30 కి.మీ పైగా మైలేజ్.. ధర రూ. 5 లక్షల లోపు మాత్రమే.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి
ప్రతి ఫ్యామిలీకి కారు ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. అందుకే తమ సంపాదనలో కొత్త మొత్తం కలిపి ఈఎంఐల ద్వారా కారు కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంతమంది తక్కువ బడ్జెట్ కారణంగా కారు కొనాలనుకున్నా కొనలేకపోతున్నారు. వారికోసం బడ్జెట్ ధరలో లభించే కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ధర రూ. 5 లక్షల లోపే..
మారుతి సుజుకి S-ప్రెస్సో: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకి S-Presso ఒకటి. ఈ కారు 6 వేరియంట్ల(Best Affordable Cars in India)లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్, LXI, VXI, VXI ప్లస్, VXI (O), VXI ప్లస్ (O)లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఇది చూడటానికి SUV మాదిరిగా అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

మారుతి సుజుకి S-Presso లో స్టీల్ వీల్స్, రూఫ్-మౌంటెడ్ యాంటెన్నా, బాడీ-కలర్ బంపర్స్, హాలోజన్ హెడ్‌లైట్లు, సి-ఆకారపు టెయిల్ లైట్లతో ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.4.26 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర.
తక్కువ ధరలో లభిస్తున్న Maruti Suzuki S Presso లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలను కలిగి ఉంది. ఇంకా ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని అందించే ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉంది. స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ఇతర ఫీచర్లను చూడవచ్చు.

S-Presso లో పవర్‌ట్రెయిన్ పరంగా 1.0-లీటర్, K10C పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 66 bhp పవర్ మరియు 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ CNG కిట్‌తో కూడా కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT యూనిట్లతో జత చేయబడి ఉంటుంది. మైలేజ్ పరంగా పెట్రోల్ వెర్షన్లో 24.12 kmpl CNGలో 32.73 km/kg మైలేజ్ ఇస్తుంది.
రెనాల్ట్ క్విడ్: భారత మార్కెట్లో అత్యంత పాపులర్ కారు రెనాల్ట్ క్విడ్. చాలా తక్కువ ధరలో ఇది అందుబాటులో ఉంది. Renault kwid ప్రారంభ ధర రూ. 4.70 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. దీనిని డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

మెటల్ మస్టర్డ్, ఐస్ కూల్ వైట్‌లో పాటు మూన్‌లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ సింగిల్-టోన్ పెయింట్ ఆప్షన్లలో కూడా కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. క్విడ్‌లో సీట్ బెల్ట్ పైరోటెక్, లోడ్ లిమిటర్ స్టాండర్డ్‌గా వస్తాయి. ఇంకా ఇందులో అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్ల పరంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరాతో కూడిన రివర్స్ పార్క్ సెన్సార్ వంటి ఫీచర్లతో వస్తుంది. టెక్ ఫీచర్ల పరంగా 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్-టోన్ ఫాబ్రిక్ సీట్ కవర్‌లు ఉన్నాయి.

ఇంకా ఇందులో వేగవంతమైన USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ప్రధాన ఇంటీరియర్ హైలైట్‌లను కలిగి ఉంది. రెనాల్ట్ క్విడ్ 0.8-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 53 bhp, మరియు 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఇంజిన్ల పరంగా 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్ ఆప్షన్ కూడా ఉంది.
రెనాల్ట్ క్విడ్ ఈ వేరియంట్ 67 bhp మరియు 97 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్లలో AMT ఆటోమేటిక్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మైలేజ్ పరంగా లీటర్ పెట్రోల్‌కు 22 కి.మీల మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








