మైలేజీలో టాప్10 SUVలు ఇవే.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దంచికొట్టుడే!
ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ అని ఠక్కున చెప్పేస్తారు. విభిన్న బాడీ స్టైల్, ఫర్ఫామెన్స్‌తో ఇవి మార్కెట్ అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. వీటిలో మైక్రో ఎస్‌యూవీలు లేదా సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలను జనాలు తెగ కొనేస్తున్నారు. తాజాగ కొనసాగుతున్న పండుగ సీజన్‌లోనూ ప్రజలు పెద్ద ఎత్తున ఎస్‌యూవీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మంచి ఇంటీరియర్ స్పేస్, డిజైన్, ఫీచర్స్, మైలేజీ వల్ల ఎస్‌యూవీలను జనాలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
నేడు మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ ధరకు ఎస్‌యూవీలను వస్తుండటంతో ప్రజలు వీటినే కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎస్‌యూవీలు మెరుగైన సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉండటం వల్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్‌యూవీల మైలేజీ కూడా ఎక్కువగానే ఉంటాయి. మార్కెట్‌లో ప్రస్తుతం మంచి మైలేజీ అందించే సబ్ 4 మీటర్ ఎస్‌యూవీల వివరాలు మీ కోసం..

ఈ జాబితాలో మారుతి బ్రెజా పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లో వస్తుంది. మాన్యువల్ వెర్షన్ లీటర్‌కి 17.38 నుంచి 19.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక ఆటోమేటిక్ వెేరియంట్స్ లీటరుకు 19.8 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక సీఎన్‌జీ కిలోకి 25.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఆ తర్వాత మారుతి సుజుకి ఫ్రాంక్స్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి సుజుకి NA పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్ లీటరుకు 21.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక ఫ్రాంక్స్ టర్బో ఇంజిన్ మాన్యువల్ వెర్షన్ లీటరుకు 21.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఫ్రాంక్స్ NA పెట్రోల్, టర్బో ఇంజిన్‌లు వరుసగా 22.89, 20.02 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి.

ఇక టాటా పంచ్ పెట్రోల్ MT లీటరుకు 20 కిలోమీటర్లు, పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజీ లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక పంచ్ సీఎన్‌జీ వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. పంచ్ సీఎన్‌జీ వెర్షన్ మైలేజ్ కిలోకు 27 కిలోమీటర్లను అందిస్తుంది. ఈ జాబితాలో నెక్ట్స్ కారు టాటా ఎస్‌యూవీ నెక్సాన్ డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. నెక్సాన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.5 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 17 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. డీజిల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ నెక్సాన్ సీఎన్‌జీ కిలోకి 24 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ నెక్సాన్ కావడం విశేషం.

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.89 నుంచి 20.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ గరిష్టంగా లీటరుకు 18.2 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటర్ కు 20.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఆ తర్వాత హ్యుందాయ్ వెన్యూ డీజిల్‌తో పాటు NA పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లలో వస్తుంది. వెన్యూ NA పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజీని, టర్బో మాన్యువల్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కేవలం టర్బో పెట్రోల్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని, టర్బో డీజిల్ వెర్షన్ లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఇక హ్యుందాయ్ ఎక్స్‌స్టర్ 19.2 కిలోమీటర్ల నుంచి సీఎన్‌జీ వెర్షన్ లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కియా సోనెట్ లీటరుకు 17.5 కిలోమీటర్లు అలాగే లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ జాబితాలో చివరి మోడల్ రెనాల్ట్ కిగర్ 17 నుంచి 20.7 మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








