సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీమియం ఫీచర్లతో రూ. 7 లక్షల లోపే లభిస్తున్న బెస్ట్ కార్స్

ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత ఆటోమొబైల్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. గణాంకాల ప్రకారం చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే టాప్-3 స్థానం సాధించడానికి దగ్గరగా ఉంది. దేశంలో ప్రతి ఏడాది కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. రోజు దాదాపు వేల సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లతో పాటు ముఖ్యంగా ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు రక్షణ అందించే కార్లను చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో ప్రతి చోట కార్ల యాక్సిడెంట్‌లు జరిగాయని వింటూనే ఉన్నాం. రోడ్డు మీదకు వెళ్లింది మొదలు సురక్షితంగా తిరిగి వస్తామో లేదో రోజులు ఇవి. అందుకే ధర, ఫీచర్స్, మైలేజ్ వంటి అంశాలతో పాటు కారు కొనుగోలు చేసే ముందు యాక్సిడెంట్ సమయంలో ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమైన పెర్ఫామెన్స్ ఇచ్చే కారును ఎంచుకోవడం చాలా అవసరం.

ప్రస్తుతం మార్కెట్లో సరైన భద్రత, నాణ్యత ప్రమాణాలు కలిగిన కార్లు చాలా ఉన్నాయి. కంపెనీలు దేశీయ ప్రజల రక్షణకు సంబంధించి అధునాతన మోడళ్లను విడుదల చేస్తున్నాయి. సేఫ్టి విషయంలో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు వాటిని ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుతం మార్కెట్లో 6 ఎయిర్‌బ్యాగ్‌‌‌లతో లభిస్తున్న తక్కువ ధర కలిగిన కొన్ని కార్లను క్రింది కథనంలో చూద్దాం.

6 Airbags Budget Range Cars

Maruti Suzuki Swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. ఈ కారులో ప్రయాణికుల రక్షణకు సంబంధించి 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. అదనంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP),యాంటీ-లాక్ బ్రేకింగ్ (ABS) సిస్టం సిస్టం, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ISOFIX (చైల్డ్-సీట్ మౌంట్) వంటివి ఉన్నాయి. ఈ కారు ధర రూ.6.49 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది.

Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు రక్షణ లభిస్తుంది. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్, ISOFIX (చైల్డ్-సీట్ మౌంట్), 3-పాయింట్ సీట్ బెల్ట్, చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీ కెమెరా, సీట్ బెల్ట్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్(ESP),యాంటీ-లాక్ బ్రేకింగ్ (ABS) సిస్టమ్,TPMS, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. దీని ధర రూ.6 లక్షలు(ఎక్స్-షోరూమ్).

6 Airbags Cars Under 7 Lakh

Hyundai Exter:హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 6.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ప్రారంభ ధర. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS), యాంటీ-లాక్ బ్రేకింగ్ (ABS) సిస్టం, డ్యూయల్ డాష్ క్యామ్, 3-పాయింట్ సీట్ బెల్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ సెన్సార్, సీట్ బెల్ట్ అలర్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మెడల్ ధర ఇండియాలో రూ.5.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. అదనంగా మరింత రక్షణ అందించడానికి సీట్ బెల్ట్ వార్నింగ్, చైల్డ్ లాక్, 3-పాయింట్ సీట్ బెల్ట్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్, యాంటీ-లాక్ బ్రేకింగ్ (ABS) సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS) వంటివి లోపల ఉన్నాయి.

6 Airbags Budget Range Cars Under 7 Lakh

ప్రస్తుతం వాహన తయారీదారులు అన్ని కార్లలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మరిన్ని సేఫ్టీ ఫీచర్లను ఇస్తున్నారు. బేస్ వేరియంట్ ‌నుంచే డజన్ల కొద్ది భద్రతా సదుపాయాలరు ఇవ్వడం మొదలుపెట్టాయి. గతంలో ఎక్కువ ధర కలిగిన ప్రీమియం కార్లకు ఇలాంటివి ఇవ్వగా, ఇప్పుడు అన్ని కార్లలో అందిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 31, 2024, 8:30 [IST]
English summary
6 airbags under 7 lakh price budjet range cars
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+