రంభ లాంటి కార్లు.. అస్సలు వదలకండి.. కారు కొనేవారు ఒక్కసారి వీటిని చూసి డిసైడ్‌ అవ్వండి!

దేశంలో కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ కంపెనీల నుంచి పదుల సంఖ్యలో హ్యాచ్‌బ్యాక్స్‌, ఎస్‌యూవీ, ఎంపీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్‌యూవీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇవి ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు మంచి ఫీచర్లు, మైలేజీని కలిగి ఉంటాయి. దీంతో జనాలు వీటిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం కేవలం రూ .7 లక్షల ప్రారంభ ధరతో మంచి ఎస్‌యూవీలు కొనుగోలుకి సిద్ధంగా ఉన్నాయి. ఇవి మీ రోజువారి ప్రయాణానికి సరిపోతాయి. మారుతి సుజుకి, టాటా నెక్సాన్, మహీంద్రా సంస్థలకు చెందిన కార్లు టాప్‌లో కొనసాగుతున్నాయి. అమ్మకాలతో పాటు కస్టమర్లను ఆకర్షించడంలో ఈ కింది ఎస్‌యూవీలు టాప్‌లో ఉన్నాయి. వీటి మైలేజీ, ధర, ఫీచర్లు ఇక్కడ చెక్‌ చేయండి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఈ సబ్‌ కాంపాక్ట్‌ క్రాస్‌ఓవర్ యూనిట్‌ క్రేజీ డిజైన్‌తో వస్తుంది. ప్రీమియం లుక్‌తో పాటు భారీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది 1-లీటర్‌ టర్బో పెట్రోల్, 1.2 డ్యూయెల్‌ జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌తోనూ వస్తుంది. ఈ కారు 20.1 నుంచి 28.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారుని ఆరు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

Maruti Fronx SUV Price

ఇందులో 9 ఇంచెస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్ప్లే ఫీచర్లు కలవు. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్‌హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ .7.51 లక్షల నుంచి రూ .13.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

టాటా నెక్సాన్: సేఫ్టీలో ఇది 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. దీంతో అతికొద్ది రోజుల్లోనే ది బెస్ట్‌ సెల్లింగ్‌ ఎస్‌యూవీగా అవతరించింది. ఇప్పటికీ ఈ కారు టాప్‌ 10లో కొనసాగుతుంది. ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఇంజిన్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 17.18 నుంచి 24 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనిని ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

Tata Nexon SUV Price

ఇందులో 10.5 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే (10.25 ఇంచెస్‌), ఆటో ఏసీ, వైర్‌లెస్‌ మోబైల్‌ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కలవు. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్‌, TPMS, 360 డిగ్రీస్‌ కెమెరాలు ఉన్నాయి. దీని ధర రూ .8 లక్షల నుంచి రూ .14.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO: ఈ కారు ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఎక్కువ డిమాండ్‌ ఉన్న ఎస్‌యూవీగా అవతరించింది. వేరియంట్లను బట్టి దీనిని ఇప్పుడు బుక్‌ చేసుకుంటే ఇంటికి చేరుకోవడానికి సుమారు 2 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 17.96 నుంచి 21.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Mahindra XUV 3XO SUV Price

ఇందులో ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ కోసం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & డ్యూయల్ డిస్ప్లేలు, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, వైర్‌లెస్‌ మోబైల్‌ ఛార్జర్‌, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, TPMS, ADAS సూట్‌, 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ .7.79 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2024, 13:55 [IST]
English summary
Affordable suvs under 8 lakhs tata nexon mahindra xuv 3xo and maruti suzuki fronx
Read more on: #auto news #suv #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+