చరిత్రలో నిలిచిపోనున్నఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌ నైట్‌ రేసింగ్‌.. వేదిక ఇదే!

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024లో భాగంగా దేశంలోనే మొట్టమొదటి నైట్ రేస్ చెన్నైలో జరగనున్నాయి. రాత్రి వేళల్లో ఐకానిక్ ఐలాండ్ గ్రౌండ్‌లో ఈ ఈవెంట్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ రేసింగ్‌లో 19 మలుపులు, ఫాస్ట్‌ స్ట్రెయిట్‌లను కలిగి ఉన్న ఈ 3.5 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో పోటీలు జరగనున్నాయి. అద్భుతమైన ఫ్లాగ్ డిజైన్‌లోని పెయింట్‌తో నేపియర్ బ్రిడ్జ్‌ని అలంకరించారు.

ఈ రేస్‌ ద్వారా చెన్నైని మోటార్ స్పోర్ట్ రాజధానిగా చేయడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం సపోర్ట్‌ చేస్తుంది. ఈ పోటీల కోసం దాదాపు 9,000 మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. దీంతో చెన్నై వీధులు గ్లోబల్ నైట్ స్ట్రీట్ సర్క్యూట్‌లలో ఒకటిగా నిలువనున్నాయి. యువ ఔత్సాహికుల కోసం ఈ పోటీలను చెన్నై వీధుల్లో నిర్వహించేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్లు ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అతుల్య మిశ్రా తెలిపారు.

First Night Race Indian Racing Festival in Chennai

డ్రైవర్లలో ఉత్సాహం: తొలి ఆసియా రేసర్‌గా నిలిచిన చేతన్ కోరాడ ఈ నైట్ సర్క్యూట్‌లో పాల్గొనడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని.. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. యూరోపియన్ ఫార్ములా 4 జట్లలో అనుభవం ఉన్న కొల్కాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిల్ బోహ్రా మాట్లాడుతూ ఈ ఈవెంట్ భారత మోటార్ స్పోర్ట్‌లో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

చెన్నై టర్బో ఛార్జర్స్, గోవా ఏసెస్ జేఏ రేసింగ్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్‌స్టర్స్‌, శ్రాచి రాహ్ బెంగాల్ టైగర్స్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్‌ జట్లతో పాటు మరో రెండు జట్లు ఎఫ్ఐఏ ఫార్ములా 4 ఇండియా ఛాంపియన్షిన్‌లో పోటీపడనున్నాయి. గోవా ఏసెస్‌కు చెందిన గాబ్రియేలా జికోవా మోటార్ స్పోర్ట్‌లో మహిళల పోటిపడతారు. ఈ ఈవెంట్‌కి హాచరయ్యే వారు సీటింగ్ కేటగిరీల ఆధారంగా నిర్దిష్ట గేట్ల వరకు పరిమితం చేయబడతారు.

First Night Race Indian Racing Festival in Chennai

* బాక్స్ ఆఫీస్ 1 - గేట్ నంబర్‌ 2: ముత్తుస్వామి రోడ్/బ్రిడ్జి నుంచి గ్రాండ్‌స్టాండ్‌ 1 ఎంట్రీ.
* బాక్సాఫీస్ 3 - గేట్ నంబర్ 4: వాలాజా రోడ్ నుంచి గ్రాండ్‌స్టాండ్‌ 2-5 గేట్లకు ఎంట్రీ.
* బాక్స్ ఆఫీస్ 4 - గేట్ నంబర్ 5: వాలాజా రోడ్ నుంచి మీడియా స్టాండ్ ప్రవేశం.
* బాక్స్ ఆఫీస్ 5 - గేట్ నంబర్ 6: కామరాజర్ రోడ్ నుండి గోల్డ్, ప్లాటినం మరియు ప్రీమియం లాంజ్స్ ప్రవేశం.

రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కీలక రేసు నిర్వహణలో పాలుపంచుకున్న అన్ని విభాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు సౌకర్యవంతంగా, సురక్షితంగా రేసులను ఆస్వాదించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కారు ఫీట్స్‌, బైక్ రైడర్ల హాట్ ల్యాప్స్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ఆగస్టు 24-25 తేదీల్లో మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ రేస్ -2లో అలిస్టర్ యోంగ్ , రేస్ -1లో రుహాన్ ఆల్వా పీ3 విజయం సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన హ్యూ బార్టర్ రేస్-1లో చివరి ల్యాప్ తర్వాత రెండు రేసుల్లో విజయం సాధించాడు.

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) భారతదేశంలో పెరుగుతున్న మోటార్ స్పోర్ట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించబడింది. ఇందులో ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL), ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ (F4IC) అనే రెండు ఛాంపియన్షిప్స్‌ ఉన్నాయి. ఐఆర్ఎల్ అనేది భారతదేశం ఏకైక జెండర్‌-న్యూట్రల్‌ రేసింగ్ సిరీస్, ఇందులో ఆరు నగర ఆధారిత జట్లు పాల్గొంటాయి.

ఫార్ములా 4 అనేది కార్టింగ్ నుంచి సింగిల్ సీటర్ రేసింగ్‌కి మారిన జూనియర్ డ్రైవర్ల కోసం ఉన్న ఓపెన్-వీల్ కేటగిరీ. ఎఫ్ఐఏ సర్టిఫైడ్ ఎఫ్4ఐసీ ప్రపంచవ్యాప్తంగా యువ డ్రైవర్లను ఆకర్షిస్తుంది. అంతే కాకుండా దేశీయంగా పోటీ పడేటప్పుడు వారికి సూపర్ లైసెన్స్ పాయింట్లను అందిస్తుంది.

స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (SDAT) రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి వివిధ రంగాల నుంచి వనరులను ఉపయోగించుకోవడం ద్వారా తమిళనాడు అంతటా క్రీడలను ప్రోత్సహిస్తుంది. చెన్నై మోటార్ స్పోర్ట్‌ మరపురాని రేసింగ్‌ అనుభవం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 30, 2024, 19:03 [IST]
English summary
All set for first night race indian racing festival in chennai check details in telugu
Read more on: #motorsport #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+