దేశం తలెత్తుకునేలా చేస్తున్న టాటా కార్లు.. క్రాష్ టెస్ట్‌లో అన్ని కార్లకు 5-స్టార్ రేటింగ్
దేశంలో విక్రయించే కార్ల నాణ్యత, సేఫ్టీ గురించి తెలుసుకోవడానికి భారత్ NCAP క్వాలిటీ టెస్ట్‌ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్లోబల్ NCAP, ఏషియన్ NCAP, యూరోపియన్ NCAPలు ఇలా ఇతర దేశాల్లో చాలా ఏళ్లుగా కార్ల క్వాలిటీని నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా భారత్ ఎన్సీఏపీ చేరింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 1న ఈ భారత్ NCAPని ప్రారంభించింది. భారత్ NCAPలో కార్ల టెస్టింగ్ డిసెంబర్లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నాలుగు కార్లను పరీక్షించారు. ఈ నాలుగు కూడా టాటా మోటార్స్‌కి చెందిన ఎస్‌యూవీలే కావడం గమనార్హం.
1. టాటా నెక్సాన్ ఈవీ: ఇటీవల భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో సత్తా చాటిన కార్లలో ఈ ఎస్‌యూవీ ఒకటి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్‌కు 5 స్టార్ సాధించింది. దీంతో పాటు భారత్ NCAPలోనూ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ 5 స్టార్స్‌ని పొందాయి. దేశంలోనే సేఫ్ కార్లలో ఒకటిగా నెక్సాన్ ఉంది. ప్రస్తుతం ఈవీ సేల్స్‌లో ఈ కారు దూసుకెళ్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో అడల్ట్స్ విభాగంలో 32 స్కోర్‌కి గానూ 29.86 మరియు పిల్లల సేఫ్టీలో 49 లో 44.95 స్కోరు సాధించింది. ఈ నెక్సాన్ ఈవీ ధర ప్రస్తుతం రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 465 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
2. టాటా పంచ్ ఈవీ: నెక్సాన్ ఈవీతో పాటు, ఇటీవల భారత్ NCAP క్రాష్ టెస్ట్‌ని ఎదుర్కొంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో కూడా 5 స్టార్స్‌ని సాధించింది. భారత్ NCAPలో అడల్ట్స్ విభాగంలో 32కు 31.46, చైల్డ్ ఆక్యుపెన్సీలో 49కి 45 మార్కులు సాధించింది. పంచ్ ఈవీ ప్రస్తుతం రూ .10.99 లక్షల నుండి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

3. టాటా హారియర్: టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన 5 సీట్ల ఎస్‌యూవీగా హారియర్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కారును అప్‌డేట్ చేశారు. అయితే అంతకు ముందు టాటా హారియర్‌ని భారత్ NCAPలో పరీక్షించారు. గత ఏడాది డిసెంబర్‌లో భారత్ NCAP పరీక్షించిన తొలి కారుగా హారియర్ నిలిచింది.
అందరూ ఊహించినట్లుగానే టాటా హారియర్‌కి భారత్ NCAPలో 5 స్టార్స్ రేటింగ్ వచ్చాయి. అడల్ట్స్ సేఫ్టీలో 32 స్కోర్‌కి కు 30.08, పిల్లల ఆక్యూపెన్సీలో 49 కి 44.54 మార్కులు సాధించింది. ఈ కారు ధరలు రూ .15.49 లక్షల నుంచి రూ .26.44 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. దేశంలోనే అత్యంత సేఫేస్ట్ కార్లలో టాటా హారియర్ నం.1 గా ఉంది.

4. టాటా సఫారీ: హారియర్ కంటే సఫారీ ఖరీదైన టాటా కారు. హారియర్ మాదిరిగానే సఫారీ కూడా క్రాష్ టెస్టులో 5 స్టార్లు సాధించింది. అడల్ట్స్ ఆక్యుపెన్సీలో 32 స్కోర్‌కి 30.08 మరియు పిల్లల ఆక్యుపెన్సీలో 49 కి 44.54 స్కోర్ సాధించింది. టాటా సఫారీ ధర రూ .16.19 లక్షల నుంచి రూ .27.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌ని ఎదుర్కొన్న ఈ 4 కార్లు 5 స్టార్ రేటింగ్‌ని సాధించి సత్తా చాటాయి. టాటా మార్క్ బిల్డ్ క్వాలిటీతో పాటు ప్రజల మన్నను పొందుతున్నాయి. అందుకే ఈ కారు ఈవీ, సాంప్రదాయ విభాగంలో సేల్స్ దూసుకెళ్తున్నాయి. ఈ కంపెనీ కార్లు కాకుండా భారత్ NCAPని ఎదుర్కొబోయే కార్లు ఎంత స్కోర్ సాధిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








