ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ చెక్ చేశారా లేదా?
ఆడి ఇండియా కొత్త క్యూ8 ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పటికే రూ.5 లక్షల అడ్వాన్స్‌తో ఈ కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వీటిని బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ కారుని త్వరలోనే అధికారికంగా డెలివరీ చేయనున్నారు. తాజా విడుదలతో భారతీయ మార్కెట్‌లో తన ఉనికిని చాటుకునేందుకు ఆడి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆడి క్యూ8 ధరలను సంస్థ ప్రకటించింది. ఈ కొత్త ఆడి కారును మీరు ఏ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు? ఈ కారు ఇతర ఫీచర్ల వివరాలు ఈ కథనంలో మీ కోసం..
మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ తర్వాత భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కారు కంపెనీలలో ఆడి ఒకటిగా ఉంది. ఇటీవలే ఆడి ఇండియాలో లక్ష అమ్మకాల మైలురాయిని దాటింది. 2007 నుంచి భారతదేశంలో కార్లను విక్రయిస్తున్న ఆడి 17 సంవత్సరాల తరువాత ఈ మైలురాయిని దాటింది. తాజా లగ్జరీ కారుతో మార్కెట్‌లో తన ఉనికిని నిలుపుకోవాలని చూస్తుంది.

నేడు (ఆగస్టు 22) న భారతదేశంలో దీనిని అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కారు ధరను రూ.1.17 కోట్లుగా ( ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. ఆసక్తి గల కస్టమర్లు రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనుంది. ఇందులోని 3-లీటర్ TFSI పెట్రోల్ ఇంజిన్ 340bhp పవర్ మరియు 500 nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ కారులోని పెట్రోల్ ఇంజిన్ 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక ఈ ఎస్‌యూవీ రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్లు, కొత్త 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో వస్తుంది. అంతే కాకుండా సఖిర్ గోల్డ్, విటోమో బ్లూ, మైథోస్ బ్లాక్, సమురాయ్ గ్రే, గ్లేసియర్ వైట్, శాటిలైట్ సిల్వర్, తమిరిడ్ బ్రౌన్, వికునా బీజ్ వంటి 8 కలర్స్‌లో లభిస్తుంది.

కారు ముందు భాగంలో ఆడి లోగోతో కూడిన పెద్ద బ్లాక్ గ్రిల్ ఉంది. అదేవిధంగా, కారులోకి గాలి ప్రవేశించడానికి గ్రిల్ ప్రాంతంలో రంధ్రాలు కూడా ఎక్కువగా అందించారు. మ్యాట్రిక్స్ టెక్నాలజీతో హెడ్‌ల్యాంప్స్ కొత్తగా ఉన్నాయి. ముందు భాగం మాదిరిగానే, కారు వెనుక భాగంలో కూడా భారీ మార్పులు చేశారు. అయితే కారు లోపల లేఅవుట్ డిజైన్‌లో పెద్దగా తేడా లేదు.
డ్యాష్ బోర్డులో ఎప్పటిలాగే రెండు స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి ఏసీ కంట్రోల్స్ కోసం అందించారు. ఆడిలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన క్యూ8 ఇంటీరియర్‌లో అందించే మెటీరియల్స్ భారీగా ఉన్నాయి. ఈ కారు లోపల బ్యాంక్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కారు చుట్టూ లైటింగ్ సెటప్ ఉన్నాయి.

ఈ ఆడి క్యూ8 మెర్సిడెస్ బెంజ్ GLS, బీఎమ్‌డబ్ల్యూ X7 మరియు వోల్వో XC90 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఆడి కూడా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించింది. అయితే ఈ లోగా ఆడి క్యూ8 వంటి పెట్రోల్ కార్లను కూడా లాంచ్ చేయడం రెగ్యూలర్ కస్టమర్లకు కాస్త ఊరటను ఇచ్చే అంశంగా చెప్పవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








