తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లు.. మీ డబ్బు ఆదా కావాలంటే వీటిని ట్రై చేయండి!

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్‌ కార్లు అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో కార్ల కంపెనీలు తమ లైనప్స్‌లోని ఫేమస్ కార్లను ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో ప్రవేశపెట్టడం లేదా నేరుగా కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను భారీ మొత్తంలో విక్రయిస్తున్నాయి. వీటికి మార్కెట్‌లో కూడా డిమాండ్‌ భారీగా ఉంది. మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తే రూ .11 లక్షల లోపు కొన్ని కార్లు మార్కెట్‌లో మంచి రేంజ్‌, ఫీచర్లతో ‌అందుబాటులో ఉన్నాయి. ఆ కార్లకు సంబంధించిన జాబితాపై ఓ లుక్కేయండి.

ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV), టాటా టియాగో ఈవీ (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి.

Tata Tiago EV

ముందుగా ఈ జాబితాలో సరసమైన ఎలక్ట్రిక్‌ కారుగా టాటా టియాగో ఈవీ ఉంది. దీని ధర రూ .7.99 లక్షల నుంచి రూ .11.89 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 19.2 కిలోవాట్స్‌, 24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 221 నుంచి 225 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో 5 మంది వరకు ప్రయాణించవచ్చు.

కొత్త టాటా టియాగో ఈవీలో 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ హర్మన్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదే విధంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, టీపీఎంఎస్‌ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రయాణీకులకు మంచి సేఫ్టీని అందిస్తాయి.

MG Comet EV

ఆ తర్వాత జాబితాలో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఉంది. దీని ధర రూ .6.99 లక్షల నుంచి రూ .9.53 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. ఇది 17.3 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఈ కారు సింగిల్‌ ఛార్జ్‌పై 230 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 7.4 కిలోవాట్ల ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేయడానికి కేవలం 3.5 గంటలు పడుతుంది.

కొత్త ఎంజీ కామెట్ ఈవీలో నలుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ (ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం ప్యాసింజర్ సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

Tata Punch EV

ఆ తర్వాత టాటా పంచ్ ఈవీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంది. ఇది రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్యలో ఉంది. ఈ కారు 25 కిలోవాట్ల, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌లో 265 నుంచి 365 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఈ పంచ్ ఈవీలో 5 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్‌, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు కలవు.

MG Windsor EV

ఇక తాజాగా విడుదలైన కారు సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. ఇందులో 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే లీటరుకు 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారులో ఐదుగురు హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు.

ఎంజీ విండ్సర్ ఈవీలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇందులో 6-ఎయిర్ బ్యాగ్స్‌, 360-డిగ్రీల కెమెరా కలదు.

More from DriveSpark

Article Published On: Saturday, September 14, 2024, 18:25 [IST]
English summary
Best electric cars under 11 lakhs check range and specifications in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+