2024 Acer FASTER Awards.. బైక్‌ ఆఫ్‌ ది ఇయర్‌, కార్ ఆఫ్‌ ది ఇయర్‌ విజేతలివే.!!

వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన ఏసర్‌ ఫాస్టర్‌ అవార్డ్స్‌ 2024(Acer FASTER Awards 2024) మూడవ ఎడిషన్‌.. గురువారం(ఫిబ్రవరి 29)న అట్టహాసంగా ముగిసింది. ఢిల్లీ వేదికగా J.W మారియట్‌లో ఘనంగా అవార్డుల వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌లో ఉత్తమ వాహన తయారీదారులుగా ఎవరు అవార్డులు అందుకున్నారో ఈ కథనంలో చూసేయండి.

ఏసర్‌ ఫాస్టర్ అవార్డుల మూడవ ఎడిషన్, ఢిల్లీలో అద్భుతమైన అవార్డుల వేడుకతో ముగిసింది. ఈ ఈవెంట్‌లో బైక్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ నిలవగా.. హ్యుందాయ్‌ వెర్నా కార్ ఆఫ్‌ ది ఇయర్‌గా బహుమతిని సొంతం చేసుకుంది. 2023 క్యాలెండర్ ఇయర్ నుండి అత్యుత్తమ టూ వీలర్‌ మరియు ఫోర్-వీలర్ తయారీదారులు, PR ఏజెన్సీలు, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ టీమ్‌లు మరియు ఆటోమోటివ్ పర్సనాలిటీలు పలు అవార్డులను సొంతం చేసుకున్నాయి.

Acrer-FASTER-Awards-2024

ఏసర్ ఫాస్టర్ అవార్డుల విజేతలను ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా వ్యూయర్స్‌ను ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల ద్వారా అత్యంత అనుభవజ్ఞులైన ఆటోమోటివ్ జర్నలిస్టుల జ్యూరీ ఎంపిక చేసింది. కాగా ఈ జ్యూరీ రౌండ్‌ గురుగ్రామ్‌లో ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో జరిగింది.

Acrer-FASTER-Awards-2024

Acer FASTER awards విజేతల జాబితాను పరిశీలిస్తే.. కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా Hyundai Verna నిలిచింది. బైక్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా Royal Enfield Himalayan, ప్రీమియం కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మెర్సిడెస్‌ బెంజ్‌ GLC, ప్రీమియం బైక్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్ట్‌ మెటిరో 650, స్కూటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా హీరో జూమ్‌ కిరీటాన్ని సొంతే చేసుకున్నాయి.

Acrer-FASTER-Awards-2024

ఇక ఏసర్‌ ఫాస్టర్‌ అవార్డ్స్‌ 2024 లో EV ఆఫ్‌ ది ఇయర్‌గా ఫోర్‌ వీలర్‌ విభాగంలో హ్యుందాయ్‌ ఐయోనిక్‌ 5, టూ వీలర్ విభంగాలో రివర్‌ ఇండీ, అప్‌డేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కియా సెల్టోస్‌, ఆటో టెక్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా టీవీఎస్‌ అపాచీ RTR 310 అవార్డులను కైవసం చేసుకున్నాయి. కూల్డ్‌ అండ్‌ హీటెడ్‌ సీట్స్‌ ఈ బైక్‌ ప్రత్యేకత.

ఇండస్ట్రీ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ CTO సీవీ రామన్‌, కమ్యూనికేషన్స్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పీఆర్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ సంజీవ్‌ హందా అవార్డులను పొందారు. మోటార్‌స్పోర్ట్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా హరీత్‌ నోహ్‌(మోటార్‌స్పోర్ట్‌ అథ్లెట్‌ టీవీఎస్‌ మోటార్ కంపెనీ) నిలిచారు.

Acrer-FASTER-Awards-2024

అవార్డ్ ఆఫ్ హానర్‌ను మనీష్ టాండన్ (డివిజనల్ మేనేజర్ -బజాజ్ ఆటో లిమిటెడ్‌లో ఉత్పత్తి నిర్వహణ & కస్టమర్ ఇన్‌సైట్), CSR ఇనిషియేటివ్స్ ఆఫ్ ది ఇయర్‌గా MG సేవా, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా కియా ఇండియా నిలిచారు.

PR టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా ఫ్లీష్‌మాన్ హిల్లార్డ్, PR పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా సాహిర్ సేథ్ (Adfactors PR వద్ద అకౌంట్స్‌ డైరెక్టర్), ఆటో యాడ్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్‌గా మారుతి సుజుకి జిమ్నీకి అవార్డులు అందించారు.

Acrer-FASTER-Awards-2024

FASTER ద్వారా ప్రజలకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో తమ వంతు కృషి చేస్తూనే ఉంటామని Acer FASTER అవార్డ్స్ 2024లో Motoroids ఎడిటర్ మరియు FASTER ఛైర్మన్ అమిత్ చంగాని అన్నారు. ఈ ట్రోఫీలు విజేతలకు విలువను పెంచడమే కాకుండా వారి గర్వకారణంగా నిలుస్తాయని GearFliQ ఎడిటర్ మరియు FASTER సెక్రటరీ నరేంద్ర శర్మ వెల్లడించారు. వినియోగదారుల అంచనాలను అధిగమించి మార్కెట్లో ప్రభావం చూపిన వ్యక్తులను, ఉత్పత్తులను గుర్తించి ప్రజలకు తెలియజేస్తున్నట్లు వివరించారు.

Acrer-FASTER-Awards-2024

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 11:01 [IST]
English summary
Acer faster awards 2024 re himalayan and hyundai verna crowned bike and car of the year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+