భారత్‌లో ఎక్కువ అమ్ముడుపోతున్న బెస్ట్ ఫ్యామిలీ కార్స్.. మైలేజ్‌లో రారాజులు.. ధర కూడా బడ్జెట్‌లోనే..
భారత్‌లో చిన్న కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరు తమ అవసరాలకు తక్కువ ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. భద్రత పరంగా ఇవి అత్యంత నమ్మకమైనవిగా ఉంటాయి. వీటిలో ఫీచర్లు కూడా అధునాతనంగానే ఉంటాయి. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్, కాంపాక్ట్ సైజు వంటి పలు అంశాలతో హ్యాచ్‌బ్యాక్‌లు భారత్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న విభాగంగా ఉన్నాయి. వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతూ ఈ విభాగం కార్ల ఉత్పత్తిపై దృష్టి సారించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ కంపెనీలు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో చాలా కాలంగా కార్లను విడుదల చేస్తూ మిగతా కంపెనీల కంటే ముందు వరుసలో ఉన్నాయి. వీటి నుంచి వచ్చిన కార్ల వివరాలను ఒకసారి చూద్దాం..
Maruti Suzuki Alto 800: మారుతీ సుజుకీ ఆల్టో 800 ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కారు. మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనుగోలు చేయాలనే కోరికను ఇది తీర్చింది. తక్కువ ధరలో లభించడమే కాకుండా, డిజైన్ కూడా అందరిని కట్టిపడేసేలా ఉంటుంది. లోపల విశాలంగా ఉంటుంది. ఇంటీరియర్ ఆహ్లాదకరంగా ఉంది. ఇది 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి వాటిని కలిగి ఉంటుంది.

Maruti Suzuki Wagon r: మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వర్గాల వారికి చేరువ అయింది. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమైన కారు. దీని ప్రారంభ ధర రూ.5.55 లక్షల నుంచి రూ.7.33 లక్షల వరకు లభిస్తుంది. ఈ ఏడాదిలో అమ్మకాల పరంగా వ్యాగన్ ఆర్ ఇతర కార్ల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే కాకుండా CNG వెర్షన్‌లో కూడా లభిస్తుంది.
Maruti Suzuki swift: మారుతీ సుజుకీ స్విఫ్ట్ చాలా కాలంగా దేశంలో మంచి ఆదరణ సంపాదిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఇది ముఖ్యంగా ఐదు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 2024 స్విఫ్ట్ మోడల్ సీఎన్‌జీలో కూడా లభిస్తుంది. 5 మంది కలిసి ఈ కారులో సులభంగా ప్రయాణించవచ్చు. స్విఫ్ట్‌ను కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది.

Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. పాత మోడళ్లతో పోలిస్తే కొత్తది ఆకర్షణీయంగా ఉంటుంది. చూడటానికి ఇది స్పోర్టీ డిజైన్ లాగా కనిపిస్తుంది. మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.92 లక్షల నుంచి మొదలకుని రూ.8.56 లక్షల వరకు ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో సేఫ్టీ పరంగా అధునాతన సదుపాయాలను అందించారు.
Tata Tiago: దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందినటువంటి టియాగో కారు భారత్‌లో మంచి డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్. ఈ కారు రూ.5 లక్షల నుంచి రూ.7.65 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది 1.2 పెట్రోల్, 1.05 డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. కారు లోపల సీట్లు కంఫర్ట్‌గా ఉంటాయి. క్యాబిన్‌లో కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కూడా మెరుగ్గానే ఉంటుంది.

సాధారణంగా హ్యాచ్‌బ్యాక్‌లు తక్కువ ధరల్లో లభిస్తూ చిన్న కుటుంబాలకు ఎక్కువ చేరువ అవుతాయి. ఫ్రెండ్స్ లేదా కుటుంబంతో కలిసి దగ్గరి ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు కూడా ఇవి అనువుగా ఉంటాయి. మైలేజ్ కూడా ఈ కార్లకు అధికంగానే వస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌లను కొనుగోలు చేయాలని చూస్తోన్న వారికి ఇవి సరిగ్గా సరిపోతాయి.


Click it and Unblock the Notifications








