స్పెషల్ ఎడిషన్‌లో ఆడి Q3, Q3 Sportback లాంచ్.. లిమిటెడ్ యూనిట్లు మాత్రమే, ధర ఎంతంటే.??
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. వాహన ప్రియుల కోసం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. Audi ప్రముఖ మోడల్ Audi Q3 మరియు Audi Q3 Sportback ప్రత్యేక బోల్డ్ ఎడిషన్‌లో తీసుకువచ్చింది. లగ్జరీ ఫీచర్లు, అధునాతన సౌకర్యాలతో ఈ ఎడిషన్‌ను సంస్థ లాంచ్ చేసింది. ధర, ఫీచర్లు, పూర్తి సమాచారం ఈ కథనంలో..
విలాసవంతమైన, అధునాతన సౌకర్యాలకు Audi పెట్టింది పేరు. అందుకే ఈ కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఈ జర్మన్ లగ్జరీ కార్ మేకర్ నుంచి Q3 మోడళ్లు అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆడి ఇండియా Q3, Q3 Sportback బోల్డ్ ఎడిషన్‌ను లాంచ్ చేయడం ద్వారా సేల్స్‌ను పెంచుకునేందుకు యత్నిస్తోంది.

ఇక ఆడి Q3 బోల్డ్ ఎడిషన్ ధర రూ. 54,65,000 గా ఉంది. ఆడి Q3 Sportback బోల్డ్ ఎడిషన్ ధర రూ. 55,71,000 గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. డిజైన్ పరంగా ఆడి Q3 స్పెషల్ ఎడిషన్ బ్లాక్ కలర్ స్టైలింగ్ ప్యాకేజీతో వస్తుంది. ప్రత్యేకంగా అల్లాయ్ వీల్స్‌పై డ్యూయల్ టోన్ పెయింట్ ఆకర్షణీయంగా ఉంటుంది.
ముందు మరియు వెనుక వైపు బ్లాక్ ఆడి రింగ్‌లతో మెరుగైన స్పోర్టీ ఎక్స్‌టీరియర్ లుక్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ విండో సరౌండ్‌లు, బ్లాక్ ORVMలు మరియు బ్లాక్ రూఫ్ పట్టాలు ఉన్నాయి. కాగా ఆడి Q3 స్పెషల్ ఎడిషన్ ఐదు రంగులలో అందుబాటులో ఉంటుంది. గ్లేసియర్ వైట్, నానో గ్రే, మిథోస్ బ్లాక్, నవర్రా బ్లూ మరియు పల్స్ ఆరెంజ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఇక ఆడి Q3 స్పోర్ట్‌బ్యాక్ గ్లేసియర్ వైట్, డేటోనా గ్రే, మిథోస్ బ్లాక్, ప్రోగ్రెసివ్ రెడ్ మరియు నవర్రా బ్లూ అనే ఐదు రంగుల్లో ఆకర్షణీయంగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ కింద సంస్థ పరిమిత యూనిట్లను మాత్రమే తీసుకువచ్చింది. దీంతో ఈ కార్లు త్వరితగతిన అమ్ముడవుతాయని సంస్థ భావిస్తోంది.
ఫీచర్ల పరంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌లో LED హెడ్‌ల్యాంప్‌లు, LED రియర్ కాంబినేషన్ లైట్లతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకా పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ ఇందులో మరో ప్రత్యేకత. ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. లెదర్/లెథెరెట్ కాంబినేషన్లో అప్హోల్స్టరీ సీట్లను కలిగి ఉంది.
లెదర్‌తో చుట్టబడిన 3-స్పోక్ మల్టీఫంక్షన్ ప్లస్ ప్యాడిల్ షిఫ్టర్‌లతో స్టీరింగ్ వీల్ అదనపు ఆకర్షణ. మల్టీ కలర్లో యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్.. 2-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరాతో పార్కింగ్ అసిస్ట్‌ను కలిగి ఉంది. ఇంకా ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్ సిస్టంతో వస్తుంది. ప్రోగ్రెసివ్ స్టీరింగ్‌తో పాటు భద్రత పరంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.
MMI టచ్‌తో MMI నావిగేషన్ ప్లస్, ఆడి డ్రైవ్ మోడ్ ఆప్షన్, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, నంబర్ కంట్రోల్ టెయిల్‌గేట్‌తో కంఫర్ట్ కీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కూడిన ఆడి ఫోన్ బాక్స్, 10 స్పీకర్లతో ఆడి సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఇక ఆప్షనల్ ఫీచర్ల పరంగా ఆడి జెన్యూన్ ఎక్విప్‌మెంట్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ పెయింట్‌ను కలిగి ఉంది.
ఇక ఆడి Q3 మరియు Q3 Sportback బోల్డ్ ఎడిషన్ పనితీరు పరంగా హైలైట్స్ విషయానికొస్తే.. లెజెండరీ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్‌తో 2.0l TFSI ఇంజిన్‌తో పనిచేస్తుంది. 190 hp మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 45.72 సెం.మీ (R18) 5-ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.
కాగా ఆడి క్యూ3 మరియు ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ప్రస్తుతం తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌లుగా కస్టమర్‌లచే ప్రజాదరణ పొందుతున్నాయి ఆడి ఇండియా హెడ్ బల్బీర్ దింగ్ దిల్లాన్ అన్నారు. లగ్జరీ, పనితీరు మరియు మల్టీ ఫీచర్ల యొక్క సమ్మేళనంగా ఉన్న ఈ మోడళ్లను.. ఇప్పుడు బోల్డ్ ఎడిషన్‌తో అందిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications








