ప్రమాదంలో ప్రాణాలు కాపాడే అత్యుత్తమ కార్లు - సేఫ్టీలో వీటికి తిరుగే లేదు!

భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్/రేంజ్ అందించే వాహనాలను మాత్రమే కాకుండా.. బెస్ట్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లను ఎంచుకుంటున్నారు. ఈ కథనంలో 5-స్టార్ రేటింగ్ పొందిన కార్లను గురించి తెలుసుకుందాం..

టాటా నెక్సాన్ (Tata Nexon)

సేఫ్టీ అంటేనే ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ 'టాటా'. ఇందులో కూడా నెక్సాన్ అత్యంత ప్రజాదరణ పొందిన.. సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న బెస్ట్ మోడల్. ఈ కారు అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 32.22 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 44.52 పాయింట్లు సాధించి గ్లోబల్ NCAP క్రాష్-టెస్ట్‌‌‌‌లో 5-స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఇందులో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

Tata Safari And Harrier

టాటా హారియర్ (Tata Harrier)

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌‌‌‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన మరో టాటా కారు 'హారియార్'. ఈ SUV అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 33.05 పాయింట్లను, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించి మొత్తం మీద అత్యంత సురక్షితమైన కారుగా సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి.

టాటా సఫారీ (Tata Safari)

దేశీయ మార్కెట్లో విశేషయమైన స్పందన పొందుతున్న టాటా సఫారీ కూడా అత్యంత సురక్షితమైన కారు. ఇది గ్లోబల్ NCAP టెస్ట్‌‌‌‌లో అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 33.05 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు 45 పాయింట్లు స్కోర్ సాధించి మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇందులో ESP, EBD, TPMS, బ్రేక్ డౌన్ అలర్ట్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

Tata Punch

టాటా పంచ్ (Tata Punch)

టాటా మోటార్స్ యొక్క అత్యధిక అమ్మకాలు పొందిన మైక్రో SUV పంచ్ కూడా గ్లోబల్ NCAPలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. టాటా పంచ్ అడల్ట్ అండ్ కిడ్స్ సేఫ్టీలో ఉత్తమ స్కోర్ సాధించింది. ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అనేక భద్రతా ఫీచర్స్ కలిగిన ఈ కారు ఇప్పటికే అనేక ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన టైగన్ SUV కూడా చెప్పుకోదగ్గ సేఫ్టీ ఫీచర్స్ కలిగి అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 29.64 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్లు స్కోర్ చేసి మొత్తం మీద గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌‌‌‌లో 5 స్టార్ రేటింగ్ పొందింది. మొత్తం సేఫ్టీలో 71.64 పాయింట్స్ సాధించి దేశంలోని అత్యుత్తమ సేఫ్టీ కార్లలో టైగన్ ఒకటిగా రికార్డ్ కైవసం చేసుకుంది.

Skoda Kushaq Elegance Edition

స్కోడా కుషాక్ (Skoda Kushaq)

భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న స్కోడా బ్రాండ్ కారు కుషాక్ సేఫ్టీలో 5 స్టార్ట్ సాధించిన కార్ల జాబితాలో ఒకటి. ఇది పెద్దల సేఫ్టీలో 34 పాయింట్లకు 29.64 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్ల స్కోర్ సాధించి గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌‌‌‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ SUVలో వాహన వినియోగదారులకు రక్షణకు కావాల్సిన అన్ని సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N)

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో-ఎన్ కూడా అత్యంత సురక్షితమైన కారు. ఎందుకంటే ఇది గ్లోబల్ NCAP టెస్ట్‌‌‌‌లో 5 స్టార్ రేటింగ్ (అడల్ట్ సేఫ్టీలో 34కు 29.25 పాయింట్స్, చైల్డ్ సేఫ్టీలో 49కు 28.93 పాయింట్స్) సాధించింది. ఈ కారు పెద్దల సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందినప్పటికీ.. పిల్లల సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ మాత్రమే స్కోర్ చేయగలిగింది.

Mahindra XUV700

మహీంద్రా ఎక్స్​యూవీ700 (Mahindra XUV700)

ఆధునిక ఫీచర్స్ కలిగిన మహీంద్రా ఎక్స్​యూవీ700 కూడా దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. అడల్ట్ సేఫ్టీలో (34కు 16.03 పాయింట్స్) 5-స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు పిల్లల సేఫ్టీలో (49కు 41.66 పాయింట్స్) 4-స్టార్ రేటింగ్ సాధించింది. ఇది మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి పటిష్టంగా రూపొందించబడింది.

మహీంద్రా ఎక్స్​యూవీ300 (Mahindra XUV300)

మహీంద్రా కంపెనీకి చెందిన మరో సేఫెస్ట్ కారు ఎక్స్​యూవీ300. ఇది అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 16.42 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు 41.66 పాయింట్ల స్కోర్ సాధించి మొత్తం మీద గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌‌‌‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కారు ఆధునిక హంగులతో త్వరలోనే అప్డేటెడ్ మోడల్ రూపంలో లాంచ్ కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 16, 2024, 11:00 [IST]
English summary
Best and top safest cars in india with five star rating
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+