భారత దేశ నిర్మాణంలో ఆటోమొబైల్ పరిశ్రమ పాత్ర కీలకం.. అతి త్వరలో ప్రంపంచ నంబర్‌ 1గా ఎదిగే అవకాశం

భారతదేశంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ ప్రధాన అభివృద్ధి వనరుగా, ప్రత్యక్ష ఉపాధి కల్పన రంగంగా ఉంది. దేశ జీడీపీలో 7.1% వాటాతో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఈ రంగం 35 మిలియన్లకు (3.5 కోట్ల)మందికి పైగా ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. దీంతో దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ రంగం వేగంగా విస్తరిస్తుంది. తద్వారా భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. ఇలానే పాజిటీవ్‌ రెస్పాన్స్‌ కొనసాగితే అతి త్వరలోనే ఈ రంగం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుంది.

ప్రారంభ దశలో దేశంలో ఈ పరిశ్రమ నెమ్మదిగా ఉంది. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో చాలా వాహనాలు దిగుమతి చేసుకున్నారు. ప్రత్యక్షంగా ఇక్కడ తయారీ ప్లాంట్స్‌ లేవు. అందువల్ల దిగమతిపైనే ఆధారపడాల్సి వచ్చేది. హిందుస్థాన్ మోటార్స్ 1942లో భారతదేశంలో కార్ల ఉత్పత్తిని తయారు చేయడం ప్రారంభించింది. తరువాత ప్రీమియర్ (Premier), మహీంద్రా & మహీంద్రా మరియు టాటా ఇంజనీరింగ్ వచ్చాయి.

Automotive-Industry-In-India-Nation-Building

ప్రభుత్వ కార్యక్రమాలు & పరిశ్రమలో మార్పు: స్వాతంత్ర్యానంతరం, ప్రభుత్వం దేశంలో సొంతంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 1952లో మొదటి ప్రోత్సాహకాలు (టారిఫ్) కమిషన్‌ని ఏర్పాటు చేసింది. దీంతో జనరల్ మోటార్స్, ఫోర్డ్, రూట్స్ గ్రూప్ వంటి విదేశీ కంపెనీలు భారత్ నుంచి నిష్క్రమించాయి.

1980వ దశకంలో కాలం చెల్లిన వాహనాలు స్క్రాపింగ్‌, ఇతర సమస్యలు ప్రభుత్వానికి పెను సవాలుగా ఉండేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి సుజుకి సహకారంతో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మారుతి 800 హ్యాచ్‌బ్యాక్‌లను ఉత్పత్తి చేసి భారీ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి కార్ల అమ్మకాలు కాస్త ఊపందుకున్నాయి.

Automotive-Industry-In-India-Nation-Building

1990వ దశకంలో మళ్లీ మార్కెట్ సరళీకరణను తీసుకువచ్చి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆటోమొబైల్ రంగంలో ఎప్పుడూ ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడంతో పాటు గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయం, సేవలు వంటి వివిధ రంగాలకు ఊతమిచ్చింది.

స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, విదేశీ ఉత్పత్తులపై సడలింపులతో 2022 నాటికి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. ఇప్పుడు కార్ల అమ్మకాలలో జపాన్‌ని అధిగమించింది. 2022 నుంచి ఈ పరిశ్రమ 26.36 మిలియన్ (2.6 కోట్లు) వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇందులో 5.62 మిలియన్ (56 లక్షల) యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని పెంచింది.

Automotive-Industry-In-India-Nation-Building

ఉపాధి & ఇన్నోవేషన్‌: ఆటోమోటివ్ రంగం భారతదేశపు అతిపెద్ద ఎంప్లాయర్లలో ఒకటిగా ఎదిగింది. ఈ పరిశ్రమ నుంచి దాదాపు 13 మిలియన్ల మందికి ప్రత్యక్షంగా మరియు మరో 22 మిలియన్ల మందికి పరోక్షంగా ఉపాధిని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీల్లో పెట్టుబడులతో ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌ కేంద్రంగా భారత్‌ వేగంగా ఎదుగుతోంది.

ఈ పరిశ్రమను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా', 'ఫేమ్' వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఫేమ్ పథకం సబ్సిడీలు మరియు ప్రోత్సాహకాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సైతం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. పరిశ్రమ వృద్ధి కోసం మెరుగైన రహదారులు మరియు రవాణా సౌకర్యాలతో సహా దీని అనుబంధ విభాగాలకు ఊతం అందిస్తుంది.

భవిష్యత్తు అంచనాలు: భారత ఆటోమొబైల్ పరిశ్రమ 2026 నాటికి 300 బిలియన్ డాలర్లకు (30000 వేల కోట్లకు) చేరుకుంటుందని, 200 బిలియన్ డాలర్లకు 20000 వేలకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా వేస్తున్నారు. 2022-2030 మధ్య ఈవీ మార్కెట్ 49 శాతం వృద్ధి చెందుతుందని కాగ్‌ అంచనా వేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 14, 2024, 14:21 [IST]
English summary
Automotive industry in india one of the key section for nation building
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+