వాహన ప్రియులకు షాకింగ్ న్యూస్!.. పెరగనున్న ఆడి కార్ల ధరలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' 2024 జూన్ నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ఏప్రిల్ 25న నిర్ణయించినట్లు తెలిసింది. కంపెనీ ధరలను ఎంత వరకు పెంచింది, ధరల పెరుగుదలకు కారణం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆడి కంపెనీ పెంచనున్న ధరలు 2024 జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయని సమాచారం. సంస్థ కార్ల ధరలను పెంచడానికి ప్రధాన కారణం ఇన్‌పుట్ మరియు రవాణా ఖర్చులు పెరుగుదల అని పేర్కొంది. కొత్త ధరలు 2 శాతం వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరలు కూడా అధికారికంగా విడుదలవుతాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ పేర్కొన్నారు.

Audi Car Price Hike

కేవలం ఆడి కంపెనీ మాత్రమే కాకుండా.. దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కూడా తమ వాహనాల ధరలను ఇప్పటికే పెంచినట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలో మారుతి సుజుకి కూడా తమ వాహనాల ధరలను పెంచింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇన్‌పుట్ ఖర్చులు పెరగటమే అని పేర్కొంటున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా ఈ బాటలో అడుగులు వేయనున్నట్లు సమాచారం.

ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో గణనీయమైన పురోగతిని సాధిస్తూ.. ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో 7027 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు 33 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆడి కార్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ స్పష్టమవుతోంది. భారతదేశంలో విక్రయించబడిన కార్లలో ప్రధానంగా ఆడి ఏ4, క్యూ3, క్యూ5, ఆర్ఎస్ క్యూ8 ఉన్నాయి.

Audi RS e-tron

ఆడి (Audi) కంపెనీ తన ఏ3 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా తయారు చేయబడి ఉంది. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇది ఎక్కువమంది కస్టమర్లను తప్పకుండా ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

భారతదేశంలో ఆడి కంపెనీ కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి మరియు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఆడి ఏ3 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధునిక ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇవన్నీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తాయని, కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతుందని ఆశిస్తున్నాము.

Audi Car Price Hike

మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతోంది. ఈ కారణంగా 2023లో ఆడి కంపెనీ యొక్క డీజిల్ కార్ల అమ్మకాలు 35 శాతం తగ్గిపోయాయి. 2019 నాటికి డీజిల్ కార్ల విక్రయాల్లో ఆడి కంపెనీ 80 శాతం సొంతం చేసుకుంది. పెట్రోల్ కార్ల సెగ్మెంట్‌లో ఆడి 31 శాతం వాటాను కలిగి ఉంది. బీఎండబ్ల్యూ వాటా 28 శాతం కాగా, మెర్సిడెస్ బెంజ్ 26 శాతం వాటాను కలిగి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2024, 12:30 [IST]
English summary
Audi car price hike from 2024 june 1 details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+