సమ్మర్‌లో అద్భుతమైన ఏసీని అందించే కార్ల కోసం చూస్తున్నారా.. ఈ బ్రాండ్లపై ఓ లుక్కేయండి
ఏప్రిల్ ప్రారంభమైంది. ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వేడి వాతావరణం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో మీరు ఈ మండే వేసవిలో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే చాలా విషయాలు ఆలోచించాలి. ముఖ్యంగా అద్భుతమైన ఏసీ పనితీరును అందించే బ్రాండ్ కారును కొనుగోలు చేయాలి.
వేసవిలో కారులో ఏసీ లేనిదే ప్రయాణించడం చాలా కష్టం. అయితే కొన్ని కార్లు ఏసీ పరంగా ఎండాకాలంలో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో మీరు ఈ సమ్మర్ సీజన్‌లో మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే.. అందులో ఏసీ పనితీరు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవి క్యాబిన్‌ను చాలా త్వరగా చల్లబరుస్తాయి. అలాంటి ఐదు అద్భుతమైన కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

భారత మార్కెట్లో అద్భుతమైన AC పనితీరును అందించే కార్ బ్రాండ్లలో దేశీ బ్రాండ్ టాటా మోటార్స్(Tata Cars) ఒకటి. టాటా కార్లు ఎక్స్‌ప్రెస్ కూలింగ్‌గా బాగా ప్రాచుర్యం పొందాయి. టాటా కార్లలో ఇందులో AC ఫుల్ బ్లాస్ట్‌లో పనిచేస్తుంది. టాటాకు చెందిన అన్ని కార్లలో ఏసీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. అదనంగా, సఫారీ దాని 6-సీటర్ వెర్షన్లో కూడా రియర్ సీటు వెంటిలేషన్‌ను కూడా కలిగి ఉంది.
జపనీస్ బ్రాండ్ హోండా కార్లలో కూడా ఆకట్టుకునే AC వ్యవస్థ ఉంది. ప్రస్తుతం హోండా సిటీ, అమేజ్ & ఎలివేట్ వంటి కార్లను విక్రయిస్తోంది. ఈ మూడు కార్లలోని ఏసీ క్యాబిన్‌ను చాలా త్వరగా చల్లబరుస్తుంది. అలాగే ఈ మూడు కార్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది.

అదనంగా, హోండా సిటీ మరియు ఎలివేట్ కార్లలో అలెక్సా కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా మీరు కారు బయట నుంచే ఇంటీరియర్ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా ఏసీని మీరు బయట నుంచి ఆన్ చేయడం ద్వారా.. మీరు లోపలికి రాకముందే మీ కారును చల్లబరుస్తుంది.

కొరియన్ బ్రాండ్లు హ్యుందాయ్ మరియు కియా కూడా త్వరగా చిల్ అయ్యే AC వ్యవస్థతో అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ i10 Nios నుంచి కియా సెల్టోస్ లేదా హ్యుందాయ్ Ioniq 5 వరకు వారి అన్ని కార్లలో ఆకట్టుకునే AC పనితీరును ఆస్వాదించవచ్చు. ఈ బ్రాండ్‌ల కార్లలో కూడా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి.
భారత మార్కెట్లో అద్భుతమైన AC పనితీరును అందించే ప్రముఖ కారు బ్రాండ్లలో మారుతి సుజుకి కూడా ముందు వరుసలో ఉంటుంది. మార్కెట్లో మారుతి కార్లు బాగా అమ్ముడవడానికి సరసమైన ధరతో పాటు ఏసీ కూడా ఓ కారణం. మారుతి కార్లు ఎక్కువగా UV-కట్ విండో గ్లాసెస్‌తో వస్తాయి. ఇది కారు లోపలికి నేరుగా సూర్యకాంతి ప్రవేశించడాన్ని తగ్గించి.. AC క్యాబిన్‌ను చల్లబరుస్తుంది.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. వేసవిలో అద్భుతమైన పనితీరును అందించే ప్రముఖ బ్రాండ్లలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ కూడా ఒకటి. ఫార్చ్యూనర్ వంటి SUVలు క్యాబిన్‌ను చాలా త్వరగా చల్లబరుస్తుంది. అందుకే ఏసీ పనితీరు పరంగా టయోటా కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మారుతి కార్ల మాదిరిగానే, టయోటా కూడా వేసవిలో క్యాబిన్‌లో వేడిని తగ్గించేందుకు.. లేతరంగు లేదా UV-కట్ విండోలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








