సెకండ్‌ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!

భారత మార్కెట్లో ఎస్‌యూవీ(Used SUVs)లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా నాన్‌- మెట్రో భారతీయ నగరాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఎస్‌యూవీలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారని వెల్లడైంది. దాదాపు 40 శాతం యూజ్డ్‌ కార్ల కొనుగోలుదారులు.. ఎస్‌యూవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశీయ మార్కెట్లో ప్రజలు ఎక్కువగా ఎస్‌యూవీలపై మక్కువ చూపిస్తున్నారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు సంబంధించి యూజ్డ్‌ కార్ల మార్కెట్ గణనీయంగా పెరగడంతో భారతీయ ఆటో పరిశ్రమ SUV పరంగా వృద్ధి చెందుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్టైలిష్‌ లుక్‌తో పాటు మెరుగైన పనితీరు ఆధారంగా ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతోంది.

Demand-For-SUVs-In-India

మారుతున్న టెక్నాలజీ(Used SUVs Market)కి అనుగుణంగా ప్రజలు ఎక్కువగా తాము కొనుగోలు చేయాలనుకునే వాహనాల్లో ఆధునిక ఫీచర్లను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలు.. తమ ఎస్‌యూవీల్లో అత్యాధునిక ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆటోమేటిక్‌ ఫీచర్లకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు.

తద్వారా యూజ్డ్‌ కార్ల(Used Cars Market) మార్కెట్‌లో కూడా ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్థిరమైన వృద్ధితో ఉపయోగించిన ఎస్‌యూవీ కార్ల మార్కెట్‌ పెరుగుతోంది. కాగా గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓనర్‌ కార్ల మార్కెట్‌ పెరిగినట్లు చెబుతున్నాయి. ఫలితంగా రూ. 1,385 కోట్ల సామూహిక లావాదేవీలు జరిగాయి.

Demand-For-SUVs-In-India

ముఖ్యంగా నాన్‌- మెట్రో భారతీయ నగరాల్లో ఎస్‌యూవీ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. అహ్మదాబాద్‌, కొచ్చి, జైపూర్‌, లక్నో నగరాల్లో యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అంతేకాకుండా టైర్‌- 2, టైర్‌- 3 నగరాల్లో ఈ వృద్ధిలో 30 శాతం పెరుగుదల నమోదైంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కాగా హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్‌ మరియు బ్యాలెనో వంటి కార్లు కస్టమర్లలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇక బ్రెజా మోడల్‌పై కస్టమర్లలో మంచి డిమాండ్‌ ఉంది.

Demand-For-SUVs-In-India

ఇక గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటోమేటిక్ కార్ల అమ్మకాలలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించింది. దాదాపు 30 శాతం వృద్ధిని సాధించింది. ఆటోమేటిక్‌ కార్లలో సౌలభ్యం మరియు లగ్జరీ ఉండటంతో కస్టమర్లు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఎస్‌యూవీలలో సన్‌రూఫ్‌లు మరియు అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు వంటి ఫీచర్లు తప్పనిసరిగా మారాయి.

ఇంకా వాహనదారులు తమ ప్రయాణంలో అంతరాయం లేని డ్రైవింగ్‌ను కోరుకుంటున్నారు. ఇంకా అత్యాధునిక సాంకేతికతో కూడిన ఫీచర్ల ద్వారా డ్రైవింగ్‌ను సులభంగా ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్లు.. మైలేజ్ మరియు మెయింటెనెన్స్‌ ఖర్చులు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2024, 14:42 [IST]
English summary
40 percent used cars buyers prefer suvs in non metro indian cities demand for these models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+