్ట్ ఫీచర్లను అందిస్తూ మార్కెట్లోకి తీసుకొస్తుంది.
కంపెనీ ఈ నాల్గవ తరం స్విఫ్ట్‌ను మే నెలలో విడుదల చేసింది. ధర రూ. 6.49 లక్షల నుండి రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ మోడల్ నెలకు సగటున 16,000 కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది బెస్ట్ కారుగా ఉంది.

నాల్గవ తరం స్విఫ్ట్ 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఎంపికలతో కొత్త Z-సిరీస్‌లో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. అదిరిపోయే మైలేజ్‌ను అందిస్తుంది. ఇది MT వెర్షన్‌కు 24.8 కి.మీ, AMT వెర్షన్‌కు 25.75 కి.మీగా ఉంది.
మహీంద్రా థార్ రోక్స్: ఈ ఏడాది ఆగస్టులో థార్ రోక్స్(Thar Roxx) విడుదల అయింది. అక్టోబర్ 3న బుకింగ్‌లు మొదలు కాగా, కేవలం 60 నిమిషాల్లో 1,76,218 బుకింగ్‌లు వచ్చాయి. ఈ SUVకి ప్రజల్లో భారీ డిమాండ్ ఉందనడానికి ఇదే నిదర్శనం. దీని ధర రూ.12.99 లక్షలతో మొదలై రూ. 22.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లలో అందుబాటులో ఉంది. ఈ రెండు కూడా 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT గేర్‌బాక్స్‌తో వచ్చాయి. దీని లుక్ చూడటానికి లగ్జరీ ఫీలింగ్‌ను అందిస్తుంది. దీని ఫీచర్లు, డిజైన్ కారణంగా ప్రజలు థార్ రోక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్: కియా(Kia) ఇండియా నుంచి సోనెట్ ఫేస్‌లిఫ్ట్( Sonet facelift) జనవరిలో విడుదల అయింది. ఈ మోడల్ బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ వంటి వాటి నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఆగస్టు, సెప్టెంబర్‌లో 10,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడుపోయింది. దీని ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 15.77 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

టాటా కర్వ్: టాటా(Tata) కర్వ్ ఎలక్ట్రిక్(ev), ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) ఆప్షన్లలో అందుబాటులో ఉంది. Curvv.ev ఆగస్టులో, Curvv ICEని సెప్టెంబర్‌లో విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. Curvv.ev ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య, Curvv ICE ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో ఉంది.



Click it and Unblock the Notifications








