2024లో టాప్‌ 7 సీటర్‌ కార్లు ఇవే.. వీటిలో రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లవచ్చు!

కుటుంబంతో దూర ప్రయాణాలకు వెళ్లే ట్రెండింగ్‌ దేశంలో కొనసాగుతోంది. దీంతో ఎక్కువ మంది సౌకర్యవంతంగా ఉండటానికి పెద్ద కార్లను ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్‌తో గత కొన్ని రోజులుగా 7 సీటర్‌ కారు అమ్మకాలు జోరందుకున్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న 10 కార్లలో 2 మోడళ్లు 7 సీటర్‌ కార్లు ఉంటున్నాయి. వీటి ద్వారా మీరు ట్రిప్స్‌, లాంగ్‌ డ్రైవ్స్‌ వెళ్లవచ్చు. భారీ డిజైన్‌, ఫీచర్లు, ఎక్కువ బూట్‌ స్పేస్‌ని కలిగి ఉంటాయి. కావున అందరూ వీటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. 2024లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీల వివరాలు మీకోసం..

ఈ జాబితాలో ఉన్న చివరి కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 700. ఇది మహీంద్రా నుంచి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా ఉంది. దీనిని కొత్తగా నపోలీ బ్లాక్ పెయింట్ స్కీమ్, అధునాతన ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది. దీని ధర రూ .16.90 లక్షల నుంచి రూ. 32.89 లక్షల మధ్య ఉంది. అడాస్‌ టెక్నాలజీతో భారత్‌లో అడుగుపెట్టిన తొలి ఎస్‌యూవీ ఇదే కావడం గమనార్హం.

Mahindra XUV 700 Sales

ఆ తర్వాత ఇన్నోవా క్రిస్టా 7 సీటర్‌ కారు సౌకర్యవంతమైన సీటింగ్, స్టాండర్డ్‌ ఫీచర్లతో భారీ ఇంటీరియర్‌ స్పేస్‌ని కలిగి ఉంటుంది. ఈ ఎంపీవీ, ఇన్నోవా హైక్రాస్‌ కలిపి నెలకు దాదాపు 9000 వరకు యూనిట్లు సేల్‌ అవుతున్నాయి. ఈ ఇన్నోవా క్రిస్టా ధరలు రూ .24.13 లక్షల నుంచి రూ .31.89 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉంటుంది. ఇందులో భారీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో థర్డ్ జనరేషన్ ప్రస్తుతం అమ్మకాల్లో అదరగొడుతోంది. 2024 మొదటి త్రైమాసికం నుంచి నెలకు దాదాపు 10,000 యూనిట్లను పైగా విక్రయిస్తోంది. థర్డ్ జనరేషన్ మోడల్ ధర రూ. 11.81 లక్షల నుంచి రూ.13.22 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యలో ఉంది. కుటుంబం కోసం చాలా మందికి ఈ కారుని కొంటున్నట్లు తేలింది. ఇప్పటికీ దీని డిమాండ్‌ ఏమాత్రం తగ్గడం లేదు.

Mahindra Bolero Car Sales

ఈ జాబితాలో టాప్‌ 2లో ఉన్న కారు మహీంద్రా స్కార్పియో. ఈ స్కార్పియో 2002 నుంచి మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. 2022 లో కొత్తగా లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ బ్రాండ్‌ విజయవంతమైన మోడల్‌గా అవతరించింది. ప్రస్తుతం మహీంద్రా భారతదేశంలో స్కార్పియో కోసం 10,000 యూనిట్లకు పైగా అమ్మకాలను కొనసాగిస్తోంది. దీని ఆన్-రోడ్ ధర రూ .16.34 లక్షల నుంచి రూ .29.94 లక్షల మధ్య ఉంది.

ఈ జాబితాలో మారుతి ఎర్టిగా తొలి స్థానంలో ఉంది. ఇది నెలకు సగటున 15,000 యూనిట్ల వరకు అమ్మకాలతో రాణిస్తోంది. ఈ మల్టీ పర్పస్ వెహికల్ సేల్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీని ఆన్‌రోడ్‌ ధర రూ .10.12 లక్షల నుంచి రూ .15.34 లక్షల మధ్య ఉన్నాయి. ఇది కొన్ని నెలల్లో టాప్‌ సెల్లింగ్‌ కారుగా నిలిచింది.

Maruti Ertiga MPV Sales

మీరు కూడా ఓ ఫ్యామిలీ కారు కోసం చూస్తున్నట్లైతే ఇవి మీకు సరిపోతాయి. కావున మీ అభిరుచికి తగినట్లుగా మారుతి ఎర్టిగా నుంచి మొదలు ఇతర మోడళ్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం 7-సీటర్ కార్ల సెగ్మెంట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అందరికీ అనువుగా చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉండటం గమనార్హం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 12, 2024, 17:05 [IST]
English summary
Best selling 7 seater cars in india 2024 check models and price details
Read more on: #year ender 2024 #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+