దీపావళి కోసమే ప్రత్యేకంగా వస్తున్న కొత్త కార్లు.. తక్కువ ధర, మంచి ఫీచర్లు!

ప్రస్తుతం పండుగ సీజన్‌ సమీపిస్తుండటంతో అన్ని కంపెనీలు సేల్స్‌ పెంచుకునేందుకు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి. భారీ సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే భారీ ఆఫర్లను సైతం ప్రకటించేశాయి. ప్రముఖ కంపెనీల నుంచి త్వరలో మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, హోండా, నిస్సాన్ వంటి కొత్త కార్లు మార్కెట్‌లో అడుగుపెట్టనున్నాయి. ఈ కార్లను సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో ఈ పండుగ సీజన్‌ని పురస్కరించుకుని ప్రత్యేకంగా లాంచ్‌ చేస్తున్నాయి. త్వరలో మార్కెట్‌లో అడుగుపెట్టబోతున్న ఆ కార్ల వివరాలు ఈ కథనంలో..

హోండా అమేజ్ 3rd జనరేషన్‌ హోండా అమేజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ కారు ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేకంగా నిలువనుంది. ఈ కారు పెద్ద మొత్తంలో అప్‌డేట్స్‌తో వస్తుంది. అమేజ్‌లో ప్రస్తుతం ఉన్న అదే ఇంజిన్, గేర్ ఆప్షన్స్‌తో వస్తుంది. అయితే ఎక్స్‌టీరీయర్‌ ఇంటీరియర్‌లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. దీని లాంచ్‌పై అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

2024 Honda Amaze

కొత్త మారుతి సుజుకి డిజైర్ వచ్చే రెండు నెలల్లో భారతదేశంలో అమ్మకానికి రానుంది. ఈ కాంపాక్ట్‌ సెడాన్‌లోని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో కొద్దిపాటి అప్‌గ్రేడ్స్‌ ఉండనున్నాయి. ఇప్పుడున్న డిజైర్‌తో పోల్చితే ఇది పూర్తిగా డిఫరెంట్ లుక్‌తో అందుబాటులోకి రానుంది. ఇది 2024 స్విఫ్ట్‌లో ఉండే ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌తో రానుంది. 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో ఇది రానుంది.

టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్‌జీ ఎడిషన్‌ని విడుదల చేయనుంది. ఇది భారతదేశంలో మొదటి టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ సీఎన్‌జీ కారుగా రానుంది. దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 లో ప్రదర్శించింది. ఇది ట్విన్ సిలిండర్ టెక్నాలజీ శక్తివంతమైన ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. ఈ వెర్షన్‌లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌ని క్రియేట్‌ చేయనుంది.

Nissan Facelift Launch

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ అక్టోబర్ 4, 2024 న అధికారికంగా లాంచ్‌ కానుంది. ఈ అప్‌డేట్ చేసిన మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విడుదల అవుతున్నాయి. ఇది దాని ఎక్స్టీరియర్‌, ఇంటీరియర్‌లో పలు మార్పులు చేసినట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది.

అయితే కేవలం కాస్మోటిక్‌ మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మాగ్నైట్ దాని ప్రస్తుత పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్లతోనే వస్తుందని భావిస్తున్నారు. అయితే కస్టమర్ల క్యాబిన్‌లో కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ కారు ప్రస్తుత కారు కంటే మార్కెట్లోని ఇతర కార్ల ఫీచర్లతో అడుగుపెట్టనుంది. మార్కెట్‌లో నిస్సాన్‌కి ఉన్న ఆదరణ ఈ ఫేస్‌లిఫ్ట్‌కి కూడా కలిసి రానుంది.

ఇక చివరగా మహీంద్రా ఈ ఏడాది చివరి నాటికి XUV 3XO EVని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ 400లో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్, మోటార్‌ స్పెసిఫికేషన్స్‌తో రానుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి ఎంట్రీ లెవల్ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, హోండా, నిస్సాన్‌లు కొత్త కాంపాక్ట్ కార్లు ఈ పండుగ సీజన్‌లో కొత్త కార్లుగా నిలువనున్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం లభించే కార్లతో పాటు కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ని ఎంచుకోవచ్చు. అయితే ఈ పండుగ సీజన్‌లో వచ్చే కార్లలో అధునాతన సీఎన్‌జీ టెక్నాలజీ, హై రేంజ్‌ ఎలక్ట్రిక్ కార్లు, స్టైలిష్ ఫేస్‌లిఫ్ట్స్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, September 22, 2024, 10:31 [IST]
English summary
Affordable upcoming car launches for diwali check list here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+