కార్లలో ఈ ఫీచర్‌కి ఉన్న క్రేజ్ వేరు.. మీ కారులో ఉందా.. ఓ సారి చెక్ చేసుకోండి.!!
వెంటిలేటెడ్ సీట్లు.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రస్తుతం కార్లలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా ఉంది. ప్రధానంగా ఈ సమ్మర్‌లో వెంటిలేటెడ్ సీట్లు ఉన్న కార్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ఉన్న కార్లు ప్రియం అని చాలా మంది వెనుకడుగు వేస్తారు. కానీ తక్కువ ధరలోనే ఈ ఫీచర్ ఉన్న కార్లు మార్కెట్‌లో ఉన్నాయి.
కారు కొనేటప్పుడు కస్టమర్లు చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ప్రస్తుత జనరేషన్‌లో సాదాసీదా ఫీచర్లు ఉన్న కార్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎయిర్ బ్యాగులు, ఇష్టమైన మ్యూజిక్‌ను మరింత క్వాలిటీగా అందించే మ్యూజిక్ సిస్టమ్, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇలా చాలా ఉన్నాయి. అయితే వీటితో పాటు వెంటిలేటెడ్ సీట్లకు కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.

వెంటిలేటెడ్ సీట్లు కారులోని డ్రైవర్ సీటుతో పాటు ప్రయాణికులకు కూడా ఉంటుంది. వీటి ద్వారా.. ప్రయాణికులకు అలసట, ఉక్కపోత అనేది తెలియకుండా మీకు మంచి గాలి ప్రసరణ అందజేస్తుంది. అంతే కాకుండా మసాజ్ కూడా చేస్తుంది. అందుకే కస్టమర్లు Ventilated Seats కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు.
సీజన్ బట్టి వెంటిలేటెడ్ సీట్లు మీకు ఉపశమనం కలిగిస్తాయి. చలికాలంలో ప్రయాణికుల శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇక సమ్మర్‌లో ఎంత ఏసీ ఉన్నప్పటికీ మీ బాడీకి ఉక్కపోత అనేది తెలియకుండా మంచి గాలి ప్రసరణతో చల్లగా ఉంచుతుంది. అయితే మార్కెట్లో చాలా తక్కువ ధరలోనే వెంటిలేటెడ్ సీట్లు కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల లిస్ట్ ఈ కథనంలో..

కియా సోనెట్: ఇటీవల కియా మోటార్స్ తన ప్రముఖ ఎస్‌యూవీ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. Kia Sonet HTX 1.0 L T-GDi 7 DCT వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్ ఫీచర్ ఉంది. అయితే ఇందులో కేవలం ఫ్రంట్ వెంటిలేషన్ మాత్రమే ఉందని గమనించాలి. ధర రూ. 12.35 లక్షలు.
టాటా నెక్సాన్: టాటా నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ DT వేరియంట్ ద్వారా వెంటిలేటెడ్ ఫీచర్‌ను టాటా మోటార్స్ అందిస్తోంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లతో అందుబాటులో ఉన్న Tata Nexon DT వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ. 13.10 లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి XL6: Maruti Suzuki XL6 1.5 L ఆల్ఫా ప్లస్ 5MT వేరియంట్‌ను వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్‌లో కూడా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధర రూ. 13.21 లక్షలు.
హ్యుందాయ్ వెర్నా: హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన హ్యుందాయ్ వెర్నా(Hyundai Verna) 1.5 L MPi పెట్రోల్ 6MT SX(O) వేరియంట్‌లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను పొందవచ్చు. ఈ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ. 14.69 లక్షలుగా ఉంది.

VolksWagen Virtus: ప్రముఖ విదేశీ బ్రాండ్ వోక్స్‌వ్యాగన్ విక్రయిస్తున్న Virtus బ్రాండ్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ కారు టాప్ లైన్ వేరియంట్ 1.0 L TSI MT లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను సంస్థ అందిస్తోంది. ధర రూ. 15.27 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








