అదిరిపోతున్న కొత్త బస్సులు, లారీలు, ట్రక్కులు.. ఆటో ఎక్స్‌పో 2025లో సరికొత్త కమర్షియల్ వెహికల్స్
దేశ రాజధానిలో కొత్త ఏడాది 2025 జనవరి 17 నుంచి 22 వరకు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో వాహన తయారీదారులు తమ రాబోయే కొత్త మోడళ్లను ప్రదర్శిస్తారు. టూవీలర్ల నుంచి ఫోర్ వీలర్లు, త్రీవీలర్ల వరకు అన్నింటిని ఈ ఈవెంట్‌లో ప్రపంచానికి పరియం చేస్తారు. అలాగే, కమర్షియల్ వెహికల్స్ కూడా ప్రదర్శిస్తారు. దిగ్గజ కంపెనీలు అశోక్ లేలాండ్ (Ashok Leyland), టాటా మోటార్స్ (Tata Motors), మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) వంటి ప్రముఖ కంపెనీలు ఇండియాలో కమర్షియల్ వాహనాల విభాగంలో మంచి మార్కెట్ కలిగి ఉన్నాయి. ఇవి తమ రాబోయే వాహనాలను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తాయి. అలాగే వీటితో పాటు JBM ఆటో, వోల్వో ఐషర్, ఎకా మొబిలిటీ వంటి బస్సు తయారీదారులు కూడా తమ వాహనాలను పరిచయం చేస్తారు.
దేశీయ వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే వాహనాలు అదిరిపోయే డిజైన్లతో కొత్త ఏడాదిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. టాటా మోటార్స్ కొత్త ప్యాసింజర్ వాహనాలను ప్రదర్శిస్తూనే వాణిజ్య వాహనాలను కూడా అందరికీ పరిచయం చేయనుంది. టాటా నుంచి వచ్చే వాటిలో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, మల్టిపర్పస్ వాడకానికి ఉపయోగపడే వాహనాలు ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించనున్నాయి. కమర్షియల్ వెహికల్స్ డిమాండ్‌ను అందిపుచ్చుకోడానికి కొత్త మోడళ్లు కీలకం కానున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇండియాలో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే వాహనాల ఉత్పత్తిలో మెరుగైన స్థానంలో ఉంది. కంపెనీ దేశరాజధానిలో జరిగే ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో కార్గో రవాణా అవసరాలకు అనుగుణంగా ఉండే పలు వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కంపెనీ వీరో సెగ్మెంట్ డీజిల్ ట్రక్కులను విడుదల చేయగా, దీనికి కొనసాగింపుగా ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుందని గతంలోనే ప్రకటించింది. ఈవెంట్‌లో దీన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నాయి.
భారతదేశంలో అశోక్ లేలాండ్ కంపెనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారుగా, అలాగే ప్రపంచంలో మూడో పెద్ద బస్సుల తయారీదారుగా ఉంది. వీటినే కాకుండా ట్రక్కులను కూడా విడుదల చేస్తుంటుంది. న్యూఢిల్లీలో జరగబోయే ఈవెంట్‌లో కంపెనీ పలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. దోస్త్ వ్యాన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, సీఎన్‌జీ, హైడ్రోజన్ ట్రక్కులు కూడా రాబోతున్నాయి.

వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్(VECV) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త బస్సులను ప్రదర్శించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటే ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు, ట్రక్కులను కూడా కంపెనీ ప్రదర్శించవచ్చని మార్కెట్ వర్గాల సమాచారం. ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ఈ కంపెనీలే కాకుండా ఇతర వాహన తయారీ దారులు తమ కమర్షియల్ వెహికల్స్ కూడా ప్రదర్శిస్తారు.
ఇండియాలో ఇప్పటి వరకు జరగని విధంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సందర్శకులు రాబోతున్నారు. 21.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఈవెంట్ జరగబోతుంది. దాదాపు ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








