మన దగ్గర తయారైన కార్లను మాత్రమే కొంటున్న ప్రపంచం.. 'Made in India' అంటే మినిమం ఉంటుంది మరీ!
మారుతి సుజుకి ఇండియా సరికొత్త మైలురాయని సాధించింది. దేశంలో తయారైన 30 లక్షలకు పైగా కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. తద్వారా దేశంలోనే అత్యధికంగా కార్లను ఎగుమతి చేస్తున్న నంబర్ 1 కార్ల తయారీ సంస్థగా తిరుగులేని శక్తిగా అవతరించింది. మరే ఇతర కంపెనీలు మారుతి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. భారతీయ మార్కెట్ లోనూ మారుతి సుజుకి ఇండియా అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది. నెలకు లక్షల సంఖ్యలో కార్లను విక్రయిస్తూ మాస్ మార్కెట్‌ని ఏలుతోంది. తాజాగా ఎగుమతుల్లో సరికొత్త రికార్డుతో మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచంలోనే మన మారుతి సుజుకి అత్యధికంగా కార్లను ఎగుమతి చేస్తున్న కంపెనీగా వేగంగా దూసుకెళ్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
భారత్ నుంచి విదేశాలకు వాహనాలను ఎగుమతి చేసే అతిపెద్ద సంస్థగా అవతరించింది. కంపెనీ ఇప్పటివరకు 30 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో వాహనాలను తయారు చేసి విక్రయిస్తోంది. సుజుకికి సైతం భారత మార్కెట్ కీలకంగా ఉంది. మొదటగా మారుతి సుజుకి 1986లో తన మొదటి ఎగుమతిని ప్రారంభించింది. తొలి విడతలో హంగేరికి 500 కార్లను ఎగుమతి చేసింది.

కార్లను ఎగుమతి చేసే క్రమంలో పలు సమస్యలను సైతం కంపెనీ ఎదుర్కొంది. ప్రతీ సమస్యను అధిగమిస్తూ ఎగుమతులను స్థిరంగా కొనసాగించడానికి వివిధ వ్యూహాలను అనుసరిస్తూనే వచ్చింది. దీంతో కంపెనీ తాజాగా ఈ మైలురాయిని చేరుకోవడానికి సహాయపడింది. 2012-13లో కంపెనీ మొదటగా 10 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేసి రికార్డు నెలకొల్పొంది. మరో 10 లక్షల కార్లు ఎగుమతి చేరుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టింది.
2020లో రెండో పది లక్షల కార్లను విదేశాలకు మారుతి సుజుకి ఎగుమతి చేసింది. అయితే చివరి పది లక్షల కార్లు చాలా వేగంగా ఎగుమతి అయ్యాయి. కేవలం మూడేళ్లలో మరో 10 లక్షల కార్లను ఎగుమతి చేసి రికార్డు నెలకొల్పింది. తద్వారా ఓవరాల్‌గా 30 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి మార్క్‌ని చేరుకుంది. ఇటీవలె కంపెనీ 1053 కార్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా 3 మిలియన్ల మైలురాయిని చేరింది.

మారుతి కార్లకు సైతం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సెలెరియో, ఫ్రాంక్స్, బాలెనో, సియాజ్, డిజైర్, ఎస్‌ప్రెస్సో వంటి కార్లను ఎక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తుంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే విదేశాల్లో భారతీయ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం భారత్‌లో తయారైన కార్లను మారుతి సుజుకి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది.
ఇందులో సుజుకికి ప్రధానంగా దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీలో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇక సుజుకి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేస్తోంది. ఇందులో భారతదేశంలో తయారైన వాహనాలను సైతం విక్రయిస్తుంది. ఇటీవలె మారుతి తన ఎగుమతి కార్లలో గ్రాండ్ విటారా, జిమ్నీ లను కూడా చేర్చింది. ఈ కొత్త కార్లను ప్రస్తుతం ఎగుమతి చేయడం ఆరంభించారు. సుజుకి క్రాస్ ఓవర్ ఫ్రాంక్స్ ఎస్‌యూవీకి జపాన్‌లో మంచి డిమాండ్ ఉంది.

గత మూడేళ్లలో మారుతి సుజుకి ఎగుమతులు ఊహించలేని విధంగా మూడు రెట్లు పెరిగాయి. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తున్నాయి. అదే విధంగా దేశీయంగా కూడా మారుతి కార్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇక 2030- 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 7.5 లక్షల వాహనాలను ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వస్తుండటంతో ఈ మార్క్‌ని చేరుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు.


Click it and Unblock the Notifications








