కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
కేవలం రూ. 8999 ధరలో డ్యాష్‌క్యామ్ అందుబాటులోకి రానుంది. పూణే ఆధారిత సేఫ్‌క్యామ్స్ డిజిటల్ ఐ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కెమెరాను తీసుకువచ్చింది. R2 పేరుతో సరికొత్త డాష్ కెమెరాను ఆ సంస్థ మార్కెట్‌లోకి తీసకువచ్చింది. భారతదేశంలో మెటల్ బాడీ కలిగిన మొదటి ఎంట్రీ లెవల్ డాష్ కెమెరాగా R2 అందుబాటులో ఉండనుంది.
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. రెప్పపాటులో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వారిలో ఎవరిది తప్పు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. అవతలి వ్యక్తుల పొరపాటు కారణంగా అమాయకపు ప్రజలు చనిపోతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న కార్లలో డ్యాష్ కెమెరా కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాక్సిడెంట్లకు సంబంధించిన విజువల్స్‌ని ఇప్పుడు సులభంగా పొందుతున్నాం.

అందరికీ డ్యాష్‌క్యామ్ అందుబాటులో ఉండేలా ఇప్పుడు R2 పేరిట సేఫ్‌క్యామ్స్ సంస్థ రెండు వేరియంట్‌లలో కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. GPS లేకుండా R2 కెమెరా ధర రూ. 8,999 గా మరియు జీపీఎస్ కలిగిన R2 ధర రూ. 9,999 గా సంస్థ నిర్ణయించింది. ఇదే ధరలో ఎండ్యూరెన్స్ ప్రో 64GB SD కార్డ్ మరియు హార్డ్‌వైర్ కిట్‌ను సంస్థ అందిస్తోంది. వినియోగదారుల కోసం పూర్తి ప్యాకేజీ కింద తక్కువ ధరలో ఈ కెమెరాలను అందిస్తుంది.
హార్డ్‌వైర్ కిట్ వద్దనుకునే వారికి ఆప్షన్‌కి కార్ ఛార్జర్ పవర్ అడాప్టర్ కూడా అందుబాటులో ఉంది. ఈ కెమెరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా దేశంలో టైర్ 1 నగరాల్లోని ప్రీమియం కార్ యాక్సెసరీ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. BIS ధృవీకరణ కోసం ఈ కెమెరాపై కఠినమైన పరీక్షలను నిర్వహించారు. మెటల్ బాడీ దాని ఇతర పనితీరుని క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనిని ఆఫీషియల్‌గా విడుదల చేశారు.

వినియోగదారుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని R2 నిరంతర రికార్డింగ్ కోసం హై-ఎండ్యూరెన్స్ SD కార్డ్ మరియు పార్కింగ్ గార్డ్ కోసం హార్డ్‌వైర్ కిట్‌ను అందిస్తోంది. ఎన్‌కోడింగ్ చిప్‌సెట్ ద్వారా వీడియో రికార్డ్ చేయబడుతుంది. ఇది 150-డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా స్ఫుటమైన 2MP చిత్రాలను తీయగలదు.
తక్కువ కాంతిలోనూ అధిక రెజెల్యూషన్‌ని కలిగే సెన్సార్‌ను అమర్చారు. H.265 కోడెక్‌ని ఉపయోగించి క్రిస్టల్ క్లియర్ 1080P రిజల్యూషన్‌లో వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ మొబైల్ ఓఎస్‌లకు అనుకూలంగా ఉండే మొబైల్ అప్లికేషన్‌ను కలిగి ఉంది.

ఈ యాప్ కెమెరాతో నిరంతంరం కనెక్టివిటీని పొందవచ్చు. కారులోని ఇన్‌పుట్ 12-24V, అవుట్‌పుట్ 5V/1.5A టైప్-సి లేదా హార్డ్‌వైర్ కిట్‌తో ఛార్జ్ చేయవచ్చు. స్టోరేజీ పరంగా SDHC క్లాస్10 (Max.128GB) వరకు పెంచుకోవచ్చు. త్రీ-యాక్సిస్ యాక్సిలరేషన్ సెన్సార్, ఇంటర్నల్ ఓమ్నిడైరెక్షనల్ నాయిస్ రిడక్షన్ మైక్రోఫోన్ మరియు స్పీకర్ ఈ కెమెరాలో ఉన్న మరిన్ని ఫీచర్లు.

తాజా డాష్ కెమెరాతో ధైర్యంగా డ్రైవ్ చేయండని సేఫ్ క్యామ్స్ డిజిటల్ ఐ వ్యవస్థాపకుడు మరియు CEO వనేష్ నైడూ అన్నారు. కచ్చితత్వం, నాణ్యత పూర్తి భారతీయ నైపుణ్యంతో దీనిని రూపొందించినట్లు ఆయన తెలిపారు. మార్కెట్‌లోని ఇతర డాష్ కెమెరాల మాదిరిగా కాకుండా, R2 అనేది ప్రత్యేక కొనుగోళ్లు మరియు ఇన్‌స్టాలేషన్‌ల ఇబ్బందులను తొలగించే సమగ్ర సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








