మైలేజ్‌లో ఈ కార్లకు తిరుగే లేదు.. కొత్త కారు కొనాలనుకుంటే ఇవి బెస్ట్‌ ఆప్షన్స్‌!

కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటే ఎవరైనా సరే చాలా లెక్కలు వేసుకుంటారు. వాటిలో ధర, మైలేజ్‌కు మొదటి ప్రాధాన్యత. మరో కొన్ని రోజుల్లో 2024 ముగుస్తుంది. ఈ ఏడాదిలో టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో సహా వివిధ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందిస్తూ ఆకర్షణీయమైన కొత్త మోడల్‌లు మార్కెట్లోకి వచ్చాయి.

అయితే, మీరు మంచి ఇంధన సామర్థ్యం ఉన్న కారు మోడల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. ఇక్కడ ఈ ఏడాదిలో భారత్‌లో ప్రారంభించిన 5 ఉత్తమ మైలేజ్ కార్ల వివరాలు అందిస్తున్నాం. కొత్త ఏడాది సందర్భంగా కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ మోడళ్లను పరిశీలించవచ్చు.

Maruti Suzuki Swift

1. న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్: 2024 మారుతి స్విఫ్ట్ మునుపటి నాలుగు-సిలిండర్ యూనిట్ స్థానంలో కొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 82 PS శక్తిని మరియు 112 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT యూనిట్‌తో జత చేయబడి ఉంటుంది.

ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క మాన్యువల్ వేరియంట్.. లీటర్‌కు 24.8 కిమీ మైలేజీని అందిస్తుండగా.. AMT వేరియంట్ 25.75 కిమీ మైలేజీని ఇస్తుంది. CNG వేరియంట్ 69 PS పవర్ మరియు 102 Nm టార్క్‌తో కొంచెం తక్కువ పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కిలోకు 32.85 కిమీ మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది.

Maruti Suzuki Dzire

2. కొత్త మారుతి డిజైర్: 2024 మారుతి డిజైర్ కొత్త తరం స్విఫ్ట్ మాదిరిగా అదే 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, అయితే CNG వేరియంట్‌తో హ్యాచ్‌బ్యాక్ కంటే ఇది మెరుగైన మైలేజీని అందిస్తుండటం విశేషం. ఇది CNGలో కిలోకు 33.73 కిమీ మైలేజీని ఇస్తుండగా.. పెట్రోల్ వెర్షన్ మాన్యువల్‌లో 24.79 కి.మీ, AMT వేరియంట్‌లో 25.71 కిమీ మైలేజీని అందిస్తుంది.

3. కొత్త హోండా అమేజ్: 2024 హోండా అమేజ్ ఒక రిఫ్రెష్డ్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ జపనీస్ ఆటో దిగ్గజం మునుపటి తరం నుంచి అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో లీటరుకు 18.65 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇది కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. లీటరుకు 19.46 కిమీల మైలేజ్‌ని ఇస్తుంది.

Honda Amaze

4. 2024 కియా సోనెట్: కియా 2024 కియా సోనెట్‌ను 6-స్పీడ్ మాన్యువల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది సెగ్మెంట్-బెస్ట్ మైలేజీని లీటరుకు 22.3 కిమీ ఇస్తుంది. కాగా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 18.6 kmpl మైలేజీని అందిస్తుందని సంస్థ తెలిపింది.

Kia Sonet

2024 కియా సోనెట్ 7-స్పీడ్ DCT యూనిట్‌తో జతచేయబడిన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ లీటరుకు 19.2 కిమీ మైలేజీని క్లెయిమ్‌ చేస్తుంది. అయితే 1.2-లీటర్ N/A ఇంజిన్ మాన్యువల్ మరియు AMT ఎంపికలలో 18.7 కి.మీ నుండి 18.83 కి.మీల ఇంధన పొదుపుని క్లెయిమ్ చేస్తుంది.

5. సిట్రోయెన్ బసాల్ట్: సిట్రోయెన్ బసాల్ట్ కూపే టిపా SUV రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో 82 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.2 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ ఇంజిన్, 110 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.

Citroen Basalt

మొదటి యూనిట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. లీటరుకు 18 కి.మీల మైలేజ్‌ను అందిస్తుంది. రెండవది 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో లీటరుకు 19.5 కి.మీ మైలేజీతో మరియు 6-స్పీడ్‌తో జత చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ లీటరుకు 18.7 కిమీ మైలేజీని అందిస్తుందని సంస్థ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 25, 2024, 9:01 [IST]
English summary
5 best fuel efficient cars launched in 2024 new zen maruti swift to citroen basalt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+