భారత్‌ను చూసి అసూయ పడుతున్న ఇతర దేశాలు! లగ్జరీ రేంజ్ రేవర్ కారుతో గట్టి సమాధానం చెప్పింది..

ప్రపంచంలోని ఇతర దేశాల్లో లేని సానుకూలతలన్నీ ఇండియాలో ఉండటం కారణంగా కార్ల తయారీ కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులు పెట్టడానికి అన్ని విధాలా సహాయ పడుతుంది. ఇక్కడే తయరీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి రాయితీలు అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు అతిపెద్ద అంశంగా మారింది. గతంతో పోలిస్తే ఇండియాలో కార్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. లోకల్‌గా ప్రజలకు అందించడమే కాకుండా ఇతర దేశాలకు సైతం కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కూడా కంపెనీలకు చాలా సులభం. అందుకే జాగ్వార్ ల్యాండ్ రోవర్(Jaguar Land Rover) తమ వాహనాలను ఇండియాలో తయరు చేసి లోకల్‌గా విక్రయిస్తూనే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనేది టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ.

విలాసవంతమైన, ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీ ఇక్కడే అసెంబుల్ చేసిన 2025 రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను (2025 range rover sport) విడుదల చేసింది. దీన్ని మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియాలోని తన ప్లాంట్‌లో విడి భాగాలను అసెంబుల్ చేసింది. గతంలో విదేశాల నుంచి రేంజ్ రోవర్ కార్లను ఇండియాలోకి దిగుమతి చేసుకునేవారు, దీంతో స్థానికంగా వీటిని ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చేది.

2025 Range Rover Sport Launched

2025 రేంజ్ రోవర్ స్పోర్ట్‌ గురించి చూసినట్లయితే దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. ఇది దాని గత మోడల్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర కంటే రూ.5 లక్షలు ఎక్కువ. ఈ విలాసవంతమైన కారును భారత్‌లోనే తయారుచేశారు. కంపెనీ దాని డైనమిక్ SE వేరియంట్‌ను నిలిపివేసి, ఈ మోడల్‌ను తెచ్చింది. లోకల్‌గా తయారు చేయడం వలన ఈ కారు రూ.25 లక్షల వరకు తగ్గింది.

కొత్త మోడల్ 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 394 bhp పవర్, 550 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ 346 పవర్, 700 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది పేరుకు తగ్గట్టుగానే లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంది. క్యాబిన్ సీట్లు చాలా మెత్తగా ఉంటాయి. ఇవి సెమీ-అనిలిన్ లెదర్ సీట్లు, మసాజ్ ఫంక్షనాలిటి ఫీచర్‌ను కలిగి ఉంటాయి.

Make In India 2025 Range Rover Sport Launched

క్యాబిన్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. 13.1-అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. ఇది PV ప్రో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. పవర్డ్, హీటెడ్ రియర్, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ సస్పెన్షన్, ఆటో-పార్కింగ్ అసిస్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మెరిడియన్ సౌండ్ సిస్టమ్, ఇల్యూమినేటెడ్ సీట్ బెల్ట్ బకిల్స్ వంటివి ఉన్నాయి. ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా అద్బుతంగా ఉంటుంది. వెనుక కూడా అందమైన రూపం కలిగి ఉంది.

ఈ ఎస్‌యూవీకి డిజిటల్ LED హెడ్‌లైట్‌లను ఏర్పాటు చేశారు. 2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ శాంటోరిని బ్లాక్,వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, చెర్రీ గ్రే, జియో గ్రీన్ వంటి కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ ఏడాది నుంచి రేంజ్ రోవర్ కార్ల విడిభాగాలను ఇంగ్లాండ్ నుంచి తీసుకువచ్చి పూణేలోని ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేసి పూర్తి రేంజ్ రోవర్ కార్లను విడుదల చేస్తున్నారు.

2025 Range Rover Sport

అంతకుముందు ఇతర దేశాల్లో అసెంబుల్ చేసి ఇక్కడి వినియోగదారుల కోసం దిగుమతి చేయడం వలన దిగుమతి పన్ను ఎక్కువ చెల్లించడం వల్ల స్థానికంగా అధిక ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇకమీదట లోకల్‌గానే అసెంబుల్ చేయడం వలన ధరలు తగ్గనున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2024, 18:20 [IST]
English summary
2025 range rover sport launched in india price and all top things details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+