14T Boss Electric Truck మొదటి ఎలక్ట్రిక్‌ ట్రక్కును డెలివరీ చేసిన అశోక్‌ లేలాండ్‌

హిందూజా గ్రూప్‌నకు చెందిన భారతదేశపు ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్(Ashok Leyland), ఈరోజు తన మొదటి ఎలక్ట్రిక్‌ ట్రక్‌ను డెలివరీ చేసింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 లో అశోక్‌ లేలాండ్‌ చాలా కాలంగా ఎదురుచూస్తున్న 14T బాస్ ఎలక్ట్రిక్ ట్రక్‌ను బిలియన్‌ ఇ మొబిలిటీకి అందజేసింది.

భారత్ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024 నేటితో ముగియనుంది. ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలు ఈ ఈవెంట్‌లో తమ ఫ్యూచర్‌ ప్రొడక్ట్స్‌ను ప్రదర్శించాయి. ఈ క్రమంలో ఎక్స్‌పోలో అశోక్ లేలాండ్ 9m హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్, AVTR LNG 6x4 ట్రాక్టర్, 55T EV ట్రాక్టర్ మరియు స్విచ్ IeV4 ఎలక్ట్రిక్ LCVతో పాటు 14T ​​బాస్ ఎలక్ట్రిక్ ట్రక్‌తో సహా ఫ్యూచర్-రెడీ వాహనాలను ప్రదర్శించి ఆకట్టుకుంది.

14T-Boss-Electric-Truck-Ashok-Leyland

ఈవెంట్‌(Bharat Mobility Global Expo)లో తాము ప్రదర్శించిన ఈ వాహనాలు అత్యాధునిక సాంకేతికతతో వాణిజ్య వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని అశోక్‌ లేలాండ్‌ పేర్కొంది. ఈ సందర్భంగా మొదటి డెలివరీపై అశోక్ లేలాండ్ ఎండి షేను అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. తమ కస్టమర్లకు అశోక్ లేలాండ్ ఈరోజు మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని అందించడం గర్వంగా ఉందని అగర్వాల్‌ అన్నారు.

14T బాస్‌ ఎలక్ట్రిక్ ట్రక్‌(14T Boss Electric Truck)ను గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో అశోక్‌ లేలాండ్‌ ప్రదర్శించింది. ఈ మేరకు ఈ రోజు మొదటి డెలివరీని అందించింది. స్థిరమైన మరియు సమర్థవంతమైన రవాణా వైపు తమ ప్రయాణంలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయి అని షేను అగర్వాల్‌ అన్నారు.

14T-Boss-Electric-Truck-Ashok-Leyland

భారత్‌ ఎక్స్‌పోలో తాము ప్రదర్శించిన వాహనాలు భవిష్యత్తుకు అనుకూలంగా ఉంటాయని అశోక్‌ లేలాండ్‌ ఎండీ పేర్కొన్నారు. వాణిజ్య వాహనాల రంగం యొక్క ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గ్రీన్‌ మొబిలిటీ దిశగా నిబద్ధతను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. భారత, గ్లోబల్‌ మార్కెట్‌ అభివృద్ధి చెందుతుండటంతో వాటి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతకతను అందిస్తున్నట్లు చెప్పారు.

14T-Boss-Electric-Truck-Ashok-Leyland

సాంకేతికంగా అభివృద్ధి చెందిన 14T బాస్ ఎలక్ట్రిక్ ట్రక్ వాణిజ్య అవసరాలకు దోహదపడుతూ దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని డిస్ట్రిబ్యూటెడ్ బిలియన్ ఇ-మొబిలిటీ వ్యవస్థాపకుడు కార్తికే హరియాని అన్నారు. అశోక్‌ లేలాండ్‌ నుంచి మొదటి డెలివరీ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థకు ఈ ఎలక్ట్రిక్‌ ట్రక్‌ సరిపోతుందన్నారు.

గ్రీన్‌ మొబిలిటీ దిశగా.. ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తుల శ్రేణిలో పనిచేస్తున్నట్లు అశోక్ లేలాండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డా. ఎన్ శరవణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మల్టీ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ వెహికల్స్ పరిశ్రమలో 75 సంవత్సరాల అనుభవం అశోక్‌ లేలాండ్‌కు ఉందన్నారు. ఆవిష్కరణ, అభిరుచి కారణంగా తక్కువ వ్యవధిలో అత్యంత అధునాతన ఉత్పత్తులను అందిస్తున్నట్లు వివరించారు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 ప్రారంభ ఎడిషన్ ఫిబ్రవరి 01 నుండి ఫిబ్రవరి 03 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ఆసక్తి గల వ్యక్తులు ఫ్యూచర్‌ వాహనాలను వీక్షించేందుకు హాల్ నెం. 6, స్టాండ్ నెం. H6-06 అశోక్ లేలాండ్ స్టాల్‌ని సందర్శించవచ్చు. ఈ రోజే చివరి రోజు.

More from DriveSpark

Article Published On: Saturday, February 3, 2024, 14:59 [IST]
English summary
Ashok leyland delivered first 14t boss electric truck at bharat mobility global expo 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+