ఒకే కారులో కుటుంబం మొత్తం.. మైలేజ్ ఎక్కువే.. దీనిలో వెళ్తుంటే ఆ మజాయే వేరు!
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జీప్ ఇండియా నుంచి కొత్త మోడల్ SUV మార్కెట్లోకి విడుదల అయింది. దీని పేరు '2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian)'. ఎస్‌యూవీ విభాగంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తెచ్చారు. ఇది 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఈ కారు బాగా ఉపయోగపడుతుంది. దీని డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. 2025 జీప్ మెరిడియన్ SUV ధర రూ. 24.99 లక్షల నుండి రూ.36.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ప్రస్తుతం కారు బుకింగ్‌లు మొదలయ్యాయి. దీపావళికి ముందు ఘనంగా విడుదల అయిన ఈ ఎస్‌యూవీని కస్టమర్లు రూ.50,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.
జీప్ మెరిడియన్ SUV లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (O), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. కొత్త ప్రీమియం SUVగా మార్కెట్లోకి అడుగుపెట్టిన మెరిడియన్ దేశంలో కుటుంబ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది.

ఇంజిన్-సామర్థ్యం: 2025 జీప్ మెరిడియన్ SUV రెండు-లీటర్ల, నాలుగు-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 3,750 rpm వద్ద 168 bhp పవర్, 1,750-2,500 rpm మధ్య 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజ్ పరంగా ఈ కారు 16.25 kmpl వరకు అందిస్తుంది.
ఎక్స్‌టీరియర్-ఇంటీరియర్ డిజైన్: కొత్త జీప్ మెరిడియన్ SUVని ముందు నుంచి చూసినట్లయితే లగ్జరీ లుకింగ్‌ను కలిగి ఉంది. రీడిజైన్ చేసిన LED హెడ్‌లైట్‌లు, ముందు బంపర్ కింది భాగంలో క్రోమ్ స్ట్రిప్, బోల్డ్ సెవెన్-స్లాట్ గ్రిల్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో శాటిన్ క్రోమ్ యాక్సెంట్‌లతో కూడిన LED టెయిల్‌లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ నుంచి కారు చాలా అందంగా కనిపిస్తుంది.

లోపల వేగన్ లెదర్ సీట్లు, 10.25 ఇంచెస్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ పూర్తి HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఎలక్ట్రిక్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, నావిగేషన్ సపోర్ట్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్‌లెస్ మిర్రరింగ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 9-స్పీకర్ల ఆల్పైన్ ఆడియో సిస్టమ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ విత్ AC ప్రీకాండిషనింగ్, అలెక్సా హోమ్ టు వెహికల్, స్మార్ట్‌వాచ్ ఎక్స్‌టెన్షన్ అలర్ట్‌లు, ఆటోమేటిక్ SOS కాల్, కారు కండిషన్ గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక ఫీచర్, లైవ్ ట్రాఫిక్‌తో కనెక్ట్ చేసిన వన్-బాక్స్ నావిగేషన్ సెర్చ్, వాతావరణం, ఇన్సిడెంట్ అప్‌డేట్‌లు, GSDP 2.0 కనెక్టివిటీ ప్రోటోకాల్‌తో 30 కంటే ఎక్కువ ఫీచర్లను జీప్ మెరిడియన్ SUVలో అందించారు.

ప్రయాణికుల భద్రత కోసం కంపెనీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. దీని కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, టీపీఎంఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ లేన్ కీప్ అసిస్ట్, చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీ కెమెరా, వెనుక సెన్సార్లు వంటివి ఈ కారులో ఉన్నాయి.
కుటుంబంతో కలిసి సాఫీగా ప్రయాణించడానికి అనువుగా ఉన్న ఈ కారులో లగేజీ పెట్టడానికి ఎక్కువ స్థలాన్ని ఇచ్చారు. రెండు వరుసల సీట్లను మడతపెట్టి 824 లీటర్ల సామర్థ్యం వరకు సామాన్లు పెట్టుకోవచ్చు. అదే 5 సీటర్‌కు 481 లీటర్లు, ఏడు సీట్లకు 170 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది. విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఎక్కువ లగేజీని పెట్టడానికి ఇది బెస్ట్ కారు.

వేరియంట్ల వారీగా ధరలు: 2025 జీప్ మెరిడియన్ SUV లాంగిట్యూడ్(Longitude) రూ. 24.99 లక్షలు, జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్ ప్లస్( Longitude Plus) రూ. 27.50 లక్షలు, జీప్ మెరిడియన్ లిమిటెడ్ (O) రూ. 30.49 లక్షలు, జీప్ మెరిడియన్ ఓవర్‌ల్యాండ్(Overland) రూ. 36.49 లక్షలు.


Click it and Unblock the Notifications








