ఆటోమొబైల్‌ ప్రేమికుల కోసం ఆర్ట్ ఎగ్జిబిషన్‌.. ఈ రోజే లాస్ట్‌.. ఎక్కడో తెలుసా!

ఆర్ట్‌ ప్రేమికులు, కారు ఔత్సాహికుల కోసం బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులోని ఆర్ట్ హౌస్ గ్యాలరీలో మూడు రోజుల ఆటోమోటివ్ రాప్సోడీ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు. నిన్న (ఆగస్టు 9) ప్రారంభమైన ఈ ప్రదర్శన రేపటి (ఆగస్టు 11) వరకు కొనసాగనుంది. ఆసక్తిగల కళాభిమానులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ఆర్టెల్లా వ్యవస్థాపకురాలు బెలిండా ఫెర్నాండెజ్ నేతృత్వంలో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బర్వానీకి చెందిన ప్రతిభావంతులైన ఆటోమోటివ్ ఆర్టిస్ట్‌ ప్రిన్సెస్ విదిత పెయింటింగ్స్ (Princess Vidita Singh Barwani) ఈ ప్రదర్శనలో ఉన్నాయి. విదిత తన బ్రష్ ద్వారా భారతదేశ ఆటోమోటివ్ చరిత్రను కాల్పనికంగా డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందింది.

Automotive-Rhapsody-Auto-Exabition

మైసూరు ఎంపీ, మహారాజా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ నిన్న (ఆగస్టు 9) జరిగిన ఆటోమోటివ్ రాప్సోడీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ చిత్రకారుడు ఎస్.జి.వాసుదేవ్, ఆర్టిస్ట్‌ విమర్శకుడు డాక్టర్ ప్రమీలా లోచన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మహారాజా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ప్రిన్సెస్‌ విదిత చేసిన కృషిని అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు చేసిన కృషి అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరెన్నో రావాలని ఆయన సూచించారు. ప్రిన్సెస్‌ విదిత రాణి చిత్రాలు ఆటోమోటివ్‌ రంగంలోని కళాత్మక నైపుణ్యాలకు అద్ధం పడతాయి. ఆటోమోటివ్ రంగంలో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని పెంపొందించడానికి ఈ ప్రదర్శన సహాయపడతాయి.

Automotive-Rhapsody-Auto-Art-Gallery

ఆటోమోటివ్ రంగంలోని బ్యూటీ మరియు సాంకేతిక అద్భుతాలను హైలైట్ చేయడానికి ఈ చిత్రాలు ప్రత్యేక పెయింటిగ్‌ని కలిగి ఉన్నాయి. ప్రిన్సెస్‌ విదిత చిత్రాలు వింటేజ్ కార్లను పోలినట్లు అప్పటి ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేస్తాయని ఆర్టెల్లా వ్యవస్థాపకురాలు బెలిండా ఫెర్నాండెజ్ అన్నారు. ఆటోమోటివ్ రాప్సోడీ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ని బెంగళూరులో నిర్వహించడం గర్వకారణమన్నారు.

ఈ ఆర్ట్‌ ఎగ్జిబిషన్ ఆటోమోటివ్ డిజైన్లను ఒకే చోట చూడటానికి అరుదైన అవకాశాన్ని అందిస్తుంది. ఆర్ట్ ప్రేమికులు మరియు కారు ఔత్సాహికులను ఈ ఆకర్షించడం ఖాయం. ఈ ప్రదర్శనలో కాన్వాస్ పై నూనె, వాటర్ కలర్ మరియు బొగ్గు ముక్కలతో సహా వివిధ రకాల కళాఖండాలు కూడా ఉన్నాయి. సందర్శకులను ఈ షో ముఖ్యంగా ఆటోమోబైల్‌ ప్రేమికులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఆటోమోటివ్‌ నూతన ఆవిష్కరణల కలయికల నుంచి వింటేజ్‌ కార్ల పెయింట్స్‌ ఈ ప్రదర్శనలో హైలట్‌గా నిలుస్తున్నాయి. వీటిని తిలకించేందుకు బెంగళూరుతో పాటు చుట్టు పక్కల ప్రజలు ప్రముఖులు, కళాభిమానులు, ఔత్సాహికులు హాజరయ్యారు. ప్రతి కళాఖండం వారసత్వం మరియు పురోగతి వివరించింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, August 11, 2024, 7:20 [IST]
English summary
Automotive rhapsody art houz gallery bengaluru details in telugu
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+