తేనెటీగలు దాడిచేసినట్లు ఈ కారును ధనవంతులు తెగ కొనేస్తారు.. దీనికి అంత డిమాండ్ ఎందుకంటే!
గతంతో పోలిస్తే భారత్‌లో లగ్జరీ కార్ల వాడకం బాగా పెరిగిపోయింది. ప్రజల ఆదాయ స్థితుల్లో కొంత వరకు మార్పులు రావడంతో చాలా మంది బడ్జెట్ ధరలో లభించే సాధారణ కార్ల కంటే అదిరిపోయే ఫీచర్లతో స్టైలీష్ డిజైన్‌తో వచ్చేటటువంటి టాప్ ఆటోమొబైల్ తయారీ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకప్పుడు రోడ్లపై లగ్జరీ కార్లు చాలా అరుదుగా కనిపించేవి. ఎందుకంటే వీటి ధరలు అధికంగా ఉండటం కారణంగా ధనవంతులు, సెలబ్రిటీలు మాత్రమే ఇలాంటి వాటిని కొనేవారు. అయితే ఎక్కువ ఆదాయం సంపాదించే వారు కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ ధర కలిగిన మోడళ్లను సైతం కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండియాలో లగ్జరీ కార్లకు పేరుగాంచిన ఆడి(Audi) కంపెనీ నుంచి వచ్చే మోడళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది.
మాములుగా ఆడి కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లగ్జరీ ఫీచర్లతో నిండి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇండియా మార్కెట్ సానుకూలంగా ఉండటంతో కంపెనీ తన వాటాను పెంచుకోడానికి మరో మోడల్‌ను తాజాగా విడుదల చేసింది. దీని పేరు 'క్యూ 7 ఫేస్‌లిఫ్ట్(Q7 facelift)'. దీని ధర రూ.88.66 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. అయితే Q7 SUV ఇండియాలో ఇప్పటికే అందుబాటులో ఉంది.

ఈ సారి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతీయ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. భారత్‌లో ఈ లగ్జరీ ఎస్‌యూవీకి బాగా డిమాండ్ ఉంటుంది. చాలా మంది ధనవంతుల వద్ద ఇది కనిపిస్తుంది. అమ్మకాల పరంగా పాత Q7 SUV వెర్షన్ మంచి గణంకాలను సాధించింది. ఈ నేపథ్యంలో దీని డిమాండ్‌ను మరింత పెంచడానికి ఆడి తన Q7ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకొచ్చింది.
కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో మరిన్ని మార్పులు ఉన్నాయి. డిజైన్‌తో పాటు క్యాబిన్‌లో అధునాతన టెక్నాలజీలను అందించారు. ప్రధానంగా కొత్త ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో ఉన్నటువంటి కొత్త గ్రిల్ కారు అందాన్ని మరింత పెంచింది. బంపర్ కూడా ఎస్‌యూవీ వెర్షన్ లాగా కాకుండా ఢిఫరెంట్‌గా ఉంటుంది. అల్లాయ్ వీల్స్‌ను కూడా రీడిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఫ్రంట్ భాగంలో LED హెడ్‌లైట్స్ కారుకు అదనపు హంగుని చేర్చాయి.

కొత్త ఫేస్‌లిఫ్ట్ డిజైన్ సరికొత్తగా ఉండటంతో చాలా మంది తేనెటీగలు దాడిచేసినట్లు ఈ కారును కొనుగోలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఆడి Q7 ఫేస్‌లిఫ్ట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. Q7 ప్రీమియం ప్లస్ ప్రారంభ ధరకు లభిస్తుండగా, అదే Q7 టెక్నాలజీ మాత్రం రూ.97.81 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
Q7 ఫేస్‌లిఫ్ట్ 3.0-లీటర్ ట్విన్-టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 340 hp పవర్‌ను, 500 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారులో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించారు. లగ్జరీ కారు కాబట్టి Q7 ఫేస్‌లిఫ్ట్ కేవలం 5.6 సెకన్లలో 0 నుంచి 100 kmph వరకు వేగాన్ని చేరుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీలుగా ఉంది.
క్యాబిన్, సీట్లు చాలా అందంగా ఉన్నాయి. లోపల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. SUVతో పోలిస్తే దీనిలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిస్‌ప్లేను అప్‌డేట్ చేశారు. ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 19 స్పీకర్లతో 730 వాట్ ఆడియో సిస్టం, ప్రయాణికుల భద్రత కోసం 8 ఎయిర్ బ్యాగులు, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్,ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








