రేపే ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎస్‌యూవీ విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే!
భారతీయ మార్కెట్‌లో క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ (Audi Q8 Facelift SUV) రేపు (ఆగస్టు 22న) అధికారికంగా విడుదల కానుంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఈ కారుని భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంచింది. ఈ ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ మోడల్‌ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ద్వారా భారత్‌లో తమ మార్కెట్‌ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ మోఢిఫికేషన్స్ చేసింది. ఇది భారతీయ మార్కెట్‌లో లగ్జరీ కార్ల విభాగంలో ట్రెండ్ సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త లగ్జరీ ఎస్‌యూవీకి సంబంధించిన మార్పులు, చేర్పులపై టీజర్‌లో కీలక విషయాలను ఆడి వెల్లడించింది.
టీజర్ ప్రకారం ముందుగా దీని డిజైన్ విషయానికి వస్తే ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో కొత్త గ్రిల్ 'ఎల్' ఆకారంలో ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. అలాగే చిన్నపాటి మార్పులతో హెచ్‌డీ మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్, కొత్త డిజిటల్ OLED టెయిల్-లైట్స్ ఉన్నాయి. కూపే డిజైన్‌లో మార్పు లేదు. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లను పొందుతుంది. ఈ కారు కొత్త డేటైమ్ రన్నింగ్ లైట్ సిగ్నేచర్‌ని కలిగి ఉంటుంది.

ఇక ఇంటీరియర్‌లోనూ ఆడి క్యూ 8 ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో పెద్దగా మార్పు లేదు. ఇది కొంచెం అప్‌డేటెడ్, కొత్త కలర్ థీమ్ ఆప్షన్స్‌తో వస్తుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా క్యూ 8 ఫేస్‌లిఫ్ట్ ADAS సూట్‌తో రానుంది. ఇందులో బిల్ట్-ఇన్ స్పాటిఫై మరియు అమెజాన్ మ్యూజిక్‌లతో వస్తుంది.
ఇందులో ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డోస్ ప్లే, మసాజ్ సీట్లు మరియు బ్యాంగ్ & ఒలుఫ్సెన్ హై-ఫై సిస్టమ్ ఉన్నాయి. ఇండియా-స్పెక్ ఆడి క్యూ 8 ఫేస్‌లిఫ్ట్ పవర్ట్రెయిన్ గురించి ఎక్కువ సమాచారం వెల్లడించలేదు. అయితే ఇతర నివేదికల ప్రకారం ఆడి క్యూ 8 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ మైల్డ్-హైబ్రిడ్ వి 6 ఇంజిన్‌తో వస్తుంది. ఈ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 340 bhp 500 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో జతచేయబడుతుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు క్వాలిటీని అనేక విధాలుగా పెంచారని, ఈ కారు ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతానికి ఆడి క్యూ8 ధర రూ.1.07 కోట్ల నుంచి ప్రారంభమై రూ. 1.43 కోట్ల ధరకు విక్రయిస్తున్నారు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. ఈ కారు మోడల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కావడంతో ఎక్కువ ధరకు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కారు గోల్డ్, బ్లూ, మైథోస్ బ్లాక్, గ్రే, గ్లేసియర్ వైట్, శాటిలైట్ సిల్వర్, బ్రౌన్ మరియు వికునా బీజ్ అనే ఎనిమిది కలరలభిస్తుంది.

ఎక్ట్సీరియర్ మాదిరిగానే ఇంటీరియర్ కూడా 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుందని అంటున్నారు. ఇంటీరియర్ థీమ్స్ బ్రౌన్, బీజ్, బ్లాక్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ కారుకు భారతదేశంలోని లగ్జరీ కార్ల ప్రియుల నుంచి మంచి ఆదరణ లభించనుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కావడంతో రెట్టింపు రెస్పాన్స్ వస్తుందని ఆడి ఇండియా భావిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








