పెద్ద కార్లు బోలెడన్నీ ప్రయోజనాలు.. 26 కి.మీ మైలేజీ పక్కా.. ధర రూ. 5.32 లక్షల నుంచే స్టార్ట్!
ప్రస్తుతం మార్కెట్‌లో ఎంపీవీ (మల్టీ పర్పస్ వెహికిల్స్) హవా కొనసాగుతుంది. కార్లు కొనేవారు ఎక్కువగా లగ్జరీయస్‌గా ఉండేలా పెద్ద కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా మార్కెట్‌లో ఈ కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రతీ వంద మందిలో 35-40 శాతం ఫ్యామిలీ కార్లను (7 సీటర్స్) ఎంపీవీలను కొనుగోలు చేస్తున్నారు. చాలా తక్కువ ధరలో మార్కెట్‌లో కొన్ని ఎంపీవీలు, 7 సీటర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga), XL 6 (XL 6), ఈకో వ్యాన్ (Eeco Van), రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber), మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo SUV)లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్ల ధరలు, వాటి ఫీచర్లు, మైలేజీ తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ వివరాలపై ఓ లుక్కేయండి.
మారుతి సుజుకి ఎర్టిగా: ఈ జాబితాలో తొలి 7 సీటర్ కారు. ఈ ఎంపీవీ 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 20.3 నుంచి 26.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఎర్టిగా 7-సీటర్ ఆప్షన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉంది. ప్రస్తుతం సేల్స్‌లో ఈ ఎంపీవీ నంబర్ 1గా కొనసాగుతుంది.

ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్స్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), రియర్ పార్కింగ్ సెనర్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ .8.69 లక్షల నుంచి రూ .13.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
మారుతి సుజుకి ఎక్స్ఎల్6: ఈ ఎంపీవీ 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 20.27 నుంచి 26.32 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ప్యాడిల్ షిఫ్టర్స్, ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ .11.61 లక్షల నుంచి రూ .14.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

మారుతి సుజుకి ఈకో వ్యాన్: ఇది 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ వ్యాన్ 19.71 నుంచి 26.78 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ స్పీడోమీటర్, మాన్యువల్ ఏసీ, 12వీ ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5, 7 సీటింగ్ ఆప్షన్‌తో వస్తుంది. దీని ధర రూ .5.32- రూ. 6.58 లక్షల మధ్య ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్: ఈ ఎంపీవీ 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 18.2 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ .6 లక్షల నుంచి రూ .8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

మహీంద్రా బొలెరో నియో: ఇది పాపులర్ ఎస్‌యూవీ. దీనికి ఉన్న డిమాండ్ వల్ల ఈ జాబితాలో చేర్చాము. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 17.29 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.9.95 లక్షల నుంచి రూ.12.15 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








