సరసమైన CNG కార్లు!.. ధర తక్కువ, ఎక్కువ మైలేజ్
ఆధునిక కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ కార్ల విక్రయాల మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలో మౌలిక సదుపాయాలు కొంత తక్కువగా ఉండటం వల్ల చాలామంది సిఎన్‌జీ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా మార్కెట్లోకి సీఎన్‌జీ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో సరసమైన సిఎన్‌జీ కార్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? మైలేజ్ వివరాలు ఏంటి? అనే సమాచారం ఈ కథనంలో చూసేద్దాం..
భారతీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి అత్యధిక ప్రజాధారం పొందుతున్న మారుతి ఆల్టో.. సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. రూ. 573500 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సీఎన్‌జీ విభాగంలో తక్కువ ధరలకు లభించే కార్ల జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ (Maruti Suzuki WagonR CNG) కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 644501 (ఎక్స్ షోరూమ్). ఇది ఒక కేజీ సీఎన్‌జీతో 33.47 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. రూ. 840000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే మారుతి బాలెనొ సీఎన్‌జీ కూడా సరసమైన కార్ల జాబితాలో ఒకటి.
మారుతి బాలెనొ సీఎన్‌జీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకూండా.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 25.51 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. పెట్రోల్ మోడల్ కారుతో పోలిస్తే.. సీఎన్‌జీ మోడల్ ఎక్కువ మైలేజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఇప్పుడు సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మారుతి సుజుకి ఎర్టిగా సీఎన్‌జీ కూడా ఉత్తమ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 1078000 (ఎక్స్ షోరూమ్). ఇది 26.11 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. ఎర్టిగా మోడల్ ఇండియన్ మార్కెట్లో మంచి ఆదారాన్ పొందుతున్న మోడల్. ఈ కారణంగా ఇది ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ 27.1 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 843300 (ఎక్స్ షోరూమ్).
ఇక టాటా పంచ్ సీఎన్‌జీ విషయానికి వస్తే.. ఇది రూ.722900 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభించే సురక్షితమైన కారు. ఇది 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ మోడల్ అత్యుత్తమ పనితీరుని అందిస్తుంది. టాటా పంచ్ ఉత్తమ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. టాటా పంచ్ ఇప్పుడు మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల కంటే సీఎన్‌జీ ధరలే కొంత తక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది కస్టమర్లు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు తమ కార్లను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి త్వరలో మరిన్ని సీఎన్‌జీ కార్లు మార్కెట్లో విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








