తక్కువ ధరలో కారు కావాలా..? మీ బడ్జెట్‌కు సరిపోయేలా కియా కొత్త మోడల్.. సరికొత్త స్టైలీష్ డిజైన్‌తో వస్తుందిగా!
ఇండియా మార్కెట్లో తక్కువ ధరలో లభించే కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ తయారీదారులు కూడా తమ మార్కెట్‌ను పెంచుకోడానికి బడ్జెట్ ధరలోనే అన్ని వర్గాల ప్రజలకు కొనుగోలుకు అందుబాటులో ఉండే విధంగా కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు సైతం భారత వినియోగదారులను ఆకర్షించడానికి ఇటీవల కాలంలో వరుసగా తక్కువ ధరలోనే కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్(kia Motors)కూడా ఇండియాలో కొన్ని సంవత్సరాల క్రితం తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ఇప్పుడు ఈ కంపెనీ భారీ మార్కెట్‌ను సంపాదించింది. కొన్నేళ్లుగా తన వాహనాలను వరుసగా ఇండియాలో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
కియా నుంచి మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల కాబోతుంది. దీని పేరే 'సైరోస్(syros)'. ఇది ఒక ఎస్‌యూవీ(suv). ఈ కారును రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది వచ్చే ఏడాది మొదటి నెలల్లోనే మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదట పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేసిన తర్వాత ఈవీని సైతం తీసుకురానుంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 మధ్య భాగంలో కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. అంచనాల ప్రకారం, కియా సైరోస్ ధర ఇండియా మార్కెట్లో రూ.8 లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చు. అన్ని వర్గాల వారికి కొనుగోలుకు అందుబాటులో ఉండే విధంగా కారు ధరను నిర్ణయించారు. దీనిలో టాప్ వేరియంట్ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈవీ వెర్షన్ ధర మరింత అధికంగా ఉండనుంది.
కియా సైరోస్ ఎస్‌యూవీ డిజైన్ చూడటానికి కే4(k4) లాగా ఉంటుంది. ఈ మోడల్‌ను కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. సైరోస్ పొడవుగా ఉన్నట్లు ఫోటోలను చూస్తే తెలుస్తుంది. వెనుక అమర్చిన బంపర్‌లు కూడా సన్నగా ఉన్నాయి. బయటి డిజైన్ వినియోగదారులకు కట్టిపడేసేలా ఉంది. ఇది రూఫ్ రెయిల్‌లతో బాక్సీ ఆకారాన్ని పొందుతుందని తెలుస్తుంది.

సైరోస్‌లో ఉన్న ఫీచర్లు కొంచెం సెల్టోస్‌లో ఉన్న మాదిరిగా ఉన్నాయి. క్యాబిన్ చాలా అందంగా ఉంటుందని సమాచారం. లోఫల ఫీచర్ల విషయానికి వస్తే, 10.25-అంగుళాల టచ్ స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, , వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, చుట్టు ప్రక్కల చూడాటానికి 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటివి ఉన్నట్లు సమాచారం.
ఇంకా, ప్రయాణికులకు తమ ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండటానికి మంచి పాటల అనుభూతిని అందించడానికి బోస్ ఆడియో సిస్టమ్‌తో కూడా కారులో అమర్చినట్లు తెలుస్తుంది. కారు వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేయడానికి టచ్ కంట్రోల్ ఆప్షన్ వంటివి ఉన్నాయి. కారు పొడుగ్గా ఉండడం వలన సీట్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటంతో పాటు, లగేజీ పెట్టడానికి ఎక్కువ స్థలం ఇచ్చినట్లు కారును చూస్తే తెలుస్తుంది.

కియా సైరోస్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండవచ్చు. ఈ ఆప్షన్‌లో 118bhp పవర్, 172Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్‌తో 114bhp పవర్, 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. వీటి ధరల మధ్య తేడా కూడా స్వల్పంగానే ఉంటుంది. ఈవీ వెర్షన్ గురించి మాత్రం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








