ఎక్కువ మైలేజ్ అందించే బెస్ట్ మారుతి కార్లు.. రూ.10 లక్షల కంటే తక్కువే

దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో మంచి మైలేజ్ అందించే మారుతి కార్లను గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి కార్లలో.. సెలెరియో, ఎస్ ప్రెస్సో, ఆల్టో కే10, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైన్, బాలెనొ మొదలైనవి ఉన్నాయి. వీటి ధర రూ. 10 లక్షల కంటే తక్కువే. ఇవి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ అందించడమే కాకుండా అత్యుత్తమ మైలేజ్ కూడా అందిస్తాయి. ఈ కారణంగా చాలామంది వీటికి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

Maruti Celerio

మారుతి సెలెరియో

మారుతి సుజుకి యొక్క సెలెరియో మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 25.24 కిమీ మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. కాగా ఆటోమాటిక్ వేరియంట్ 26.68 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు ధరలు రూ. 5.36 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య ఉన్నాయి.

మారుతి ఎస్ ప్రెస్సో

దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న 'ఎస్ ప్రెస్సో' కూడా మంచి మైలేజీ అందించే మారుతి కార్లలో ఒకటి. ఇందులోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమాటిక్ వేరియంట్ 25.3 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ధర భారతీయ విఫణిలో రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.11 లక్షల మధ్య ఉంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

Maruti Alto K10

మారుతి ఆల్టో కే10

ఒకప్పటి నుంచి విపరీతమైన అమ్మకాలు పొందుతున్న మారుతి ఆల్టో తక్కువ ధర వద్ద లభించే కార్లలో చెప్పుకోదగ్గది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ. 4.00 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఆటోమాటిక్ వేరియంట్ 24.9 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుంది. కాగా మాన్యువల్ వేరియంట్ లీటర్లు 24.39 కిమీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మారుతి వ్యాగన్ ఆర్

టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ అని పిలువబడే ఈ వ్యాగన్ ఆర్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.0 లీటర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ కలిగిన కారు లీటరుకు 24.35 కిమీ మైలేజ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ మోడల్ 25.19 కిమీ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని 1.2లీటర్ ఇంజిన్ 23.9 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ.5.54 లక్షల నుంచి రూ. 8.50 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Maruti Swift

మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి కంపెనీ ఇటీవలే నాలుగో జనరేషన్ స్విఫ్ట్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 6.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.2 లీటర్ జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులోని ఆటోమాటిక్ వేరియంట్ 25.75 కిమీ / లీ మైలేజ్ మరియు మాన్యువల్ వేరియంట్ 24.8 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.

మారుతి డిజైర్

భారతీయ మార్కెట్లో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి మారుతి సుజుకి యొక్క డిజైర్. ఇందులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ వేరియంట్ మోడల్ లీటరుకు 23.26 కిమీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వేరియంట్ 23.69 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మారుతి డిజైర్ దీని ప్రారంభ ధర రూ. 6.56 లక్షలు (ఎక్స్ షోరూమ్).

మారుతి బాలెనొ

ఇక చివరగా మన జాబితాలో ముఖ్యమైన మోడల్.. మారుతి బాలెనొ. ఈ కారు యొక్క ధరలు రూ.6.66 లక్షల నుంచి రూ.9.88 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యొక్క మాన్యువల్ వేరియంట్ 22.35 కిమీ/లీ మరియు ఆటోమాటిక్ వేరియంట్ 22.94 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 25, 2024, 11:10 [IST]
English summary
Best fuel efficient maruti suzuki cars under 10 lakh
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+