ఈ ఎలక్ట్రిక్ కార్లలో ట్రాఫిక్‌లోనూ డ్రైవింగ్ చాలా ఈజీ.. ధర రూ. 15 లక్షల లోపే
లాంగ్ జర్నీలకు పెద్ద కారు ఎంత అనుకూలంగా ఉంటుందో.. నగర అవసరాలకు చిన్న కారు అంత అనుకూలంగా ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ జాంతో కిటకిటలాడే రోడ్లపై చిన్న కారులో ప్రయాణించడం సులువు.మార్కెట్లో అందుకు అనుగుణంగా ఆటో మేకర్లు చిన్న ఎలక్ట్రిక్ కార్లను తయారు చేశారు. మీరు అలాంటి ఓ మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ స్టోరీ మీ కోసమే..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. క్రమంగా ప్రజలు పర్యావరణ అనుకూలమైన ఈవీలపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో స్టార్టప్‌లు సత్తా చాటుతుండగా.. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ఆశాజనకమైన సేల్స్‌ను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో నగరవాసులకు సరిపోయేలా రూ. 15 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఈ కథనంలో..

ఎంజీ కామెట్ ఈవీ: నగర పరిమితుల్లో డ్రైవ్ చేసేందుకు సరిపోయే ది బెస్ట్ కారు MG Comet EV. ఈ చిన్నఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 230 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఎంజీ కామెంట్ ఈవీ ఐదు వేరియంట్లు.. ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ FC లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.
ఎంజీ కామెట్ ఈవీ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ లోపల తగినంత స్థలం ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి సులభంగా ఉండటంతో పాటు పార్కింగ్ కూడా సమస్య ఉండదు. అంతేకాకుండా ఇందులో అధునాతన ఫీచర్లు వైర్‌లైస్ ఆండ్రాయిడ్, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ లైటింగ్, క్లౌడ్ కనెక్టివిటీ, వంటి వాటిని కలిగి ఉంటుంది.

టాటా టియాగో ఈవీ: దేశీ బ్రాండ్ టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ(Tata Tiago EV). మార్కెట్లో టాటా కార్లు నాణ్యత విషయంలో ది బెస్ట్‌గా నిలిచాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.99 లక్షలు(ఎక్స్-షోరూమ్).
టాటా టియాగో ఈవీ పూర్తి ఛార్జింగ్‌పై 315 కి.మీ రేంజ్ ఇస్తుంది. మార్కెట్లో గత కొన్నేళ్లుగా టాటా టియాగో ఈవీ ప్రాచుర్యం పొందింది. Tata Tiago EV నాలుగు వేరియంట్లు XE, XT, XZ+, XZ+ టెక్ ప్లస్ లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లను సంస్థ అందిస్తోంది.

టాటా పంచ్ ఈవీ: మైక్రో ఎస్‌యూవీ విభాగంలో నంబర్ 1 గా ఉన్న టాటా పంచ్.. ఎలక్ట్రిక్ వెర్షన్లో అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంటుంది.
టాటా పంచ్ ఈవీ బ్యాటరీ ప్యాక్ ఆధారంగా 421 కి.మీ మరియు 315 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. టాటా పంచ్ ఈవీలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వాయిస్- అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లేతో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ డ్రైవింగ్ మోడ్, రీజెన్ మోడ్ ఇంకా అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

సిట్రోయెన్ ఈసీ3: మార్కెట్లో రూ. 15 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు Citroen eC3. రూ. 11.69 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. పూర్తి ఛార్జ్‌పై 320 కి.మీ రేంజ్ ఇస్తుంది. eC3 బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం 29.2 kw. రోజువారీ ప్రయాణాలకు ఈ ఎలక్ట్రిక్ కారు సరిపోతుంది.


Click it and Unblock the Notifications








