కార్లు కొనేవారికి బంపర్ ఆఫర్.. డీలర్స్ వద్ద 8 లక్షలకు పైగా కార్లు స్టాక్.. ధరలు భారీగా తగ్గే అవకాశం!
ఏదైనా ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గితే దాని ధర కూడా తగ్గుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇదే మంత్ర కార్ల సేల్స్‌కి కూడా వర్తిస్తుంది. అందువల్ల ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి నెలా సేల్స్‌ని బేరిజు వేసుకుంటూ నిర్దిష్ట సంఖ్యలో కార్లను ఉత్పత్తి చేస్తాయి. కార్ల అమ్మకాల గురించి చాలా మందికి తెలిసినప్పటికీ వాహన తయారీదారులు ప్రతి నెలా ఎంత మొత్తంలో వాహనాలను తయారు చేస్తారో చాలా మందికి తెలియదు. నష్టాలను చవిచూడకుండా లేదా మార్కెట్ అంచనా ప్రకారం స్టాక్ స్టోరేజీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కార్ల అమ్మకాలను బట్టి డీలర్‌షిప్స్‌కి అంతే మొత్తంలో యూనిట్లను పంపిస్తారు. కంపెనీలు సేల్ చేసే ప్రత్యేక మోడల్ డిమండ్లను బట్టి స్టాక్‌ని రెండు నెలలకు సరిపడా తయారు చేస్తాయి. ప్రతీ కంపెనీ స్టోరేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది.
ఉదాహరణకు మారుతి సుజుకి రెండు నెలలకు సరిపడా స్టాక్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్లకు డిమాండ్ ఎక్కువ కాబట్టి కంపెనీ అందుకు తగినట్లుగా స్టాక్‌ని కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఇక మహీంద్రా విషయానికి వస్తే డిమాండ్ ఆధారంగా స్టాక్‌ని పెంచడం చేస్తుంది. ఉదాహరణకు ఈ సంస్థకు చెందిన మహీంద్రా థార్‌ని పొందాలంటే ఏడాదిన్నర వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే దీని స్టాక్ డైరెక్ట్ డెలివరీకే వెళ్తుంది అన్నమాట.

మహీంద్రాలో చాలా కార్లది ఇదే పరిస్థితి ఉంటుంది. టాటా మోటార్స్, హ్యూందాయ్ కంపెనీలు మారుతి వలె స్టాక్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో యార్డుల్లో కార్ల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ పండుగ సీజన్‌కి ముందు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడమే దీనికి ప్రధాన కారణం అని ఆటో రంగం నిపుణులు భావిస్తున్నారు. తాజా డేటా ప్రకారం మే నుంచి డీలర్‌షిప్స్ వద్ద స్టోరేజీ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ప్రస్తుతం డీలర్‌షిప్స్ వద్ద 7,90,000 వాహనాలు అమ్ముడుపోకుండా ఉన్నట్లు ఫాడా (Federation of Automobile Dealers Associations) వెల్లడించింది. అయితే అమ్మకాలు తగ్గినప్పటికీ చాలా వాహనాలను డీలర్‌షిప్‌లకు పంపడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలిసింది. దీపావళి సందర్భంగా షోరూంకు కస్టమర్లు వస్తారనే ఆశతో పలు డీలర్‌షిప్స్ స్టాక్‌ని పెంచుకున్నాయి. వాస్తవానికి బెస్ట్ సెల్లింగ్ కార్లను మాత్రమే డీలర్‌షిప్స్‌కి పంపిస్తారు.

అయితే అమ్మకాలు మందకొడిగా సాగడంతో అంచనాలు తలకిందులు అయ్యాయి. అయితే దీపావళికి వాహన అమ్మకాలను పెంచడానికి వాహన తయారీదారులు డిస్కౌంట్లను కూడా ప్రకటించేశాయి. అయితే అక్టోబర్‌లో కార్ల అమ్మకాలు ఊపందుకునే అవకాశం ఉంది. కావున మిగిలిపోయిన స్టాక్ కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే దీని గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. పలు వాహనాలకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది.
వీటిలో మారుతి సుజుకి స్విఫ్ట్, ఫ్రాంక్స్, టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, అల్కజార్, మహీంద్రా XUV 3XO, థార్ రాక్స్ వంటి కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కార్లన్నింటికీ మంచి డిమాండ్ ఉండటంతో వీటి అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ నెలలో దాదాపు 4.5 లక్షల కార్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో కొన్నింటి వెయిటింగ్ పీరియడ్ కూడా రాకెట్ లా బౌన్స్ అయినట్లు సమాచారం.

అదే విధంగా తయారీ ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద మొత్తంలో వాహనాలను తయారు చేసి వాటిని నిల్వ ఉంచుకోవడం వల్ల వాటికి పెను భారంగా మారుతోంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం సుమారు రూ.79 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ సీజన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోతే, రాబోయే నెలల్లో కార్లపై భారీ ఆఫర్లను ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








