చైనాపై అమెరికా ఆంక్షలు.. భారీగా పెరిగిన సుంకాలు - పూర్తి వివరాలు

ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో అమెరికా.. చైనా దిగుమతుల మీద సుంకాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం చైనా నుంచి దిగుమతయ్యే 18 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల మీద పడే అవకాశం ఉంది.

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మీద విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. అంతే కాకూండా బ్యాటరీలు, బ్యాటరీ విడి భాగాలు వంటి వాటి మీద సుంకం 7.5 శాతం నుంచి 25 శాతానికి పెంచనున్నట్లు తెలిసింది. ఈ కొత్త ట్యాక్స్ ఇకపై ప్రారంభమయ్యే ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది.

America Hikes Tariff On Chinese EVs

కొత్త ట్యాక్స్ ఈ ఏడాది ప్రారంభమై.. వచ్చే మూడేళ్లు కొనసాగుతుంది. అమెరికన్ మార్కెట్లో చౌకైన వస్తువుల పెరుగుదలను నిషేధించడానికి యూఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో(యూఎస్) ఉద్యోగకావకాశాలు తగ్గే అవకాశం ఉంది. కానీ టెక్నాలజీ, మేధో సంపత్తి వంటివన్నీ దేశంలోనే ఆవిర్భవిస్తాయని చెబుతున్నారు. చైనా తక్కువ ధరలకు వస్తువులను విక్రయించడం వల్ల స్వదేశీ అమ్మకాలు తగ్గుతున్నాయని పలు దేశాలు ఆరోపించాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు ఇతర ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా.. సెమీకండక్టర్ల మీద కూడా ట్యాక్స్ 25 శాతం నుంచి 50 శాతం పెరుగుతుంది. అదే సమయంలో ఈ ఏడాది లిథియం అయాన్ బ్యాటరీల మీద ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది. 2026 నాటికి నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటటీల మీద కూడా ట్యాక్స్ పెరుగుతుందని చెబుతున్నారు.

BYD

బ్యాటరీల మాత్రమే కాకుండా.. బ్యాటరీ విడిభాగాలు మీద కూఆ సుంకం గణనీయంగా పెరుగుతుంది. చైనా ఉత్పత్తుల మీద అమెరికా భారీగా సుంకాలు పెంచడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. యూరప్ కూడా అమెరికా బాటలోనే పయనిస్తూ.. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మీద సుంకాలను పెంచే అవకాశం ఉందని సమాచారం. భారతదేశం కూడా చైనాతో సత్సంభందాలను ఆశించడం లేదు. కానీ కొన్ని సంస్థలు దేశంలోకి అడుగుపెడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో కొన్ని చైనా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అయితే చైనీస్ ప్రభుత్వ రాయితీల మద్దతుతో తక్కువ ధర కలిగిన మోడల్‌లు యూఎస్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. BYD మరియు Nio వంటి చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్స్ అమెరికాలో విక్రయించవు, కానీ చైనాకు చెందిన గీలీ, స్వీడన్‌కు చెందిన వోల్వోల మధ్య సహకారం కారణంగా కొన్ని ఉత్పత్తులు ఉన్నాయి.

BYD Hav EV

చైనా ఉత్పత్తుల నాణ్యత ఎలా ఉంటుందనేది.. ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు. అంతే కాకుండా చైనా ఉట్పత్తులు తక్కువగానే ఉంటాయి. దీనివల్ల స్వదేశీ ఉట్పత్తుల అమ్మకాలు తగ్గి, చైనా ఉత్పత్తులు భారీగా అమ్ముడవుతున్నాయి. ఇది ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రాభవం చూపుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా దేశాలు చైనా వస్తువుల దిగుమతులను పూర్తిగా నిషేధించాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 12:00 [IST]
English summary
America hikes tariff on chinese evs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+