రూ. 6 లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే కార్లు.. ఇవి ఇంట్లో ఉంటే మీ డబ్బు ఆదా అవుతుంది!
దేశంలో పండుగ సీజన్ షురూ అయ్యింది. దీంతో కొత్త కార్లు లాంచ్, అప్‌డేటెడ్ వెర్షన్ల రాకతో కార్ల షోరూమ్‌లు కిక్కిరిసిపోతున్నాయి. మునుపటిలా కాకుండా ముందే ఏ కారుని కొనాలో డిసైడ్ అవ్వడానికి వివిధ వెబెసైట్స్, న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియాల్లోని రివ్యూల ద్వారా కార్ల ఫీచర్లు, సేఫ్టీ, ధర, మైలేజీ అంశాలపై ఓ అంచనాకు వస్తున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు కేవలం ధరను మాత్రమే చెక్ చేసే జనాలు ఇప్పుడు దాని సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు మైలేజీకి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొంత మంది బడ్జెట్‌లో ఎలాంటి కారు తీసుకోవాలో తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. వారి కోసం, మేము తక్కువ ధరకు ఉత్తమ మైలేజీని అందించే టాప్ కార్లను జాబితాను ఇక్కడ అందిస్తున్నాము.
మార్కెట్‌లో మంచి మైలేజీ అందించే కార్లలో మారుతి సుజుకి (Maruti Suzuki Cars)ని మించిన కార్లు లేవనే చెప్పాలి. ఈ కార్లు చాలా సరసమైన ధరలో మంచి మైలేజీని అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీ కొనేవారికి ఈ కంపెనీ కార్లు సరిపోతాయి. ఈ స్టోరీలో రూ .6 లక్షల లోపు ఎక్కువ మైలేజీ కార్ల జాబితాను అందించాము. ఆ లిస్ట్‌పై ఓ లుక్కేయండి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్: ఈ జాబితాలోని టాప్ కారు అని చెప్పవచ్చు. ఇది 1.2 నేచ్‌రల్ ఆస్పిరేటెడ్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ కారు 19 కి.మీ నుంచి 27 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 5.99 లక్షల నుంచి 10.43 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
2024 మారుతి సుజుకి స్విఫ్ట్: ఈ 1.2-లీటర్ Z12E 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 24.8 కి.మీ నుంచి 32.8 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ రూ .5.99 లక్షల నుంచి 9.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఆల్‌రౌండర్ కారుగా పనిచేస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ఇది 1.0 K10 సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 24.44 కి.మీ నుంచి 32.72 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు ధర రూ .4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్: ఇది సీఎన్‌జీ వేరియంట్‌తో సహా 3 ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 23.56 కి.మీ నుంచి 34.04 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ వ్యాగన్ఆర్ ధరలు రూ .5.54 లక్షల నుంచి 7.33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారులో హెడ్‌రూమ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ భారతదేశంలో 1.0-లీటర్, 3-సిలిండర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ క్విడ్ 21.07 కి.మీ నుంచి 22 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారు ధర రూ.4.70 లక్షలు నుంచి 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులోని క్లైంబర్ వేరియంట్ స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది.
మారుతి సుజుకి సెలెరియో: మారుతి సెలెరియో 1.0 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 25.17 కి.మీ నుంచి 34.43 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధర రూ .4.99 లక్షల నుంచి 7.04 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర మధ్య ఉంది. ఈ కారు మారుతి సుజుకి నుంచి బెస్ట్ సెల్లింగ్ కారుగా కూడా ఉంది.


Click it and Unblock the Notifications








