ఈ కార్లలో కుటుంబం అంతా కలిసి హ్యాపీగా వెళ్లచ్చు.. ఫ్యామిలీ బెస్ట్ ఎంపీవీలు.. మంచి మైలేజ్.. అతి తక్కువ ధర!

కరోనా తర్వాత కుటుంబ ప్రయాణాలు ఎక్కువగా పెరిగాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి దూర ప్రాంతాలకు అందరు ప్రయాణించడం, వీకెండ్ సమయంలో ఉద్యోగులు కొత్త ప్రాంతాలకు వెళి ఎంజాయ్ చేయడం లాంటివి ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. అయితే ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి చిన్న కార్లు అనువుగా ఉండవు. ఇలాంటి వాటికి పెద్ద సైజు ఎంపీవీ కార్లు అనువుగా ఉంటాయి. దాదాపు 6 లేదా 7 సీటర్ కార్లు టూర్లకు బెస్ట్ ఆప్షన్. రెండు కుటుంబాలు కలిసి ఆడుతూ పాడుతూ ప్రయాణించడానికి ఎంపీవీలు బాగా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఎంపీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్తగా పెద్ద కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఏ మోడల్‌ను ఎంచుకోవాలో తెలియక చాలా సతమతం అవుతుంటారు. ముఖ్యంగా ఎంపీలను కొనుగోలు చేసే సమయంలో మైలేజ్, ధర, పెర్ఫామెన్స్, ఫీచర్లను కూడా పూర్తిగా తెలుసుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.

6-7 సీటర్ కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి టయోటా (Toyota), మారుతీ సుజుకీ (Maruti Suzuki), మహీంద్రా (mahindra) కంపెనీలకు చెందిన ఎంపీవీలు ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. టయోటా రూమియన్ (Rumion), మారుతీ సుజుకీ ఈకో (Eeco), మహీంద్రా బొలెరో నియో (Bolero neo) ఫ్యామిలీ కార్లు రెండు కుటుంబాలకు కూడా అనువుగా ఉంటాయి. ఇవి డజన్ల కొద్ది అధునాతన ఫీచర్లను కలిగి ఉంటాయి.

Top Best Family Car Maruti Suzuki Neo Eeco

Maruti Suzuki Eeco:మారుతీ సుజుకీ ఈకో బడ్జెట్ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉన్న కారు. రెండు కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది 7 సీటర్ ఫ్యామిలీ కారు. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.5.32 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ రూ.6.58 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. మైలేజ్ 19.71 కి.మీల నుంచి 26.78 కిమీల వరకు వస్తుంది.

మారుతీ సుజుకీ ఈకో ఇంజిన్‌కు 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్‌‌ను జోడించారు. ఇది ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యాష్‌బోర్డు అందంగా ఉంటుంది. లేత గోధుమరంగు డాష్‌బోర్డ్‌తో, పేక్ లెదర్ అపోల్స్ట్రేను కలిగి ఉంది. ఇది స్లైడింగ్ డోర్స్‌తో వచ్చింది. లోపల డిజిటల్ స్పీడోమీటర్, 12V ఛార్జింగ్ సాకెట్‌, మాన్యువల్ AC ఆప్షన్, ప్రయాణికుల రక్షణకు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్‌లు, స్పీడ్ అలర్ట్ వంటివి ఉన్నాయి.

Top Best Family Car Toyota Rumion

Toyota Rumion MPV: టయోటా రూమియన్ ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.10.44 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ.13.73 లక్షల వరకు ఉంటుంది, ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది 1.5-లీటర్ పెట్రోల్ , CNG ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మోడల్ 20.11 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే CNG 26.11 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది.

రూమియన్ ఎంపీవీలో 7 మంది కలిసి ప్రయాణించవచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కారు లోపల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ AC, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ప్రయాణికుల భద్రతకు సంబంధించి 4 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Top 3 Best Family Cars Bolero

mahindra Bolero neo: మహీంద్రా బొలెరో నియో స్టైలిష్‌గా ఉంటుంది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.95 లక్షల నుండి రూ. 12.15 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో వచ్చింది. మైలేజ్ విషయానికి వస్తే 17.29 కి.మీల వరకు ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, December 29, 2024, 9:00 [IST]
English summary
Best family cars mahindra bolero neo maruti suzuki eeco toyota rumion
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+