మారుతి సుజుకి స్విఫ్ట్‌ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 11 వేలు చెల్లిస్తే చాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ముందుంటుంది. భారతీయుల ఫేవరెట్‌ కార్ల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న Maruti Suzuki Swift.. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ వెర్షన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో త్వరలో విడుదల కానున్న 4th జెన్‌ స్విఫ్ట్‌ బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం మారుతి సుజుకి స్విఫ్ట్‌ మార్కెట్లో మూడవ తరం మోడల్‌ను విక్రయిస్తోంది. కాగా స్విఫ్ట్‌ లాంచ్‌ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్‌లో 29 లక్షల మంది ఈ కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మార్కెట్లో ఆధునిక ఫీచర్లు ఉన్న కార్లకు ఆదరణ పెరుగుతుండటంతో.. సంస్థ ఇప్పుడు నాల్గవ తరం స్విఫ్ట్‌ను విడుదల చేయబోతోంది.

Maruti-Suzuki-Swift-4th-Gen-Official-Bookings-Open

మే 2 వ వారంలో 4th Gen Swift విడుదల కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త వెర్షన్‌ కారు కోసం సంస్థ అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్విఫ్ట్‌ అభిమానులకు ఇది గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు 4వ తరం మారుతి సుజుకి స్విఫ్ట్‌ను మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

కస్టమర్లు రూ. 11 వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి 4th జెన్‌ స్విఫ్ట్‌(Maruti Suzuki Swift Bookings)ను బుక్‌ చేసుకోవచ్చు. లాంచ్‌ అనంతరం స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ వెల్లడించనుంది. అయితే ఈ కారు బైక్‌లతో పోటీగా అధిక మైలేజ్‌ను అందించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.

Maruti-Suzuki-Swift-4th-Gen-Official-Bookings-Open

కాగా ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న 3వ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ K12 నాలుగు-సిలిండర్ ఇంజన్‌తో ఉంది. అయితే 4వ తరం మోడల్ సరికొత్త 1.2-లీటర్ త్రీ-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతి సుజుకి వర్గాల నుంచి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఇంజిన్ అద్భుతమైన మైలేజ్‌ని ఇవ్వవచ్చని తెలుస్తోంది.

అంతేకాకుండా 4వ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో మాత్రమే కాకుండా CNG ఇంజిన్ వెర్షన్‌లో కూడా సంస్థ అందించనుంది. కాగా ప్రస్తుతం విక్రయిస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ CNG ఇంజన్ కిలోకు 30.90 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ గణాంకాల ప్రకారం నాల్గవ తరం మోడల్‌ మైలేజ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Maruti-Suzuki-Swift-4th-Gen-Official-Bookings-Open

ఇక ఫీచర్ల పరంగా కొత్త మారుతి స్విఫ్ట్‌ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లను అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీకి అనుగుణంగా అన్ని ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్ల పరంగా అధునాతన అంశాలను ఆశించవచ్చు.

ప్రస్తుతం భారత మార్కెట్లో 3వ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 6.24 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.9.28 లక్షలు కాగా ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. అయితే కొత్త స్విఫ్ట్‌ భారీ మార్పులతో వస్తుండటంతో.. ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Maruti-Suzuki-Swift-4th-Gen-Official-Bookings-Open

ప్రారంభ ధర సుమారు రూ. 6.75 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. 4th జెన్ స్విఫ్ట్‌ లాంచ్‌.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో మరియు సిట్రోయెన్ సి3 వంటి వాటికి భారీ పోటీనిస్తుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 2, 2024, 9:25 [IST]
English summary
4th gen maruti suzuki swift official bookings open launch will be in may 2nd week
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+