తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్‌లో మారుతి సుజుకి.. కారణాలివే.!!

భారత్ నుంచి ఈ సారి వాహనాల ఎగుమతులు(Automobile Exports) స్వల్పంగా క్షీణించాయని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం నివేదించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రధాన విదేశీ మార్కెట్లలో ఈ ఎగుమతులు తగ్గడానికి కారణంగా ఆటో నిపుణులు చెబుతున్నారు. మరి ఎంతమేర ఈ సారి ఎగుమతులు తగ్గిపోయాయి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

అన్ని రకాల వాహనాల ఎగుమతుల విభాగంలో వృద్ధి శాతం క్షీణించినప్పటికీ.. ప్యాసింజర్ వాహన విభాగం ఎగుమతుల్లో మాత్రం 1.4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా మొదలైనవన్నీ ముందంజలో ఉన్నాయి. అయితే టూవీలర్ సెగ్మెంట్ ఎగుమతుల్లో మాత్రం 5.3 శాతం క్షీణతను నమోదు చేసింది.

Automobile-Exports-Decline-2023-24

ఇదిలా ఉండగా ఎగుమతులు 16 శాతం క్షీణించడంతో కమర్షియల్‌ వెహికల్‌ సెగ్మెంట్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. కీలక ఎగుమతి మార్కెట్లలో సవాళ్లు మరియు అభివృద్ధి చెందుతున్న ట్రేడ్ డైనమిక్స్ ఈ క్షీణతకు కారణమని చెప్పవచ్చు. సవాళ్లు ఉన్నప్పటికీ, రికవరీ మార్గాన్ని సూచించే సానుకూల సంకేతాలు ఉన్నాయి.

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో మంచి రికవరీ కనిపించింది. ఈ రికవరీ రంగం యొక్క పునరుద్ధరణ మరియు వృద్ధికి మంచి సూచనగా కనిపించింది. ఇది భవిష్యత్తులో మరింత వృద్ధి కనిపించేలా ఆశాజనంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఆటో మొబైల్‌ ఎగుమతులను పరిశీలిద్దాం.

Automobile-Exports-Decline-2023-24

ఇతర ఎగుమతి వివరాలను పరిశీలిస్తే, గత ఏడాది వాహనాల ఎగుమతుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో ఎగుమతిదారు అయిన జపాన్‌ను చైనా అధిగమించింది. జపాన్ 4.91 మిలియన్ వాహనాలను ఎగుమతి చేసింది. చైనా యొక్క బ్యూరో ఆఫ్ కస్టమ్స్ 5.22 మిలియన్ల కంటే ఎక్కువ సంఖ్యను నివేదించింది. ఇది సంవత్సరానికి 57 శాతం పెరిగినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నెలవారీ ప్రాతిపదికన చూస్తే ఇప్పటికీ చైనా.. జపాన్ కంటే ఎక్కువ వాహనాలను ఎగుమతి చేసింది. అయితే నిన్న విడుదల చేసిన డేటా పూర్తి సంవత్సరానికి మొదటి స్థానంలో ఉందని ధృవీకరించింది. ఎలక్ట్రిక్ కార్లలో భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల చైనా ఆటో రంగం ఇటీవలి సంవత్సరాలలో పుంజుకుంది.

Automobile-Exports-Decline-2023-24

ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా చాలా సంవత్సరాలుగా గ్లోబల్‌ మార్కెట్‌ను శాసిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద EV మార్కెట్లు, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాల్లో టెస్లా బలమైన ఉనికిని కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో టెస్లా 4,84,507 వాహనాలను విక్రయించగా.. చైనీస్ బ్రాండ్ 5,26,406 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం ద్వారా అమెరికన్ బ్రాండ్‌ను అధిగమించింది.

ఇది కాకుండా, BYD ఎలక్ట్రిక్‌ కార్లు 2023-24 చివరి త్రైమాసికంలో షోరూమ్ నుంచి 4 లక్షలకు పైగా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. BYD 1995లో బ్యాటరీ తయారీ సంస్థగా స్థాపించబడింది. BYD 2003లో కార్ల తయారీలోకి ప్రవేశించింది. BYD చైనాలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ మోడల్‌లను విక్రయించడమే కాకుండా.. ఐరోపా మార్కెట్‌లో ఎక్కువగా దృష్టి సారించింది.

Automobile-Exports-Decline-2023-24

ఈ నివేదికల ప్రకారం వాహనాల ఎగుమతిలో భారత్‌ కాస్త వెనుకబడి ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. టూ వీలర్స్‌ విభాగంలో కొన్ని ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు ఎగుమతుల పరంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. ఫోర్‌ వీలర్స్ విభాగంలో ఎగుమతుల పరంగా ఆటో కంపెనీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2024, 8:51 [IST]
English summary
Automobile exports from india declines in 2023 24 financial year check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+