మీ పాత కారుని సింపుల్‌గా అమ్మేయండి.. బ్రోకర్ సహాయం కూడా అవసరం లేదు.. 7 మార్గాలున్నాయి
పాత రోజుల్లో కారు విక్రయించడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. ముఖ్యంగా కొందరు తెలిసిన వ్యక్తులకు కారుని అమ్మేసి ఎంతో కొంత తీసుకునేవారు. మరికొందరు దగ్గర్లోని మెకానిక్ సహాయంతో కారుని సేల్ చేసే వారు. అప్పట్లో కారు విక్రయించడం అంటే పెద్ద సవాళ్లతో కూడుకున్న ప్రశ్నగా ఉండేది. కానీ నేటి ప్రపంచంలో పాత కారును అమ్మడం చాల సులభం అయ్యింది. ముఖ్యంగా ఈ ఇంటర్‌నెట్ యుగంలో ఇంట్లోనే ఉండి కారుని అమ్మేసే సౌకర్యం వచ్చింది. మీకు నచ్చిన విధంగా కారుని విక్రయించి మంచి ధరను పొందవచ్చు. ముఖ్యంగా మీ కారుని విక్రయించే 7 ముఖ్యమైన దశలు మీకోసం..
మీరే విక్రయించండి: మీ కారును మీరే అమ్మడం అనేది ప్రస్తుతం ట్రెండింగ్. ఇందుకోసం సామాజిక మాధ్యమాలలో కారుకి సంబంధించిన వివరాలను వివరిస్తూ చేసిన వీడియోను సోషల్ మీడియా లేదా ఓఎల్ఎక్స్ పోస్ట్ చేయడం ద్వారా మీ కారుని విక్రయించవచ్చు. ఇది సులభమైన పద్ధతి. కాకపోతే మీ కారు ధర మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలపై మీకు కచ్చితమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే అంతిమ నిర్ణేతలు మీరే కాబట్టి.

డీలర్‌షిప్ షోరూమ్‌లో ఎక్స్‌ఛేంజ్: మీరు బిజీగా ఉండి కారును విక్రయించలేని స్థితిలో ఉంటే ఆ కారు బ్రాండ్‌కి సంబంధించిన దగ్గర్లోని డీలర్‌షిప్ షోరూమ్‌లో మీ కారుని ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త కారుని కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు ఆశించనంత ఎక్స్‌ఛేంజ్ సొమ్ము మీకు అందకపోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఛార్జెస్ ఇతర సర్వీస్ ఛార్జీల వల్ల మీ కారుకి తక్కువ డబ్బు వస్తుంది.
యూజ్డ్ కార్ల డీలర్స్ ద్వారా: డీలర్‌షిప్ షోరూమ్ కంటే దగ్గరలో ఉన్న యూజ్డ్ కార్ల కోసం బ్రోకర్‌ను సంప్రదించడం వల్ల పని మరింత వేగంగా జరుగుతుంది. డీలర్‌షిప్ మాదిరిగా కాకుండా ఈ పద్ధతిలో మీ కారుకు సరిపడా ధరను పొందవచ్చు. ప్రస్తుతం ఎక్కువ మంది యూజ్డ్ కార్ల డీలర్లను సంప్రదించడం ద్వారా కార్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వందల సంఖ్యలో యూజ్డ్ కార్ల డీలర్స్ ఉన్నాయి. మంచి డీలర్ వద్ద మీ కారుని విక్రయించి అధిక ధరను పొందండి.

ఆన్‌లైన్ సేల్స్: వాహనాల విక్రయం కోసం ప్రత్యేకంగా ఓఎల్ఎక్స్ ఆటోస్ అనే వెబ్‌సైట్ ఉంది. వీటితో పాటు కార్ దేఖో, కార్ 24 వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలకు చెందిన వ్యక్తులు స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ కారును తనిఖీ చేస్తారు. అంటే మీ పాత కారును ఎక్కడికి వెళ్లకుండా ఇంటివద్దే విక్రయించవచ్చు. అయితే ఇందుకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారు.
వేలం: ఇది ప్రతి కారుకు ఇది వర్తించదు. మీ కారు అరుదైన బిల్డ్ కారు లేదా యూనిక్ ఫీచర్లు ఉన్న పాత కారు అయితే దానిని వేలంలో విక్రయించవచ్చు. కానీ కారును వేలం కేంద్రానికి తీసుకెళ్లి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు అదృష్టవంతులైతే మరియు మీ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపించవచ్చు. అయితే మీరు ఊహించని దానికంటే వేలంలో అధిక ధరకు కారును విక్రయించవచ్చు.

క్రషింగ్: మీరు మీ కారును ఎక్కడైనా అమ్మలేకపోతే దానిని పాత ఇనుప దుకాణానికి తీసుకెళ్లండి. ఎందుకంటే మీ కారుని క్రషింగ్ కోసం విక్రయించవచ్చు. ఇలాంటి సందర్భాలను కేవలం మీ కారు కండీషన్ సరిగ్గా లేనప్పుడు, మీ కారు రోడ్లపై తిరగడానికి సరైన పత్రాలు అవసరం లేని సందర్భంలో ఈ విధానానికి వెళ్లవచ్చు. అయితే ఈ సందర్భంలో మీరు కారు ధరలో కనీసం 10% శాతం సొమ్ము కూడా పొందలేరు.
బంధువులకు లేదా స్నేహితులకు: ఇంటర్నెట్, డీలర్‌షిప్‌ల వద్ద ఎక్స్‌ఛేంజ్ సౌకర్యం లేని రోజుల్లో మనం కారును అమ్మాలనుకుంటే స్నేహితులకు, ఇతర పరిచయస్తులకు చెప్పడం తప్ప చేసేదేమీ ఉండేది కాదు. దీంతో స్నేహితుడు లేదా బంధువు వచ్చి కారు కావాలని అడిగి కొనుగోలు చేసేవారు. ఇది చాలా పాత పద్ధతి. కొంతమంది ఇప్పటికీ ఇలానే కార్లను విక్రయిస్తూ సంతృప్తి చెందుతున్నారు.
డ్రైవ్స్‌పార్క్ ఒపీనియన్: మీ కారుని మీరు విక్రయించబోతున్నట్లయితే దానికి తగినట్లుగా ఆమోదయోగ్యమైన ధరను సెట్ చేస్తేనే అది త్వరగా అమ్మబడుతుంది. 70's, 80's నాటి అరుదైన క్లాసిక్ కార్లను కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన నుంచి పాత కార్లను అమ్మడం కొంచెం కష్టమే. పైన పేర్కొన్న మార్గాల్లో ఒకదాన్ని అనుసరించడం ద్వారా మీ కారును విక్రయించడానికి ప్రయత్నించండి.


Click it and Unblock the Notifications








