రూ. 10 లక్షల లోపు ధరలో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌తో ది బెస్ట్‌ కార్లు ఇవే..

వేసవి ప్రారంభం కావడంతో కారులో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. డ్రైవింగ్‌లో పదే పదే ఏసీ టెంపరేచర్‌ను అడ్జస్ట్‌ను చేసే అవసరం లేకుండా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చారు. ఈ క్రమంలో రూ. 10 లక్షల లోపు ధరలో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉన్న కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే.. ఇక్కడ ఏడు కార్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటోమొబైల్‌ రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక ఆటోమేటిక్‌ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ యాక్సెస్‌ ద్వారా వాహనదారులు లేదా డ్రైవర్లు సురక్షితమైన రైడింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ క్రమంలో బడ్జెట్‌ ధరలో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉన్న కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మీ కోసమే..

Tata-Punch-Automatic-Climate-Control

టాటా పంచ్‌(Tata Punch Micro SUV): భారత మార్కెట్లో టాటా పంచ్ మైక్రో-SUV ధర రూ. 6.13 లక్షల నుండి రూ. 10.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. టాటా పంచ్‌ టాప్-స్పెక్ క్రియేటివ్ వేరియంట్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్‌ను పొందవచ్చు. దీని ధర రూ. 8.85 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌(Hyundai Exter): మైక్రో-SUV సెగ్మెంట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉన్న మరో బడ్జెట్‌ ఫ్రెండ్లీ కారు హ్యుందాయ్ ఎక్స్‌టర్. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ దాని మిడ్‌-స్పెక్‌ SX వేరియంట్‌లో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను అందిస్తోంది. ధర రూ. 6.13 లక్షల మరియు రూ. 10.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా.. మిడ్‌-స్పెక్‌ SX ధర రూ. 8.23 ​​లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Nissan-Magnite-Automatic-Climate-Control

నిస్సాన్‌ మాగ్నైట్(Nissan Magnite): సబ్‌కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో బెస్ట్‌ కారు కొనుగోలు చేయాలనుకుంటే నిస్సాన్ మాగ్నైట్‌ని పరిశీలించవచ్చు. దాని వన్-ఎబోవ్-బేస్ XL వేరియంట్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్‌ను పొందవచ్చు. రూ. 7.04 లక్షలు(ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఇదే అత్యంత సరసమైన మోడల్. మాగ్నైట్ ధరలు రూ. 6 లక్షల నుండి రూ. 11.27 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

రెనాల్ట్‌ కైగర్‌(Renault Kiger): సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్నెంట్లో మాగ్నైట్‌ లాగానే, Renault Kiger కూడా ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ని అందుబాటులో ఉంచింది. టాప్ RXT(O) వేరియంట్‌లో ఈ ఫీచర్‌ను చూడవచ్చు. ధర రూ. 8 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇక కిగర్ ధరలు రూ. 6 లక్షల నుండి రూ. 11.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

Renault-Kiger-Automatic-Climate-Control

టాటా నెక్సాన్‌(Tata Nexon): రూ. 10 లక్షల బడ్జెట్‌ ధరలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ని అందించే ఉత్తమ కార్లలో టాటా నెక్సాన్‌ ఒకటి. వన్-ఎబోవ్-బేస్ ప్యూర్ ట్రిమ్‌లో ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ధరలు రూ. 9.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఇది టచ్ బేస్‌డ్‌ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌. కాగా నెక్సాన్ ధరలు ప్రస్తుతం రూ. 8.15 లక్షల నుండి ఉన్నాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా(Maruti Suzuki Brezza): మారుతి బ్రెజ్జా వన్-ఎబోవ్-బేస్ VXi వేరియంట్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో VXi వేరియంట్‌ల ధరలు రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉన్నాయి. కాగా బ్రెజ్జా ధరలు బేస్ వేరియంట్‌ నుంచి టాప్‌ వేరియంట్‌ వరకు పరిశీలిస్తే.. రూ. 8.34 లక్షల నుండి రూ. 14.14 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Maruti-Suzuki-Fronx-Automatic-Climate-Control

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌: ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను అందించే రూ. 10 లక్షల లోపు కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ఒకటి. దాని బేస్-స్పెక్ వేరియంట్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. మార్కెట్లో ఫ్రాంక్స్ ధర రూ. 7.51 లక్షల నుండి రూ. 13.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 25, 2024, 19:12 [IST]
English summary
7 suvs which offer automatic climate control under rs 10 lakhs budget tata punch hyundai exter etc
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+