జీప్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుందోచ్!.. ధర ఎంతో తెలుసా?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్' (Jeep) భారతీయ మార్కెట్లో ఎంత ఆదరణ పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ మెరిడియన్, కంపాస్ వంటి కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ తరుణంలో కంపెనీ గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను (Electric Cars) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జీప్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నార్తులు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే చాలా వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. కాగా ఇప్పుడు జీప్ కంపెనీ ఈ విభాగంలో కార్లను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు.. స్టెల్లాంటిస్ సీఈఓ కార్లోస్ తవారెస్ పేర్కొన్నారు. అయితే కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారును అమెరికా మార్కెట్లో మాత్రమే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. జీప్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ధరలు 40000 నుంచి 60000 డాలర్ల మధ్య ఉంది. కాబట్టి జీప్ కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు ధర 25000 డాలర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కంపెనీ లాంచ్ చేసే ఎలక్ట్రిక్ కారు బీ-సెగ్మెంట్ కావొచ్చు.. సబ్‌కాంపాక్ట్ SUV కావొచ్చు. ఇది STLA స్మాల్ ప్లాట్‌ఫారమ్ మీద నిర్మయించబడే అవకాశం ఉందని తెలుస్తోంది.
జీప్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే అమెరికన్ మార్కెట్లో విక్రయించబడుతున్న జీప్ అవెంజర్ కావచ్చని కొందరు చెబుతున్నారు. ఇదే నిజమై ఈ కారు ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయితే.. దీని ప్రారంభ ధర 30000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక వేళా మిడ్ సైజ్ SUV లాంచ్ అయితే దాని ధర 72000 డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

జీప్ కంపెనీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తే.. అది తప్పకుండా సరసమైన ధరకు లభించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి జీప్ కంపెనీ తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయవచ్చు. అంతే కాకుండా చాలామందికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధర వద్ద లాంచ్ చేయవచ్చని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
చైనా ఉత్పత్తులు సరసమైన ధరలో లభిస్తున్న తరుణంలో.. అమెరికన్ కంపెనీలు చైనా కార్లకు ధీటుగా తక్కువ ధరలో కార్లను లాంచ్ చేయాలనీ యోచిస్తున్నారు. చైనీస్ వాహన తయారీదారులు ఇప్పటికే వారి స్వంత మార్కెట్‌లో విజయవంతమయ్యారు. అంతే కాకుండా వీరు మెక్సికో మరియు డెట్రాయిట్ మార్కెట్‌లలో కూడా సక్సెస్ సాధిస్తోంది. కాబట్టి జీప్ కంపెనీ తన ఉనికిని చాటుకోవడాని సన్నద్ధమైంది.

ఫిబ్రవరిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో జీప్ కంపెనీ అధికారులు.. సరసమైన కార్లు ప్రజలు కోరుకుంటున్నారని అనుకున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి సంస్థ ప్రజలకు అందుబాటులో ఓ సరసమైన కారును లాంచ్ చేయాలని భావిస్తోంది. మొత్తం మీద అనుకున్న విధంగా జరిగితే.. కంపెనీ తప్పకుండా సరసరమైన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తుంది. కాగా జీప్ ఎలక్ట్రిక్ కారు భారతదేశానికి ఎప్పుడు వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








