అగ్రరాజ్యంలో అడుగెట్టిన కియా కొత్త కారు ఇదే!.. పూర్తి వివరాలు

అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన కియా మోటార్స్.. అమెరికాలో 2025 సెల్టోస్‌ను పరిచయం చేసింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొన్ని సూక్ష్మమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. ఎక్కువ అప్డేట్స్ 2025 కియా సెల్టోస్‌ యొక్క ఈఎక్స్ మరియు టాప్ ఎండ్ మోడల్ ఎస్ఎక్స్ వంటి వాటిలో ఉన్నట్లు చూడవచ్చు. ఈ రెండూ కూడా రివర్స్ పార్కింగ్ డిస్టెన్స్ వార్ణింగ్ మరియు స్మార్ట్ పవర్ లిఫ్ట్‌గేట్‌ వంటి వాటిని పొందుతాయి. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

యూఎస్ మార్కెట్లో అడుగుపెట్టిన 2025 కియా సెల్టోస్‌.. భారతదేశంలోని కియా సెల్టోస్‌ కంటే కూడా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ట్రాఫిక్ రూల్స్ మరియు ఉద్గార ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఫీచర్స్ అందిస్తుంది. కాబట్టి అమెరికాలో విక్రయించబడే కార్లకు.. ఇండియన్ మార్కెట్లో లభించే కార్లకు పోలికలు ఎక్కువగా ఉంటాయి. బహుశా ఇన్ విషయాలు అందరికీ తెలిసే ఉంటాయి.

2025 Kia Seltos

అమెరికా మార్కెట్లో పరిచయమైన 2025 కియా సెల్టోస్‌ యొక్క ఈఎక్స్ మరియు ఎస్ఎక్స్ మోడల్స్ రివర్స్ పార్కింగ్ డిస్టెన్స్ వార్ణింగ్ మరియు స్మార్ట్ పవర్ లిఫ్ట్‌గేట్‌ పొందుతాయని అనుకున్నాం. అయితే ఇవి ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. బహుశా మిగిలిన వేరియంట్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కియా మోటార్స్ కొత్త మిడ్ స్పెక్ 2025 సెల్టోస్ ఈఎక్స్ ట్రిమ్‌ను సన్‌రూఫ్‌తో పరిచయం చేసింది. అయితే అంతకు ముందు అందుబాటులో ఉన్న ఈ వేరియంట్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కానీ కంపెనీ ఈ ఫీచర్ అందిస్తూ కొన్ని వేరియంట్లలో ఫీచర్లను తగ్గించింది. ఇందులో భాగంగానే ఎస్ ట్రిమ్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కోల్పోతుంది. ఈ స్థానంలో 4.25 ఇంచెస్ యూనిట్ ఉంది.

2025 Kia Seltos Rear Profile

అంతే కాకుండా.. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ డౌన్‌గ్రేడ్ అయినప్పటికీ, డ్రైవర్ సైడ్ పవర్ విండో స్విచ్ కోసం ఆటోమేకర్ ఆటో అప్ / డౌన్ ఫంక్షన్‌ను జోడించింది. అయితే ఇందులో అదే 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. 2025 కియా సెల్టోస్‌లోని ఇతర మార్పులు క్యాబిన్‌లో గమనించవచ్చు. ఇందులో కొత్త అపోల్స్ట్రే మరియు మెటీరియల్స్ అన్నీ కూడా కొంత అప్డేట్ అయి ఉంటాయి.

యూఎస్ మార్కెట్లోని 2025 కియా సెల్టోస్‌ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 146 బీహెచ్‌పీ పవర్ మరియు 179 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో కేవలం 9.3 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆల్ వీల్క్ డ్రైవ్‌తో 10.1 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

2025 Kia Seltos Running Shot

యూఎస్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త 2025 కియా సెల్టోస్‌ భారతదేశానికి వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది. ఇతర దేశాలకు కూడా కంపెనీ ఈ కారును విస్తరిస్తుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అమెరికాలో ఆవిష్కరించబడిన కియా సెల్టోస్‌ ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అధికారిక ధరలు కూడా త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, July 1, 2024, 11:00 [IST]
English summary
2025 kia seltos revealed in us market new features and details here
Read more on: #kia motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+